మోహన్ సింగ్ బిష్ట్
| మోహన్ సింగ్ బిష్త్ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2025 ఫిబ్రవరి 8 | |||
| ముందు | హాజీ యూనస్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | ముస్తఫాబాద్ | ||
| పదవీ కాలం 2020 – 2025 ఫిబ్రవరి 8 | |||
| ముందు | కపిల్ మిశ్రా | ||
| తరువాత | కపిల్ మిశ్రా | ||
| నియోజకవర్గం | కరవాల్ నగర్ | ||
| పదవీ కాలం 1998 – 2015 | |||
| ముందు | రామ్ పాల్ | ||
| తరువాత | కపిల్ మిశ్రా | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1957 జూన్ 2 మిరోలి , ఉత్తరాఖండ్ , భారతదేశం | ||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| తల్లిదండ్రులు | ఖుషాల్ సింగ్ బిష్త్, హీరా దేవి | ||
| జీవిత భాగస్వామి | లక్ష్మీ బిష్ట్ | ||
| సంతానం | 1 కూతురు, 1 కొడుకు | ||
| నివాసం | దయాల్‌పూర్ ఎక్స్‌టెన్షన్, న్యూ ముస్తఫాబాద్, ఢిల్లీ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు. | ||
మోహన్ సింగ్ బిష్త్ ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు కరవాల్ నగర్, ముస్తఫాబాద్ నియోజకవర్గాల నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]మోహన్ సింగ్ బిష్త్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1998 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో కరవాల్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి జైల్ సింగ్‌పై 3,058 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2003 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి హసన్ అహ్మద్‌పై 15,227 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
మోహన్ సింగ్ బిష్త్ 2008 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో కరవాల్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి సాతాన్ పాల్ దైమాపై 21,128 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2013 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి కపిల్ మిశ్రాపై 3,083 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]
మోహన్ సింగ్ బిష్త్ 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో కరవాల్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి కపిల్ మిశ్రా చేతిలో 44,431 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3] ఆయన 2020 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి కపిల్ మిశ్రాపై 8,223 ఓట్ల మెజారిటీతో గెలిచి ఐదవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]
మోహన్ సింగ్ బిష్త్ 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో కరవాల్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి కాకుండా ముస్తఫాబాద్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి అదీల్ అహ్మద్ ఖాన్ పై 17,578 ఓట్ల మెజారిటీతో గెలిచి అరవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5][6][7]
మూలాలు
[మార్చు]- ↑ "Who is Mohan Singh Bisht? Meet the 6-time BJP MLA who secured victory from Mustafabad in Delhi" (in ఇంగ్లీష్). Financialexpress. 10 February 2025. the original నుండి 11 February 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 February 2025.
- ↑ "Mustafabad Constituency Election Results 2025" (in ఇంగ్లీష్). The Times of India. 8 February 2025. the original నుండి 23 February 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 February 2025.
- 1 2 "Delhi Assembly: Know your MLAs" (in ఇంగ్లీష్). The Indian Express. 11 February 2015. the original నుండి 10 February 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 February 2025.
- ↑ The Indian Express (11 February 2020). "Delhi election result 2020: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). the original నుండి 25 December 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 December 2022.
- ↑ "In 2020 riot-hit NE Delhi, BJP bags 3 seats, AAP 1; Kapil Mishra among winners" (in ఇంగ్లీష్). The Indian Express. 9 February 2025. the original నుండి 11 February 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 February 2025.
- ↑ "Who is Mohan Singh Bisht, the BJP leader who won Muslim-dominated Mustafabad?" (in ఇంగ్లీష్). The Indian Express. 9 February 2025. the original నుండి 11 February 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 February 2025.
- ↑ "Delhi Assembly Elections Results 2025 - Mustafabad" (in ఇంగ్లీష్). Election Commission of India. 8 February 2025. the original నుండి 11 February 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 February 2025.