మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రతి ప్రతిరక్షక పదార్థం ఒక్క ప్రత్యేక ప్రతి జనకాన్ని మాత్రమే బంధిస్తుంది

మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ అనేది ప్రత్యేకంగా లక్ష్య కణాలను బంధించడానికి ఉద్దేశించిన మోనోక్లోనల్ యాంటీబాడీస్ (లేదా mAb) ప్రయోజనంగా చెప్పబడుతుంది. ఇది తర్వాత రోగి యొక్క వ్యాధినిరోధక వ్యవస్థ ఆ కణాలపై దాడి చేసే విధంగా ఉత్తేజపరుస్తుంది. ఏదైనా కణబాహ్య/కణ ఉపరితల లక్ష్యానికి ఒక mAbను సృష్టించడం దాదాపు సాధ్యమే. ఈ దిశగా అసంఖ్యాక తీవ్రమైన వ్యాధుల (రిమాటోయిడ్ అరిథ్రిటిస్ (కీళ్లవాపు), మల్టిపుల్ స్క్లెరోసిస్ (నాడీ శాఖలపై తొడుగు క్షీణత వల్ల సంభవించే కండర బలహీనత) మరియు వివిధ రకాల క్యాన్సర్‌లు వంటివి) కు అవసరమైన మోనోక్లోనళ్ల (ఏకరూప ప్రతిరక్షక పదార్థాలు) సృష్టికి, ప్రస్తుతం విస్తృతమైన పరిశోధన మరియు అభివృద్ధి జరుగుతోంది. mAbలను చికిత్సకు ఉపయోగించే విధంగా అసంఖ్యాక మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు, mAb చికిత్సను ప్రాణాంతక కంతి (శోధం) కణాలను నాశనం చేయడానికి మరియు కంతి పెరుగుదలను విశిష్ట కణ గ్రాహకాలను అడ్డుకోవడం ద్వారా నిరోధించడానికి ఉపయోగించవచ్చు. అయితే చికిత్సలో పలు వ్యత్యాసాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, రేడియోఇమ్యూనోథెరపీ. ఇందులో వికిరణోత్తేజిత మోతాదు లక్ష్య కణ క్రమంపై దృష్టి సారించి, లక్ష్యానికి ప్రాణాంతకమైన రసాయన మోతాదులను అందిస్తుంది.[1]

మానవ మరియు చికిత్సాపరమైన ప్రతిరక్షక పదార్థాల నిర్మాణం మరియు ప్రయోజనం[మార్చు]

ఇమ్యూనోగ్లోబులిన్ G (IgG) ప్రతిరక్షక పదార్థాలు అతిపెద్ద ప్రొటీన్ ద్విభాగి సంబంధ బణువులుగా సుమారు 150 kDa వరకు ఉంటాయి. అంతేకాక ఇవి రెండు విభిన్న రకాల పాలీపెప్టైడ్ గొలుసుగా చెప్పబడే భారీ (~50kDa) మరియు తేలికపాటి గొలుసు (~25kDa) ని కలిగి ఉంటాయి. కప్పా (κ) మరియు ల్యామిడా (λ) అనే రెండు రకాల తేలికపాటి గొలుసులు ఉన్నాయి. పాపైన్ ఎంజైముతో విడిపోవడం ద్వారా Fab (ఫ్రాగ్మెంట్-యాంటీజన్ బైండింగ్ ) భాగం బణువు యొక్క Fc (ఫ్రాగ్మెంట్ క్రిస్టాలిన్ ) (చిత్రాన్ని చూడండి) నుంచి వేరు పడగలదు. ఫ్యాబ్ భాగాలు అస్థిరమైన డొమైన్లను కలిగి ఉంటాయి. అవి స్థిరమైన ప్రాంతాల్లో చొప్పించబడిన ప్రతిరక్షక పదార్థ ప్రత్యేకతకు బాధ్యత వహించే మూడు గరిష్ఠ పరివర్తనశీల అమీనో ఆమ్ల ప్రదేశాలను కలిగి ఉంటాయి. అంతేకాక నాలుగు తెలిసిన IgG ఉపతరగతులు ఉన్నాయి. ఇవన్నీ ప్రతిరక్షక-పరాశ్రయ కణసంబంధ విషతత్వంలో సంబంధం కలిగి ఉంటాయి.[2]

స్వీయ మరియు స్వీయేతరం మధ్య వివక్ష ఆధారంగా వ్యాధినిరోధక వ్యవస్థ అది ఎదుర్కొనే పర్యావరణ అంశాలకు ప్రతిస్పందిస్తుంది. కంతి కణాలు అనేవి ప్రత్యేకించి ఒకరి వ్యాధినిరోధక వ్యవస్థ చేత లక్ష్యంగా చేసుకోబడవు. అందుకు కారణం కంతి కణాలు రోగి యొక్క సొంత కణాలుగా ఉండటం. ఏదేమైనప్పటికీ, కంతి కణాలు ఎక్కువగా అసాధారణంగా ఉంటాయి. వాటిలో చాలా వరకు అసాధారణ ప్రతి జనకాలను ప్రదర్శిస్తాయి. అవి కణ రకం, దాని వాతావరణానికి సరికానివిగానో లేదా అవి ప్రాణి (జీవి) అభివృద్ధి చెందేటప్పుడు (ఉదాహరణకు, భ్రూణ సంబంధిత ప్రతి జనకాలు) మాత్రమే సహజంగా ఏర్పడటమో జరుగుతుంది.[2]

