మోటూరు ఉదయం
మోటూరు ఉదయం (13 అక్టోబర్ 1924-31 మార్చి 2002) ఒక రాజకీయ నాయకురాలు, మహిళా హక్కుల కార్యకర్త. ఆమె పద్దెనిమిది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం ప్రధాన కార్యదర్శిగా, ఆపై 1992 నుండి 2001 మధ్య సంస్థకు గౌరవ అధ్యక్షురాలిగా ఉంది. 1981 నుండి 2001 మధ్య ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘానికి అనుబంధంగా ఉన్న ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలిగా కూడా పనిచేసింది.[1]
జీవితం
[మార్చు]గుంటూరు జిల్లా తురుమెళ్ళ గ్రామంలో ఉదయం జన్మించింది. ఆమె తురుమెళ్ల గ్రామంలోని కమ్యూనిస్టు సానుభూతిపరుల కుటుంబం నుండి వచ్చింది. కమ్యూనిస్టు నాయకుడు మోటూరు హనుమంతరావు వివాహం చేసుకుంది. తన భర్తతో కలిసి 1940-1945, 1949-1951 కాలంలో అజ్ఞాతంలో ఉన్నారు. ఈ కాలంలో ఆమె ఫాసిస్ట్ వ్యతిరేక ప్రచార కార్యకలాపాలలో భాగంగా, మొదటి మహిళా బుర్రకథ సాంస్కృతిక బృందానికి నాయకత్వం వహించింది. ఆమె ఆంధ్రప్రదేశ్ సైకిల్ తొక్కిన మొదటి మహిళగా కూడా ప్రసిద్ధి చెందింది.[1]
1964లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా విడిపోయినప్పుడు, ఆమె కమ్యూనిస్టు పార్టి ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) పక్షాన నిలబడింది.[1] ఎమర్జెన్సీ సమయంలో అణచివేత నుండి తప్పించుకోవడానికి ఆమె మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్ళింది.[1]
2002లో విజయవాడలో ఆమె మరణించింది. ఆమె మరణం తరువాత, ఆమె జ్ఞాపకార్థంగా మోటూరు ఉదయం ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఉదయంతో కలిసి ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘాన్ని నిర్మించిన మల్లు స్వరాజ్యం దాని మేనేజింగ్ ట్రస్టీ.[2]
రచనలు
[మార్చు]ఉదయం, కాంగ్రాసు పాలన ప్రతిబింబమే మహిళాలకి అధోగతి, మహిళాలా బధమయ జీవిత గుండె చపుళ్లు: ఆడుగడుగున వ్యాథలు-విషద గాథలు, ఇంకా మహిళలాకు హింసల నుండ విముక్తి ఎప్పుడు? వంటి ప్రచురణల రచయిత.[3]
ఉదయం గురించి, మనకు తెలియని మన చరిత్ర: తెలంగాణా రైతాంగ పోరాటంలో స్త్రీలు, బ్రేకింగ్ బేరియర్స్: స్టోరీస్ అఫ్ ట్వెల్వ్ విమెన్ పుస్తకాలలో రచించారు.[4][5][6]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 People's Democracy, 21 April 2002 Archived 24 జూలై 2011 at the Wayback Machine
- ↑ The Hindu, 13 August 2005
- ↑ "Amazon.co.uk: Moturu Udayam: Books". www.amazon.co.uk. Retrieved 2017-12-30.
- ↑ "మనకు తెలియని మన చరిత్ర : తెలంగాణా రైతాంగ పోరాటంలో స్త్ర…". Goodreads (in ఇంగ్లీష్). Retrieved 2025-03-20.
- ↑ Menon, Parvathi (2005). Breaking Barriers ; Stories of Twelve Women. Left Word Books.
- ↑ "ప్రతిధ్వనించే పుస్తకం | Review of Manaku Teliyani mana Charitra Book | Sakshi". www.sakshi.com. Retrieved 2025-03-20.