మోక్షగుండం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


మోక్షగుండం
రెవిన్యూ గ్రామం
మోక్షగుండం is located in Andhra Pradesh
మోక్షగుండం
మోక్షగుండం
నిర్దేశాంకాలు: 15°25′16″N 79°02′10″E / 15.421°N 79.036°E / 15.421; 79.036Coordinates: 15°25′16″N 79°02′10″E / 15.421°N 79.036°E / 15.421; 79.036 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, మార్కాపురం రెవిన్యూ డివిజన్
మండలంబేస్తవారిపేట మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం974 హె. (2,407 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం2,127
 • సాంద్రత220/కి.మీ2 (570/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08406 Edit this at Wikidata)
పిన్(PIN)523334 Edit this at Wikidata

మోక్షగుండం ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలంలోని ఒక చిన్న శ్రోత్రీయ గ్రామం.[1] పిన్ కోడ్: 523334., ఎస్.టి.డి.కోడ్ = 08406.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామానికి రెండు కిలోమీటర్లు తూర్పున ఒక చిన్న కొండపై ముక్తేశ్వరము అను శివాలయము ఉంది. ప్రతి యేటా మాఘ మాసములో (ఫిబ్రవరి) జరిగే ముక్తేశ్వర స్వామి జాతరకు అనేక మంది భక్తులు చుట్టుపక్కల ప్రదేశముల నుండి విచ్చేస్తారు. ఈ గుడి దగ్గర ఉన్న పవిత్ర గుండములో స్నానము చేసిన వారికి మోక్షము కలుగునని స్థానికులు భావిస్తారు. అందుకే ఈ ఊరికి మోక్షగుండo అని పేరు వచ్చింది.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

సోమిదేవిపల్లి 4 కి.మీ, పందిల్లపల్లి 4 కి.మీ, గుడిమెట్ట 7 కి.మీ, బసినెపల్లి 8 కి.మీ, పిట్టికాయగుళ్ల 8 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

ఉత్తరాన బెస్తవారిపేట మండలం, ఉత్తరాన కంభం మండలం, పడమరన గిద్దలూరు మండలం, దక్షణాన కొమరోలు మండలం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల[మార్చు]

ఈ పాఠశాల అభివృద్ధికై, సెయింట్ సంస్థ (CYIENT) వారు 2016, మే-19న ఆరు లక్షల రూపాయలను అందజేసినారు. [9]

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ ముక్తేశ్వర క్షేత్రం[మార్చు]

పరశురాముడు తన తండ్రి జమదగ్ని ఆజ్ఞతో తల్లి రేణుకాదేవిని హతమార్చి పాపపరిహారానికై ఇక్కడి గుడిలో ఉన్న లింగాన్ని పూజించి ముక్తి పొందుటచే దీనికి ముక్తేశ్వర క్షేత్రంగా పేరు వచ్చినట్టు స్థలపురాణంలో చెప్పబడింది. గర్భగుడిలోని లింగాన్ని వశిష్ఠుడు ప్రతిష్ఠ చేశాడని ఆ పురాణం ద్వారా తెలుస్తుంది. శ్రీరాముడు సతీసమేతంగా అరణ్యవాసం చేయు సమయాన తండ్రి దశరథుని సంవత్సరీకం వచ్చింది. ఆ సందర్భంలో నీరు లభించని కారణంగా బాణం వేసి పాతాళగంగ ను పైకి తెచ్చినట్టు పురాణంలో పేర్కొనబడింది. ఈ స్థలంలో నిర్మించిన కోనేరు, శ్రీరాముని కోనేరు గా నేటికీ పిలవబడుచున్నది. ఇచ్చటగల అమ్మవారిని భ్రమరాంబగా కొలుస్తారు.

ఈ ఆలయంలో 2014, జూన్-18, బుధవారం ఉదయం 11 గంటలకు, ఆదిత్యాది నవగ్రహ మృత్యుంజయ యంత్ర బింబ ప్రతిష్ఠ నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. [4]

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

యోగి వేమన విగ్రహం[మార్చు]

గ్రామంలోని యోగి వేమన విగ్రహం వద్ద, వేమన జయంతి సందర్భంగా, 2015, మార్చి-25వ తేదీనాడు, పూజా కార్యక్రమం నిర్వహించెదరు. అనంతరం పద్యగానం కార్యక్రమం ఏర్పాటుచేసెదరు. [7]

గ్రామంలో జన్మించిన ప్రముఖులు[మార్చు]

భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య యొక్క పూర్వీకులు ఈ గ్రామం నుండే కన్నడ దేశానికి వలస వెళ్లారు. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ CYIENT (సెయింట్) అధినేత శ్రీ బి.వి.మోహనరెడ్డి (బోధనపు వెంకట రామమోహన రెడ్డి) :- వీరు 2017, జనవరి-26న భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైనారు. [9]

గ్రామ విశేషాలు[మార్చు]

 1. స్థానిక పంచాంగములు లెక్కలు కట్టే గ్రామానికి చెందిన జ్యోతిష్యులు ఈ ప్రదేశములో పేరుపొందారు.
 2. మోక్షగుండంలో పూర్వం శివానంద ఆశ్రమం కూడా ఉన్నట్టు శాసనాల ద్వారా తెలుస్తుంది. బ్రహ్మ కైలాస శివానందాశ్రమం - మోక్షగుండం వారి ధర్మం అని ఒక శిలాశాసనంపై రాయబడి ఉంది.
 3. ఈ గ్రామానికి చెందిన శ్రీ దొంతా పెద్దపోలయ్య కుమారుడైన వెంకటశ్రీనివాసులు, 2010-12 సం.లలో గుజరాతులోని జునాగఢ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్.సి. (ఎగ్రికల్చర్) చదివి, దానిలో ప్రథముడిగా నిలిచి బంగారు పతకం సాధించాడు. 2014, జనవరి-15న జరిగిన స్నాతకోత్సవంలో వీరీ పురస్కారాన్ని గుజరాతు గవర్నరు శ్రీమతి కమలాబెన్ చేతులమీదుగా అందుకున్నారు. [3]
 4. ఈ గ్రామానికి చెందిన శ్రీ నరాల రవీంద్రరెడ్డి, ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగు కళాశాలలో ఇ.సి.ఇ. విభాగంలో చదువుచూ, 2012-13 విద్యాసంవత్సరంలో, వార్షిక పరీక్షలలో, 9.11 గ్రేడ్ సాధించి, టాపరుగా నిలిచి, 2014, సెప్టెంబరు-29న వైస్-ఛాన్సిలరు శ్రీ జి.ఎస్.ఎన్. రాజుగారి చేతులమీదుగా బంగారు పతకం అందుకున్నాడు. [5]
 5. ఈ గ్రామంలో శ్రీ ఆవుల లక్ష్మీరెడ్డి అను ఒక ప్రజానాట్య మండలి కళాకారుడు ఉన్నారు. వీరు 65 సంవత్సరాల వయస్సులో 2016, మే-13న అనారోగ్యంతో తన నివాసంలో కాలధర్మం చెందినారు. [8]
 6. ఈ గ్రామస్థులైన CYIENT (సెయింట్) సంస్థ అధినేత శ్రీ బి.వి.మోహనరెడ్డి, ఈ గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా తీర్చిదిద్దటానికై ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. [9]
 7. ఈ గ్రామానికి చెందిన ఆవుల శ్రీవేద, మైక్రోబయాలజీలో పరిశోధనలకుగాను, యోగివేమన విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. సాల్వాట్ జనిక్ బ్యాక్టీరియాను ఉపయోగించి వ్యవసాయ వ్యర్ధాల నుండి అవిటోన్, బ్యుటనాల్, ఇథనాల్ వంటి జీవ సాంకేతిక ఇంథనాల తయారీ అను అంశంపై పరిశోధనలు పూర్తిచేయడంతో వీరికి డాక్టరేట్ ప్రదానం చేసారు. [10]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,127 - పురుషుల సంఖ్య 1,065 - స్త్రీల సంఖ్య 1,062 - గృహాల సంఖ్య 584;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,102.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,082, మహిళల సంఖ్య 1,020, గ్రామంలో నివాస గృహాలు 488 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 974 హెక్టారులు.

 • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు[మార్చు]

 1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
 2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
 • ఆంధ్ర ప్రదేశ్ దేవాలయాలు దర్శనీయస్థలాలు - మమత పేజీ.43

వెలుపలి లింకులు[మార్చు]

[3] ఈనాడు ప్రకాశం; 2014, జనవరి-17; 6వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2014, జూన్-18; 4వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2014, అక్టోబరు-3; 14వపేజీ. [7] ఈనాడు ప్రకాశం; 2015, మార్చి-25; 4వపేజీ. [8] ఈనాడు ప్రకాశం; 2016, మే-14; 5వపేజీ. [9] ఈనాడు ప్రకాశం; 2017, జనవరి-26; 1వపేజీ. [10] ఈనాడు ప్రకాశం; 2017, జూన్-28; 4వపేజీ.