ఇతర కంతి కణాలు కణ ఉపరితల గ్రాహకాలను ప్రదర్శిస్తాయి. అవి ఆరోగ్యవంతమైన కణాల ఉపరితలాలపై అరుదుగా ఉండటం లేదా అసలు ఉండవు. కంతి కణం యొక్క అనియంత్రిత పెరుగుదల మరియు విభజనకు కారణమయ్యే కణసంబంధ సిగ్నల్ ట్రాన్స్‌డక్షన్ క్రియాశీలకంగా మారడానికి ఇవి బాధ్యత వహిస్తాయి. ఉదాహరణకు ErbB2. ఇదొక క్రియాశీల కణ ఉపరితల గ్రాహకం. ఇది సుమారుగా 30% రొమ్ము క్యాన్సర్ కంతి కణాల ఉపరితలంపై అసాధారణ గరిష్ఠ స్థాయిల వద్ద ఉత్పన్నమవుతుంది. అలాంటి రొమ్ము క్యాన్సర్‌ను HER2 పాజిటివ్ రొమ్ము క్యాన్సర్ అంటారు.[3]

ప్రతిరక్షక పదార్థాలు అనేవి అనుకూల వ్యాధినిరోధక ప్రతిస్పందనలో ఒక కీలక భాగంగా ఉంటాయి. అన్య ప్రతి జనకాల గుర్తింపు మరియు వాటికి ఒక వ్యాధినిరోధక ప్రతిస్పందన యొక్క ప్రేరణలో ఇవి ప్రధాన భూమిక పోషిస్తాయి. మోనోక్లోనల్ యాంటీబాడీ పరిజ్ఞానం అందుబాటులోకి రావడం ద్వారా కంతులు ఉపరితలాలపై ఉండే ప్రత్యేకమైన ప్రతి జనకాలకు వ్యతిరేకంగా ప్రతిరక్షక పదార్థాల వృద్ధి సాధ్యపడింది.[3]

మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ మూలాలు[మార్చు]

క్యాన్సర్‌కు సంబంధించిన మోనోక్లోనల్ ప్రతిరక్షక పదార్థాలుADEPT, యాంటీబాడీ డైరెక్టెడ్ ఎంజైమ్ ప్రోడ్రగ్ థెరపీ; ADCC, యాంటీబాడీ డిపెండెంట్ సెల్-మీడియేటెడ్ సిటోటాక్సిసిటీ; CDC, కాంప్లిమెంట్ డిపెండెంట్ సిటోటాక్సిసిటీ; MAb, మోనోక్లోనల్ యాంటీబాడీ; scFv, సింగిల్-చైన్ Fv ఫ్రాగ్మెంట్[4]

ప్రతిరక్షక పదార్థాల నిర్మాణాన్ని కనుగొనడం మరియు మోనోక్లోనల్ యాంటీబాడీస్‌లకు సంబంధించిన మొట్టమొదటి విశ్వసనీయ మూలాన్ని అందించిన హైబ్రిడోమా (శారీరక కణం) పరిజ్ఞాన అభివృద్ధి ద్వారా వ్యాధి నిరోధకశక్తి చికిత్స ఒక టెక్నిక్‌గా అభివృద్ధి చేయబడింది.[5] ఈ పురోగతులు శరీరానికి లోపల మరియు శరీరానికి బయట సంభవించే కంతులను (శోధాలు) లక్ష్యంగా చేసుకోవడానికి అవకాశం కల్పించాయి. ప్రాణాంతక కణితులపై జరిపిన ప్రాథమిక పరిశోధన రక్తపు ప్రాణాంతకత్వాలతో MAb యొక్క పరిమిత మరియు సాధారణంగా స్వల్పకాలిక విజయాన్ని గుర్తించింది.[6][7] అంతేకాక చికిత్స అనేది ప్రతి రోగికి ప్రత్యేకంగా అందించేలా నిర్ణయించాల్సి ఉంటుంది. అందువల్ల ఇది సాధారణ వైద్యసంబంధ వాతావరణానికి అసాధ్యమైనదిగా నిరూపించబడింది.

మోనోక్లోనల్ ఔషధాభివృద్ధి యొక్క పురోమనమంతటా మొత్తం నాలుగు ప్రధాన ప్రతిరక్షక పదార్థ రకాలు అభివృద్ధి చెందాయి. అవి మ్యూరిన్, చిమిరిక్, హ్యూమనైజ్డ్ మరియు హ్యూమన్.

