మొహెంజో దారో (సినిమా)
మొహెంజో దారో | |
---|---|
![]() | |
దర్శకత్వం | అశుతోష్ గోవారికర్ |
రచన | అశుతోష్ గోవారికర్ ప్రీతి మంగైన్ (డైలాగ్) |
నిర్మాత |
|
తారాగణం | హృతిక్ రోషన్ పూజా హెగ్డే కబీర్ బేడీ మనీష్ చౌదరి అరుణోదయ సింగ్ |
ఛాయాగ్రహణం | సి. కే. మురళీధరన్ |
కూర్పు | సందీప్ ఫ్రాన్సిస్ |
సంగీతం | ఎ. ఆర్. రెహమాన్ |
నిర్మాణ సంస్థ | అశుతోష్ గోవారికర్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
పంపిణీదార్లు | యు టీవీ మోషన్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 2016 ఆగస్టు 12 |
సినిమా నిడివి | 169 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | 115 కోట్లు[2] |
బాక్సాఫీసు | 107.75 కోట్లు[3] |
మొహెంజో దారో 2016లో విడుదలైన హిందీ సినిమా. యు టీవీ మోషన్ పిక్చర్స్, అశుతోష్ గోవారికర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై సిద్ధార్థ్ రాయ్ కపూర్, సునీతా గోవారికర్ నిర్మించిన ఈ సినిమాకు అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించాడు. హృతిక్ రోషన్, పూజా హెగ్డే, అరుణోదయ్ సింగ్, కబీర్ బేడీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగష్టు 12న విడుదలైంది.[4]
కథ[మార్చు]
సర్మన్(హృతిక్ రోషన్) మొహెంజొ దారో నగరానికి దగ్గర్లోని అమ్రిపురే గ్రామానికి చెందిన రైతు బిడ్డ. నగరాన్ని చూడాలన్న కోరికతో మొహెంజదారోకు వెళ్లగా ఆ నగరాన్ని పాలిస్తున్ననియంత రాజు మహాన్ (కబీర్ బేడీ) ఆగడాలకు అమాయకులు బలవుతుంటారు. అక్కడి పరిస్థితులు చూసి అక్కడి నుండి వెళ్లిపోవాలని సర్మన్ అనుకుంటాడు. ఈ క్రమంలో అక్కడే ఓ పూజారి కూతురు చానీ (పూజా హెగ్దే)ని చూసి ప్రేమలో పడతాడు. కానీ చానీని తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలని రాజు కోరిక, కానీ చానీని సర్మన్ ఎలా ప్రేమలో దింపాడు. అమెను ఎలా సొంతం చేసుకున్నాడు? రాజును ఎలా ఎదిరించి నిలబడ్డాడన్నదే మిగితా సినిమా కథ.[5]
నటీనటులు[మార్చు]
- హృతిక్ రోషన్
- పూజా హెగ్డే
- కబీర్ బేడీ
- మనీష్ చౌదరి
- అరుణోదయ్ సింగ్
- సుహాసిని ములే
- నితీష్ భరద్వాజ్
- కిషోరి షహానే
- శరద్ కేల్కర్
- జీవిధా శర్మ
- నరేంద్ర ఝా
- షాజీ చౌదరి
- తుఫాయిల్ ఖాన్
- దిగంతా హజారీ
- నైనా త్రివేది
- శైరా రాయ్
- ఉమంగ్ వ్యాస్
- కాసే ఫ్రాంక్
- మైక్ హోమిక్
మూలాలు[మార్చు]
- ↑ Weissberg, Jay (16 August 2016). "Film Review: 'Mohenjo Daro'". variety.com. Variety Media. Retrieved 29 July 2017.
- ↑ "Lionsgate Films to begin producing movies in India". Livemint. Retrieved 13 August 2017.
- ↑ "Box Office: Worldwide collections of Hrithik Roshan's Mohenjo Daro". Bollywood Hungama. Retrieved 12 November 2017.
- ↑ News18 (18 May 2016). "Ashutosh Gowariker's 'Mohenjo Daro' To Be Released On August 12" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2022. Retrieved 18 June 2022.
- ↑ DNA India (2016). "Mohenjo Daro review: Except for Hrithik Roshan, rest of the film belongs to a bygone era" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2022. Retrieved 18 June 2022.