మోత్కుపల్లి నర్సింహులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మోత్కుపల్లి నర్సింహులు
మోత్కుపల్లి నర్సింహులు


మాజీ మంత్రి
నియోజకవర్గం ఆలేరు శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్
నివాసం హైదరాబాదు, తెలంగాణ
మతం హిందూ

మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశాడు. ఆయన సుదీర్ఘ కాలం తెలుగుదేశం పార్టీలో పనిచేశాడు. 2018లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్) అభ్యర్థిగా ఆలేరు పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.[1]

రాజకీయ ప్రస్థానం[మార్చు]

మోత్కుపల్లి నర్సింహులు 1983లో తొలిసారి ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి, కాంగ్రెస్ అభ్యర్థి సల్లూరు పోశయ్యపై గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. మోత్కుపల్లి నర్సింహులు 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన సమయంలో టీడీపీలో చేరాడు. 1985లో ఆలేరు నుండి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేసి, కాంగ్రెస్ అభ్యర్థి చెట్టుపల్లి కెన్నెడీపై గెలిచి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.నర్సింహులు 1991లో నంద్యాల లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పీవీ నరసింహారావు పై పోటీచేసి ఓడిపోయాడు. [2][3][4]

తెలంగాణ ఏర్పాటుపై టిడిపి అధ్యక్ష్యుడు చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనను వ్యక్తంచేయడంతో 2018, మే 28న తెలుగుదేశం పార్టీ నుండి మోత్కుపల్లిని బహిష్కరించారు.[5] మోత్కుపల్లి నర్సింహులు 4 నవంబరు 2019లో భారతీయ జనతా పార్టీలో చేరి,[6] 23 జులై 2021న రాజీనామా చేశాడు.[7] మోత్కుపల్లి నర్సింహులు 18 అక్టోబర్ 2021న తెలంగాణ భ‌వ‌న్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాడు.[8]

పోటీ చేసిన నియోజకవర్గాలు[మార్చు]

సంవత్సరం పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు ఫలితం
1983 ఆలేరు ఎస్.సి రిజర్వడ్ మోత్కుపల్లి నర్సింహులు ఇండిపెండెంట్ 26589 సల్లూరు పోశయ్య భారత జాతీయ కాంగ్రెస్ 18914 గెలుపు
1985 ఆలేరు ఎస్.సి రిజర్వడ్ మోత్కుపల్లి నర్సింహులు తె.దే.పా 49068 చెట్టుపల్లి కెన్నెడీ భారత జాతీయ కాంగ్రెస్ 12922 గెలుపు
1989 ఆలేరు ఎస్.సి రిజర్వడ్ మోత్కుపల్లి నర్సింహులు ఇండిపెండెంట్ 44953 యాదగి బాసని సున్నం తెలుగుదేశం పార్టీ 32472 గెలుపు
1994 ఆలేరు ఎస్.సి రిజర్వడ్ మోత్కుపల్లి నర్సింహులు తెలుగుదేశం పార్టీ 69172 డా.కుడుదుల నగేష్ భారత జాతీయ కాంగ్రెస్ 30197 గెలుపు
1999 ఆలేరు ఎస్.సి రిజర్వడ్ మోత్కుపల్లి నర్సింహులు భారత జాతీయ కాంగ్రెస్ 55384 డా.కుడుదుల నగేష్ తెలుగుదేశం పార్టీ 47767 గెలుపు
2004 ఆలేరు ఎస్.సి రిజర్వడ్ డా.కుడుదుల నగేష్ తెలంగాణ రాష్ట్ర సమితి 66010 మోత్కుపల్లి నర్సింహులు తె.దే.పా 41185 ఓటమి
2008 ఆలేరు (ఉప ఎన్నికలు) ఎస్.సి రిజర్వడ్ డా.కుడుదుల నగేష్ తెలంగాణ రాష్ట్ర సమితి 45867 మోత్కుపల్లి నర్సింహులు తెలుగుదేశం పార్టీ 41943 ఓటమి
2009 తుంగతుర్తి ఎస్.సి రిజర్వడ్ మోత్కుపల్లి నర్సింహులు తెలుగు దేశం పార్టీ 45867 గెలుపు
2014 మధిర (ఎస్.సి) మల్లు భట్టివిక్రమార్క భారత జాతీయ కాంగ్రెస్ N.A మోత్కుపల్లి నర్సింహులు తెలుగుదేశం పార్టీ N.A ఓటమి
2018 ఆలేరు జనరల్ గొంగిడి సునీత తెలంగాణ రాష్ట్ర సమితి మోత్కుపల్లి నర్సింహులు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఓటమి

మూలాలు[మార్చు]

  1. Sakshi (24 July 2021). "ఆరుసార్లు ఎమ్మెల్యేగా.. అయినా దక్కని గవర్నర్, రాజ్యసభ పదవులు". Archived from the original on 24 జూలై 2021. Retrieved 24 July 2021.
  2. NTV Telugu. "జనసేనలోకి మోత్కుపల్లి...!". Archived from the original on 30 ఏప్రిల్ 2021. Retrieved 30 April 2021.
  3. Sakshi (27 November 2018). "హ్యాట్రిక్‌.. వీరులు!". Sakshi. Archived from the original on 2 జూన్ 2021. Retrieved 2 June 2021.
  4. Sakshi (16 March 2015). "'2019లో టీడీపీదే అధికారం'". Sakshi. Archived from the original on 28 జూన్ 2021. Retrieved 28 June 2021.
  5. The Times of India, PTI / (28 May 2017). "TDP expels senior leader Motkupalli Narasimhulu from party | India News - Times of India". Archived from the original on 30 ఏప్రిల్ 2021. Retrieved 30 April 2021.
  6. The New Indian Express (5 November 2019). "Former TDP leader Motkupalli joins BJP". Archived from the original on 30 ఏప్రిల్ 2021. Retrieved 30 April 2021.
  7. Sakshi (23 July 2021). "బీజేపీకి మోత్కుపల్లి రాజీనామా." Archived from the original on 23 జూలై 2021. Retrieved 23 July 2021.
  8. Namasthe Telangana (18 October 2021). "టీఆర్ఎస్ పార్టీలో చేరిన మోత్కుప‌ల్లి న‌ర్సింహులు". Archived from the original on 18 అక్టోబరు 2021. Retrieved 18 October 2021.