ప్రాథమిక చికిత్సాపరమైన ప్రతిరక్షక పదార్థాలు సాధారణ మ్యూరిన్ సాదృశ్యాలుగా ఉండేవి. మొదట్లో విజయం సాధించలేక పోవడానికి ఇది కారణమయింది. అప్పటి నుంచి ఈ ప్రతిరక్షక పదార్థాలు శరీరానికి వెలుపల ఒక లఘు అర్థ కాలం (వ్యాధినిరోధక సమూదాయ నిర్మాణం వల్ల) మరియు కంతి ప్రదేశాల్లో పరిమిత ప్రవేశనం కలిగి ఉంటాయని మరియు అతిథేయ ప్రభావశీలి పనుల సమీకరణను తగిన విధంగా చేయలేవని చూపబడింది.[8] ఈ క్లిష్టతలను అధిగమించే దిశగా సాంకేతికపరమైన ఇబ్బందులు ప్రాథమికంగా మించిపోయేవనే అనుభూతి పొందడం జరిగింది. చిమిరిక్ మరియు హ్యూమనైజ్డ్ ప్రతిరక్షక పదార్థాల చేత సాధారణంగా ఆధునిక చికిత్సాపరమైన ప్రతిరక్షక పదార్థ ప్రయోజనాల్లో మ్యూరిన్ ప్రతిరక్షక పదార్థాలు తొలగించబడుతుంటాయి. హైబ్రిడోమా పరిజ్ఞానం అనేది రీకాంబినెంట్ DNA పరిజ్ఞానం, ట్రాన్స్‌జనిక్ (సంకరజాతి అభివృద్ధికి సంబంధించిన) ఎలుక మరియు ఫేజ్ డిస్‌ప్లే పద్ధతి ద్వారా భర్తీ చేయబడింది.[9] ప్రొటియోమిక్స్ (జన్యుశాస్త్రం) అవగాహన అనేది సరికొత్త కంతి లక్ష్యాలను గుర్తించడానికి అవసరమని తెలిపింది.

మ్యూరిన్ మోనోక్లోనల్ యాంటీబాడీలు (పర ప్రత్యయం ~omab)[మార్చు]

ప్రాథమికంగా, మ్యూరిన్ ప్రతిరక్షక పదార్థాలు హైబ్రిడోమా పరిజ్ఞానం ద్వారా పొందబడ్డాయి. దీనికి సంబంధించి కోల్హర్ మరియు మిల్‌స్టీన్‌లు నోబెల్ బహుమతిని అందుకున్నారు. ఏదేమైనప్పటికీ, మ్యూరిన్ మరియు మానవ వ్యాధినిరోధక వ్యవస్థల మధ్య వ్యత్యాసం వల్ల ఈ ప్రతిరక్షక పదార్థాలు కొన్ని ప్రత్యేక పరిస్థితులు మినహా చికిత్సాపరమైన వైఫల్యం చెందాయి. మ్యూరిన్ ప్రతిరక్షక పదార్థాలతో ముడిపడిన అతిపెద్ద సమస్యలుగా కణాలకు విషపూరితమైన ఉత్తేజనం తగ్గడం మరియు మళ్లీ మళ్లీ అందించిన తర్వాత సముదాయాలు ఏర్పడటాన్ని చెప్పుకోవచ్చు. దీని కారణంగా స్వల్పమైన ఎలర్జీసంబంధ ప్రతిస్పందనలు మరియు కొన్నిసార్లు శీతల కారక శరీరవైషమ్య ప్రాణాంతక దుస్థితి సంభవించవచ్చు.[8]

చిమిరిక్ మరియు హ్యూమనైజ్డ్ మోనోక్లోనల్ ప్రతిరకక్షక పదార్థాలు (పర ప్రత్యయం 〜ximab, ~zumab వరుసగా)[మార్చు]

మ్యూరిన్ ప్రతిరక్షక పదార్థపు వ్యాధినిరోధక శక్తి (ఇమ్యూనోజనిసిటీ) ని తగ్గించడానికి, మ్యూరిన్ బణువులు వ్యాధినిరోధకశక్తి సంబంధ పదార్థాన్ని తొలగించే విధంగా మరియు వాటి నిరోదక సామర్థ్యాన్ని పెంచేలా ఆదేశించబడుతాయి.[8] ఇది ప్రాథమికంగా చిమిరిక్ మరియు హ్యూమనైజ్డ్ ప్రతిరక్షక పదార్థాల ఉత్పత్తి ద్వారా సాధించబడుతుంది. అస్థిర మ్యూరిన్ ప్రాంతాలను కలిగిన చిమిరిక్ ప్రతిరక్షక పదార్థాలు మానవ స్థిరమైన ప్రాంతాలతో కలిసి ఉంటాయి. కప్పా తేలికపాటి గొలుసు మరియు IgG1 భారీ గొలుసుల నుంచి తీసుకున్న మానవ జన్యు క్రమాల ఫలితంగా ప్రతిరక్షక పదార్థాలు ఏర్పడుతాయి. ఇవి దాదాపు 65% మానవ సంబంధమైనవిగా ఉంటాయి. ఇది వ్యాధినిరోధక శక్తిని తగ్గిస్తుంది. తద్వారా రక్తరసి అర్థ జీవితం పెరుగుతుంది.

