Jump to content

మోతీలాల్ బి.నాయక్

వికీపీడియా నుండి
జస్టిస్ డాక్టర్, మోతీలాల్ బి. ‌నాయక్
మోతీలాల్ బి.నాయక్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1992 ఫిబ్రవరి 5 - 15 ఏప్రిల్ 2004
నియమించిన వారు శంకర్ దయాళ్ శర్మ

వ్యక్తిగత వివరాలు

జననం 15 ఏప్రిల్ 1942
నాగినాయనిచెరువు తాండ, సోమందేపల్లి మండలం, శ్రీ సత్యసాయి జిల్లా ,ఆంధ్రప్రదేశ్, ఇండియా.

జస్టిస్ డాక్టర్,మోతీలాల్ బి. నాయక్ భారతీయ న్యాయమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి. ఆయన 5 ఆగష్టు 1988 లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేసి, 5 ఫిబ్రవరి 1992లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొంది, 15 ఏప్రిల్ 2004 వరకు పని చేసి పదవీ విరమణ పొందాడు[1][2][3].

జననం, విద్యాభాస్యం

[మార్చు]

జస్టిస్ డాక్టర్ మోతీలాల్ బి.నాయక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీ సత్యసాయి జిల్లా ,సోమందేపల్లి మండలంలోని నాగినాయనిచెరువు తాండలో 1942 ఎప్రిల్ 15న జన్మించాడు[4][5]. ఆయన 1959-60లో అనంతపురంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ప్రీ-యూనివర్సీటీ కోర్సులు పూర్తి చేశాడు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి న్యాయ శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసి న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నాడు.1996లో కాకతీయు విశ్వవిద్యాలయం వరంగల్ లో డీన్ గా పనిచేసిన అనంతరం 8 జనవరి కాకతీయు యూనివర్సిటీలో 13 వ స్నాతకోత్సవం జరిగింది. అతని సేవలను గుర్తించిన విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లాస్ ఆనరిస్ కాసా గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.

వృత్తి జీవితం

[మార్చు]

జస్టిస్ డాక్టర్ మోతీలాల్ బి ‌నాయక్ 5 ఆగష్టు 1988 లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా ‌నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వివిధ విభాగాల్లో పని చేశారు. 05 ఫిబ్రవరి 1992 లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 1980 సంవత్సరం నుండి 1983 వరకు ‌సెనేట్ సభ్యుడిగా సేవలందించాడు. అతని సేవలను గుర్తించిన ప్రభుత్వం కాకతీయ విశ్వవిద్యాలయము లో 1994లో డీన్ గా నియమించింది. డీన్ గా బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాల 1996 వరకు పని చేస్తూ న్యాయమూర్తి అత్యుత్తమ సేవలందించారు. 15 ఏప్రిల్ 2004 న పదవీ విరమణ పొందాడు.

మూలాలు

[మార్చు]
  1. "Motilal B. Naik - Judgement | Courtkutchehry". www.courtkutchehry.com. Retrieved 2025-03-22.
  2. "Motilal Naik appointed acting CJ of AP HC". The Times of India. 2002-12-21. ISSN 0971-8257. Retrieved 2025-03-22.
  3. "High Court for the State of Telangana". tshc.gov.in. Retrieved 2025-03-22.
  4. Bharat, E. T. V. (2020-10-11). "AP village at the forefront in securing government jobs". ETV Bharat News (in ఇంగ్లీష్). Retrieved 2025-03-22.
  5. "Naginayani Cheruvu Thanda Now Employees Hub Details Inside - Sakshi". www.sakshi.com. Retrieved 2025-03-22.