మోడెం బాలకృష్ణ
మోడెం బాలకృష్ణ | |
|---|---|
| జననం | 1965 అక్టోబర్ 31 |
| మరణం | 2025 సెప్టెంబర్ 11 |
| జాతీయత | |
| వృత్తి | మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు |
| Parent(s) | మోడెం వెంకటేశ్వర్లు గౌడ్, మల్లికాంబ |
మోడెం బాలకృష్ణ భారతదేశానికి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు. భాస్కర్ అలియాస్ మనోజ్, బాలన్న, రామచంద్ర పేర్లతో పనిచేసిన బాలకృష్ణ తరువాత కాలంలో మావోయిస్టు పార్టీ ఒడిశా రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి ఆ తరువాత కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]
జననం, విద్యాభాస్యం
[మార్చు]మోడెం బాలకృష్ణ 1965 అక్టోబర్ 31న తెలంగాణ రాష్ట్రం, హనుమకొండ జిల్లా, కాజీపేట మండలం, మడికొండ గ్రామంలో మోడెం వెంకటేశ్వర్లు గౌడ్, మల్లికాంబ దమ్పతులకు జన్మించాడు. ఆయన తండి వెంకటేశ్వర్లు పోస్టల్ ఉద్యోగి కావడంతో ఆరో తరగతి వరకు మడికొండ గ్రామంలో చదువుకున్న ఆయన తండ్రికి బదిలీ కావడంతో హైదరాబాద్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఆయన సుల్తాన్‌బజార్‌లోని ప్రభుత్వం పాఠశాలలో పదో తరగతి వరకు, 1983లో మలక్‌పేటలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశాడు. ఆయన విద్యార్థి దశలోనే రాడికల్ స్టూడెంట్ యూనియన్‌లో క్రియాశీలక పాత్ర పోషించాడు.
ఉద్యమంలో
[మార్చు]మోడెం బాలకృష్ణ 1983లో సీనియర్ మావోయిస్టు కమాండర్లు సాంబమూర్తి, సంతోష్ రెడ్డి నేతృత్వంలోని విప్లవాత్మక విద్యార్థి బృందంతో ప్రభావితమై, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహించడానికి భద్రాచలం అడవుల్లోకి వెళ్లాడు. ఆయనను 1984లో భద్రాచలంలో మొదట అరెస్టు చేసి 1986 చివరి వరకు వరంగల్ సెంట్రల్ జైలులో ఉంచారు. ఆయన విడుదలైన తర్వాత హైదరాబాద్‌కు తిరిగి వచ్చి మహబూబ్‌నగర్ పట్టణంలోని ఒక సురక్షితమైన ఇంట్లో గృహ నిర్బంధంలో ఉంచబడ్డారు.
1987లో మహబూబ్ నగర్ పోలీసులు అతని రహస్య స్థావరంపై దాడి చేసి అరెస్టు చేయగా జనవరి 1990లో కిడ్నాప్ చేయబడిన టిడిపి ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రావుకు బదులుగా అతన్ని విడుదల చేశారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ పట్టణ ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించాడు.
మోడెం బాలకృష్ణ ఏప్రిల్ 1991లో మహబూబ్‌నగర్ జిల్లా కార్యదర్శిగా పని చేసి, ఆ తర్వాత మే 1991లో దక్షిణ తెలంగాణ రీజినల్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యాడు. ఆయన మార్చి 1993లో కర్నూలు జిల్లాలో పట్టుబడి చంచల్‌గూడ సెంట్రల్ జైలులో ఉన్నాడు. ఆయనకు 1999లో షరతులతో కూడిన బెయిల్ పై విడుదలై తర్వాత మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆయన ఒడిశా రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీకి కార్యదర్శిగా నియమితులయ్యాడు.
నయాగఢ్ నక్సలైట్ దాడి
[మార్చు]ఒడిశాలోని నయాగఢ్‌లో 2008 ఫిబ్రవరి 15న మావోయిస్టులు దాడి చేసి 13 మంది పోలీసు సిబ్బందితో సహా 14 మందిని చంపారు. గ్రెనేడ్లు, పెట్రోల్ బాంబులు & భారీ కాల్పులను ఉపయోగించి వారు ఆయుధాలు & మందుగుండు సామగ్రిని దోచుకున్నారు. ఈ దాడిలో మోడెం బాలకృష్ణ కీలక వ్యూహకర్త. ఆయన ఒడిశా రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పని చేసి 2000ల ప్రారంభం నుండి అనేక ప్రధాన నక్సలైట్ దాడులకు బాధ్యత వహించి ఆంధ్ర-ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ (AOBSZC)లో చురుకుగా ఉన్నాడు.[3]
నయాగఢ్ దాడి జరిగిన నాలుగు నెలల తర్వాత 2008 జూన్ 29న బలిమెల జలాశయంపై పడవ దాడిని ప్లాన్ చేయడంలో, అమలు చేయడంలో మోడెం బాలకృష్ణ కీలక పాత్ర పోషించాడు. ఈ దాడిలో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు చెందిన 37 మంది గ్రేహౌండ్స్ కమాండోలు జలమార్గాలలో మొదటిసారిగా జరిగిన ఆకస్మిక దాడిలో మరణించారు.
మరణం
[మార్చు]మోడెం బాలకృష్ణ 2025 సెప్టెంబర్ 11న ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. మోడెం బాలకృష్ణని ₹1 కోటి బహుమతి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపాడు. [4][5][6][7][8][9]
మూలాలు
[మార్చు]- ↑ "10 మంది నక్సల్స్ ఎన్‌కౌంటర్". NT News. 12 September 2025. Retrieved 15 September 2025.
- ↑ "విప్లవోద్యమంలో జంగ్ సైరన్..!". Andhrajyothy. 13 September 2025. Archived from the original on 15 September 2025. Retrieved 15 September 2025.
- ↑ "Key Maoist leader Modem Balakrishna, Architect of Nayagarh attack, killed in encounter" (in ఇంగ్లీష్). The New Indian Express. 8 September 2025. Archived from the original on 15 September 2025. Retrieved 15 September 2025.
- ↑ "ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్". Sakshi. 12 September 2025. Archived from the original on 15 September 2025. Retrieved 15 September 2025.
- ↑ "గరియాబంద్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు తెలంగాణవాసులు". V6 Velugu. 13 September 2025. Archived from the original on 15 September 2025. Retrieved 15 September 2025.
- ↑ "జంగ్‌కే సై అన్నాడు… జంగల్‌లోనే అమరుడయ్యాడు". Mana Telangana. 12 September 2025. Archived from the original on 15 September 2025. Retrieved 15 September 2025.
- ↑ "Top Maoist among 10 killed in Chhattisgarh encounter" (in Indian English). The Hindu. 11 September 2025. Archived from the original on 15 September 2025. Retrieved 15 September 2025.
- ↑ "Top Maoist Balakrishna, 9 other Naxals killed in Ch'garh encounter". The Times of India. 12 September 2025. Archived from the original on 15 September 2025. Retrieved 15 September 2025.
- ↑ "Inside Gariaband Encounter: Who Was Balakrishna, Top Maoist Leader Killed In One Of Biggest Anti-Naxal Ops In Chhattisgarh" (in ఇంగ్లీష్). ETV Bharat News. 13 September 2025. Archived from the original on 15 September 2025. Retrieved 15 September 2025.