మ్యూరిన్ గరిష్ఠ పరివర్తనశీల అమీనో ఆమ్ల డొమైన్లను మానవ ప్రతిరక్షక పదార్థాల్లోకి మార్పిడి చేయడం ద్వారా హ్యూమనైజ్డ్ ప్రతిరక్షక పదార్థాలు ఉత్పత్తవుతాయి. దీని ఫలితంగా సుమారు 95% మానవ మూలం కలిగిన ఒక బణువు ఏర్పడుతుంది. ఏదేమైనప్పటికీ, అనేక అధ్యయనాల్లో, హ్యూమనైజ్డ్ ప్రతిరక్షక పదార్థాలు ప్రతి జనకాన్ని మాతృ మ్యూరిన్ మోనోక్లోనల్ యాంటీబాడీ కంటే కూడా చాలా బలహీనంగా బంధించి ఉంటాయని మరియు వ్యత్యాసం కూడా వందల రెట్లు తక్కువగా ఉన్నట్లు చూపబడింది.[10][11] ప్రతిరక్షక పదార్థ-ప్రతి జనక బంధన శక్తిలో వృద్ధి అనేది కాంప్లిమెంటరిటీ డిటర్‌మైనింగ్ రీజియన్స్ (CDR) [12]లో పరివర్తనలు చేయడం ద్వారా సాధ్యపడుతుంది. దీనికి చైన్-షఫ్లింగ్, కాంప్లిమెంటరిటీ డిటర్‌మైనింగ్ రీజియన్స్ యొక్క క్రమరహిత అమరిక మరియు పొరపాటు చేయగలిగే PCR, E. కోలి పరివర్తక జాతాల ద్వారా అస్థిర ప్రాంతాల్లో పరివర్తనల ద్వారా ప్రతిరక్షక పదార్థ లైబ్రరీలను ఉత్పత్తి చేయడం మరియు ప్రదేశ సంబంధ మ్యూటాజనిసిస్ (మ్యూటాజనిసిస్ అనే ప్రక్రియలో ఒక జీవి యొక్క జన్యు సమాచారం స్థిరమైన రీతిలో మారుతుంటుంది) వంటి టెక్నిక్‌లను ఉపయోగిస్తారు.[1]

హ్యూమన్ మోనోక్లోనల్ యాంటీబాడీలు (〜mumab)[మార్చు]

ట్రాన్స్‌జనిక్ (సంకరజాతి అభివృద్ధికి సంబంధించిన) ఎలుక లేదా ఫేజ్ డిస్‌ప్లే లైబ్రరీలను ఉపయోగించి హ్యూమన్ మోనోక్లోనల్ ప్రతిరక్షక పదార్థాలను ఉత్పత్తి చేస్తారు. మ్యూరిన్ విశ్వజన్యురాశిలోకి మానవ ఇమ్యూనోగ్లోబులిన్ జన్యువులను బదిలీ చేయడం ద్వారా హ్యూమన్ మోనోక్లోనల్ ప్రతిరక్షక పదార్థాలు ఉత్పత్తవుతాయి. తర్వాత ఈ సంకరజాతి ఎలుక వాంఛిత ప్రతి జనకానికి వ్యతిరేకంగా నిరోధకశక్తి కలిగించబడుతుంది. ఫలితంగా మోనోక్లోనల్ ప్రతిరక్షక పదార్థాలు[9] ఉత్పత్తవుతాయి. తద్వారా శరీరానికి వెలుపల సంపూర్ణ మానవ ప్రతిరక్షక పదార్థాల్లో మ్యూరిన్ ప్రతిరక్షక పదార్థాల మార్పిడికి అవకాశం కలుగుతుంది.[3]

లక్ష్య వ్యాధులు[మార్చు]

క్యాన్సర్[మార్చు]

అనేక యంత్రాంగాల ద్వారా క్యాన్సర్ నిరోధక మోనోక్లోనల్ ప్రతిరక్షక పదార్థాలు ప్రాణాంతక కణాలను లక్ష్యంగా చేసుకోగలవు.

 • రేడియోఇమ్యూనోథెరపీ (RIT). కణసంబంధ ప్రతి జనకాలపై వికిరణోత్తేజితంగా బంధించబడిన మ్యూరిన్ ప్రతిరక్షక పదార్థాలను ఉపయోగించడం. పెక్కు పరిశోధన ప్రస్తుతం వాటి ప్రయోజనాన్ని క్యాన్సర్లకు ముడిపెట్టింది. ఎందుకంటే ఇవి ఎక్కువగా వికిరణ-సూక్ష్మగ్రాహ్య ప్రాణాంతకత్వాలు. వికిరణ తాకిడిని నియంత్రించడానికి, మ్యూరిన్ ప్రతిరక్షక పదార్థాలను ప్రత్యేకించి ఎంపిక చేసుకుంటారు. అందుకు కారణం వాటి అధిక ఇమ్యూనోజనిసిటీ శరీరం నుంచి శరవేగ తొలగింపును ప్రోత్సహించడం. హాడ్‌కిన్స్ క్యాన్సరుకు ఉపయోగించే మచ్చుతునకగా టోసిటుమోమాబ్ చెప్పబడుతుంది.
 • యాంటీబాడీ డైరెక్టెడ్ ఎంజైమ్ ప్రోడ్రగ్ థెరపీ (ADEPT). ఇది క్యాన్సరు సంబంధిత మోనోక్లోనల్ ప్రతిరక్షక పదార్థాల ప్రయోజనాన్ని తెలుపుతుంది. ఈ పదార్థాలు ఔషధ-ప్రేరక ఎంజైముతో సంబంధం కలిగి ఉంటాయి. విషయేతర కారకం యొక్క తదనంతర దైహిక పంపిణీ ఫలితంగా అది ఒక విషపూరిత ఔషధంగా మార్పు చెందుతుంది. తద్వారా ప్రాణాంతక కణాలను లక్ష్యంగా చేసుకునే ఒక కణాలకు విషపూరితమైన ప్రభావం కలుగుతుంది. ADEPT చికిత్సల యొక్క వైద్యపరమైన విజయం ఇప్పటివరకు పరిమితం చేయబడింది.[13] ఏదేమైనప్పటికీ, ఇది గొప్ప భరోసాను నిలుపుకుంది. తాజా నివేదికలు భవిష్యత్ కంతు సంబంధ చికిత్సలో ఇది పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డాయి.
 • ఇమ్యూనోలిపోజోమ్‌లు అనేవి ప్రతిరక్షక పదార్థంతో కలిసిన చిన్న తిత్తులు (లిపోజోమ్‌లు). లిపోజోమ్‌లు ఔషధాలను లేదా చికిత్సాపరమైన న్యూక్లియోటైడ్‌లను తీసుకెళ్లగలవు. మోనోక్లోనల్ ప్రతిరక్షక పదార్థాలతో ఇవి కలిసినప్పుడు ప్రాణాంతక కణాలకు విరుద్ధంగా ఆదేశించబడవచ్చు. ఈ పరిజ్ఞానం ఇప్పటికీ ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ, విశేష పురోగతులు మాత్రం సాధించబడ్డాయి. మానవ ట్రాన్స్‌ఫరిన్ (ఒక గ్లోబులిన్) గ్రాహకానికి వ్యతిరేకంగా ఒక ప్రతిరక్షక పదార్థపు భాగాన్ని ఉపయోగించడం ద్వారా కంతుల్లో కంతి-నిరోధక జన్యువుల యొక్క లక్ష్య విడుదలను సాధించడానికి ఇమ్యూనోలిపోజోమ్‌లు శరీరానికి వెలుపల విజయవంతంగా ఉపయోగించబడ్డాయి. మెదడు మరియు రొమ్ము క్యాన్సర్ కణజాలంలో ఇమ్యూనోలిపోజోమ్‌లను ఉపయోగించి కణజాల సంబంధ జన్యు విడుదలను సాధించడం జరిగింది.[14]

స్వయం ప్రతిరక్షక వ్యాధులు[మార్చు]

స్వయం ప్రతిరక్షక వ్యాధులకు ఉపయోగించే మోనోక్లోనల్ ప్రతిరక్షక పదార్థాలుగా ఇన్‌ఫ్లిక్సిమాబ్ మరియు అడాలిముమాబ్‌, ఇవి [[రిమాటోయిడ్ అరిథ్రిటిస్ (కీళ్లవాపు)లో సమర్థవంతంగా పనిచేస్తాయి. అలాగే క్రోన్స్ వ్యాధి మరియు అల్సరేటివ్ కోలిటిస్ (కారణం తెలియని, దీర్ఘకాలపు పెద్దపేగు యొక్క వ్రణములు) విషయంలో TNF-αని బంధించడం మరియు నిరోధించడంలో అవి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.[15] ఉత్తేజిత T కణాలపై IL-2ని బాసిలిజిమాబ్ మరియు డాక్లిజుమాబ్ నిరోధిస్తాయి. తద్వారా మూత్రపిండ మార్పిడుల యొక్క తీవ్రమైన తిరస్కరణ నివారణకు సాయపడుతుంది.[15] ఒమాలిజుమాబ్ అనేది మానవ ఇమ్యూనోగ్లోబులిన్ E (IgE) ను నిరోధిస్తుంది. అంతేకాక ఇది నియంత్రించ గలిగే తీవ్రమైన ఎలర్జీ సంబంధ ఉబ్బసంలో ఉపయోగకరంగా ఉంటుంది.

FDA ఆమోదిత చికిత్సాపరమైన ప్రతిరక్షక పదార్థాలు[మార్చు]

1986లో మొట్టమొదటి FDA-ఆమోదిత చికిత్సాపరమైన మోనోక్లోనల్ ప్రతిరక్షక పదార్థంగా మ్యూరిన్ IgG2a CD3 సంబంధ అవయవ మార్పిడి తిరస్కరణ ఔషధం, OKT3 (దీనినే మురోమోనబ్ అని కూడా అంటారు) ను చెబుతారు. ఈ ఔషధాన్ని ఘన అవయవ మార్పిడి గ్రహీతల్లో ఉపయోగించడం గుర్తించబడింది. తద్వారా వారు ఉత్ప్రేరక నిరోధకతను పొందారు.[16] వందలాది చికిత్సలు ప్రస్తుతం వైద్యసంబంధ పరీక్షలు జరుపుకుంటున్నాయి. వాటిలో అనేకం ఇమ్యూనాలజీ సంబంధ మరియు కంతు శాస్త్ర సంబంద లక్ష్యాలకు సంబంధించినవి.

ఉదాహరణFDA ఆమోదిత చికిత్సాపరమైన మోనోక్లోనల్ ప్రతిరక్షక పదార్థాలు [1]
బ్రాండ్ పేరు ఆమోద తేదీ రకం లక్ష్యం సంకేతం
(ఏ చికిత్సకు ఇది ఆమోదించబడింది)
అబ్సిక్సిమాబ్ రియోప్రో 1994 చిమిరిక్ గ్లైకోప్రొటీన్ IIb/IIIa నిరోధం గుండె మరియు రక్తనాళాలకు సంబంధించిన వ్యాధి
అడాలిముమాబ్ హుమిరా 2002 హ్యూమన్ TNF-α సంకేత నిరోధం వివిధ స్వయం ప్రతిరక్షక వ్యాధులు
అలెంటుజుమాబ్ కంపాత్ 2001 హ్యూమనైజ్డ్ CD52 పునఃసంభవ లింఫోసిటిక్ లుకేమియా
బాసిలిజిమాబ్ సిములెక్ట్ 1998 చిమిరిక్ IL-2Rα గ్రాహకం (CD25) మార్పిడి తిరస్కరణ
బెవాసిజుమాబ్ అవాస్తిన్ 2004 హ్యూమనైజ్డ్ వాస్కులర్ ఎండోథిలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ (VEGF) కొలరెక్టల్ క్యాన్సర్, వయసు సంబంధిత మచ్చల తిరోగమనం
సిటుజిమాబ్ ఎర్బిటక్స్ 2004 చిమిరిక్ ఎపిడర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టర్ కొలరెక్టల్ క్యాన్సర్, తల మరియు మెడ క్యాన్సరు
సెర్టోలిజుమాబ్ పీజల్ సింజియా 2008 హ్యూమనైజ్డ్ TNF-α సంకేత నిరోధం క్రోన్స్ వ్యాధి
డాక్లిజుమాబ్ జెనాపాక్స్ 1997 హ్యూమనైజ్డ్ IL-2Rα గ్రాహకం (CD25) మార్పిడి తిరస్కరణ
ఇసులిజుమాబ్ సోలిరిస్ 2007 హ్యూమనైజ్డ్ కాంప్లిమెంట్ సిస్టమ్ ప్రొటీన్ C5 పారోజిస్మల్ నాక్చుర్నల్ హిమోగ్లోబినూరియా
ఇఫాలిజుమాబ్ రాప్టివా 2002 హ్యూమనైజ్డ్ CD11a పొడవ్యాధి (చర్మవ్యాధి)
జెంటుజుమాబ్ మిలోటార్గ్ 2000 హ్యూమనైజ్డ్ CD33 అక్యూట్ మిఎలోజనస్ లుకేమియా (కాలిచియామిసిన్‌తో)
ఇబ్రిటుమోమాబ్ టియుజిటాన్ జివాలిన్ 2002 చుంచు CD20 హాడ్కిన్‌యేతర క్యాన్సరు (ఇట్రియం-90 లేదా ఇండియం-111తో)
ఇన్ఫిక్లిమాబ్ రిమికాడ్ 1998 చిమిరిక్ TNF-α సంకేత నిరోధం వివిధ స్వయం ప్రతిరక్షక రుగ్మతలు
మురోమోనాబ్-CD3 ఆర్థోక్లోన్ OKT3 1986 చుంచు T cell CD3 గ్రాహకం మార్పిడి తిరస్కరణ
నటాలిజుమాబ్ టిసాబ్రి 2006 హ్యూమనైజ్డ్ ఆల్ఫా-4 (α4) ఇంటెగ్రిన్, నాడీశాఖలపై తొడుగు క్షీణత వల్ల సంభవించే కండర బలహీనత మరియు క్రోన్స్ వ్యాధి
ఒమాలిజుమాబ్ జోలైర్ 2004 హ్యూమనైజ్డ్ ఇమ్యూనోగ్లోబులిన్ E (IgE) ప్రధానంగా ఎలర్జీ-సంబంధ ఉబ్బసం
పలివిజుమాబ్ సినాగిస్ 1998 హ్యూమనైజ్డ్ RSV F ప్రొటీన్ యొక్క ఒక ఎపిటోప్ శ్వాసకోశ సంబంధ సిన్సిటియల్ వైరస్
పనిటుముమాబ్ వెక్టిబిక్స్ 2006 హ్యూమన్ ఎపిడర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టర్ కొలరెక్టల్ క్యాన్సరు
రంజిబిజుమాబ్ లుసెంటిస్ 2006 హ్యూమనైజ్డ్ వాస్కులర్ ఎండోథిలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ A (VEGF-A) కంటిలో కణాలు శిథిలమవడం ద్వారా వచ్చే కంటి వ్యాధి
రిటుజిమాబ్ రిటుజన్, మాబ్‌తెరా 1997 చిమిరిక్ CD20 హాడ్కిన్‌యేతర క్యాన్సరు
టోసిటుమోమాబ్ బెక్సార్ 2003 చుంచు CD20 హాడ్కిన్-యేతర క్యాన్సరు
ట్రాస్టుజుమాబ్ హెర్సిప్టిన్ 1998 హ్యూమనైజ్డ్ ErbB2 రొమ్ము క్యాన్సర్

చికిత్సాపరమైన మోనోక్లోనల్ ప్రతిరక్షక పదార్థ మార్కెట్ భవిష్యత్తు[మార్చు]

2000 నుంచి, మోనోక్లోనల్ ప్రతిరక్షక పదార్థాల యొక్క చికిత్సాపరమైన మార్కెట్ విపరీతంగా పెరిగింది. మార్కెట్‌లో ప్రస్తుతం “బిగ్ 5”గా ఉండే చికిత్సాపరమైన ప్రతిరక్షక పదార్థాలు: అవాస్తిన్, హెర్సిప్టిన్ (రెండు కంతి శాస్త్రానికి సంబంధించినవి), హుమిరా, రిమికేడ్ (రెండూ ఆటోఇమ్యూన్ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ‘AIID’) మరియు రిటుజన్ (కంతి శాస్త్రం మరియు AIID) 2006 సంవత్సరంలో 80% రాబడులకు కారణమయ్యాయి.

తక్షణం, జనిన్‌టెక్/రోచీ మార్కెట్‌పై వారి ఆధిపత్యాన్ని తిరిగి పొందే అవకాశముంది (అందుకు కారణం “బిగ్ 5” ఉత్పత్తుల్లో మూడింటిని కలిగి ఉండటం). కంతిశాస్త్రం మరియు AIIDలపై mAb విభాగ చికిత్సాపరమైన దృష్టి కొనసాగనుంది (ఎందుకంటే, బిగ్ 5 సూచించిన వ్యాధి ప్రాంతాలు ఉండటం) మరియు mAb తరగతి యొక్క మూడు ప్రధాన వాణిజ్యపరమైన ‘లక్ష్యాలు’ VEGF (అవాస్తిన్), TNF-ఆల్ఫా (రిమికేడ్ మరియు హుమిరా) మరియు CD20 (రిటుజన్). చికిత్సాపరమైన ప్రతిరక్షక పదార్థ మార్కెట్ 2004 నుంచి 2011 వరకు కంతి శాస్త్రం మరియు AIID విభాగాల (82-84 శాతం) చేత ఆధిపత్యం చెలాయించబడుతుందని నిపుణులు అంచనా వేశారు. అంతేకాక రానున్న ఏళ్లలో కంతి శాస్త్రం మరియు AIID మధ్య తుల్యత మార్పుకు అవకాశముందని కూడా వారు గుర్తించారు. 2004లో కంతిశాస్త్ర మందులు మార్కెట్‌ను ఏలడంతో, 2011 కల్లా AIID దాని సత్తా చూపనుందని అంచనా వేయబడుతోంది.[17]

వీటిని కూడా చూడండి[మార్చు]

 • యాంటీజన్ (ప్రతి జనకం) 5T4
 • రోగనిరోధక చికిత్స
 • రోగనిరోధక సంయోజకం
 • మోనోక్లోనల్ ప్రతిరక్షక పదార్థాలకు సంబంధించిన పదజాలం
 • మోనోక్లోనల్ ప్రతిరక్షక పదార్థాల జాబితా

సూచనలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 Waldmann, Thomas A. (2003). "Immunotherapy: past, present and future". Nature Medicine. 9 (3): 269–277. doi:10.1038/nm0303-269. PMID 12612576.
 2. 2.0 2.1 (4.6)
 3. 3.0 3.1 3.2 Janeway CA, Jr.; et al. (2005). Immunobiology (6th సంపాదకులు.). Garland Science. ISBN 0-443-07310-4. Explicit use of et al. in: |author= (help)
 4. మాడిఫైడ్ ఫ్రమ్ కార్టర్ P: ఇంప్రూవింగ్ ది ఎఫికాసీ ఆఫ్ యాంటీబాడీ-బేస్డ్ క్యాన్సర్ థెరపీస్.Nat Rev క్యాన్సర్ 2001;1:118-129
 5. కోహ్లర్ G, మిల్‌స్టీన్ C. కంటిన్యూస్ కల్చర్స్ ఆఫ్ ఫ్యూజ్డ్ సెల్స్ సీక్రిటింగ్ యాంటీబాడీ ఆఫ్ ప్రిడిఫైన్డ్ స్పెసిఫిసిటీ. Nature 1975; 256: 495-497
 6. నాడ్లర్ LM, స్టాషెంకో P, హార్డీ R, మరియు సహచరుల బృందం సెరోథెరపీ ఆఫ్ ఎ పేషెంట్ విత్ ఎ మోనోక్లోనల్ యాంటీబాడీ డైరెక్టెడ్ ఎగనెస్ట్ ఎ హ్యూమన్ లింఫోమా అసోసియేటెడ్ యాంటీజన్ Cancer Res 1980; 40: 3147-3154.
 7. రిట్జ్ J, స్క్లోస్‌మన్ SF. యుటిలైజేషన్ ఆఫ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇన్ ది ట్రీట్‌మెంట్ ఆప్ లుకేమియా అండ్ లింఫోమా బ్లడ్ 1982; 59: 1-11.
 8. 8.0 8.1 8.2 స్టెర్న్ M, హెర్మన్ R. ఓవర్‌వ్యూ ఆఫ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇన్ క్యాన్సర్ థెరపీ: ప్రజెంట్ అండ్ ప్రామీస్ Crit Rev Oncol Hematol 2005; 54: 11-29.
 9. 9.0 9.1 హడ్సన్ PJ, సౌరీయి C. ఇంజినీర్డ్ యాంటీబాడీస్ Nat Med 2003; 9: 129-134.
 10. కార్ట్ P, ప్రెస్టా L, గోర్మన్ CM మరియు సహచరుల బృందం హ్యూమనైజేషన్ ఆఫ్ ఎన్ యాంటీ-p185HER2 యాంటీబాడీ ఫర్ హ్యూమన్ క్యాన్సర్ థెరపీ Proc Natl Acad Sci USA 1992; 89: 4285-4289.
 11. ప్రెస్టా LG, రహర్ SJ, షీల్డ్స్ RL మరియు సహచరుల బృందం హ్యూమనైజేషన్ ఆఫ్ ఎన్ యాంటీబాడీ డైరెక్టెడ్ ఎగనెస్ట్ IgE. J ఇమాన్యువల్ 1993; 151: 2623-2632.
 12. చోథియా C, లెస్క్ AM, ట్రామోంటానో A మరియు సహచరుల బృందం కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబులిన్ హైపర్‌వేరియేబుల్ రీజియన్స్ Nature 1989; 342: 877-883.
 13. ఫ్రాన్సిస్ RJ, శర్మ SK, స్ప్రింజర్ C మరియు సహచరుల బృందం ఎ ఫేజ్ I ట్రయల్ ఆఫ్ యాంటీబాడీ డైరెక్టెడ్ ఎంజైమ్ ప్రోడ్రగ్ థెరపీ (ADEPT) ఇన్ పేషెంట్స్ విత్ అడ్వాన్స్డ్ కొలరెక్టల్ కార్సినోమా ఆర్ అదర్ CEA ప్రొడ్యూసింగ్ ట్యూమర్స్. Br J క్యాన్సర్ 2002; 87: 600-607.
 14. క్రాస్ WC, పార్క్ JW, కిర్‌పోటిన్ DB, హాంగ్ K, బెంజ్ CC. ఎమర్జింగ్ యాంటీబాడీ-బేస్డ్ HER2 (ErbB-2/neu) థెరపాటిక్స్ Breast Dis 2000; 11: 113-124.
 15. 15.0 15.1 Rang, H. P. (2003). Pharmacology. Edinburgh: Churchill Livingstone. p. 241. ISBN 0-443-07145-4.
 16. హుక్స్ MA, వేడ్ CS, మిల్లికన్ WJ. మురోమోనబ్ CD-3: ఎ రివ్యూ ఆఫ్ ఇట్స్ ఫార్మాకాలజీ, ఫార్మాకోకైనిటిక్స్ అండ్ క్లినికల్ యూజ్ ఇన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఫార్మాకోథెరపీ 1991; 11: 26-37.
 17. డాటామానిటర్ "మోనోక్లోనల్ యాంటీబాడీస్ రిపోర్ట్ పార్ట్ 1" జూన్ 2007, రిఫరెన్స్ కోడ్: DMHC2291

బాహ్య లింకులు[మార్చు]

మూస:Extracellular chemotherapeutic agents