మోహినీ మోహన్ పట్నాయక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రొ.మోహిని మోహన్ పట్నాయక్
వ్యక్తిగత సమాచారం
జననం (1945-09-23) 1945 సెప్టెంబరు 23 (వయసు 78)
మూలంమార్కండేశ్వర్ సాహి, పూరి
వృత్తిఫ్లూట్ ప్లేయర్
వాయిద్యాలువేణువు

మోహిని మోహన్ పట్నాయక్ (జననం: 1945 సెప్టెంబరు 23) ఒడియన్ ఫ్లూట్ ప్లేయర్, ప్రొఫెసర్.[1] ఆయన ఒడిశా అకాడమీ ఆఫ్ ట్రైబల్ కల్చర్ రీసెర్చ్‌ కి అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నాడు.

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

మోహినీ మోహన్ పట్నాయక్ 1945లో పూరీలోని మార్కండేశ్వర్ సాహిలో భూస్వామి కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి అఖర్మోహన్ పట్నాయక్ ప్రముఖ న్యాయవాది, తల్లి పద్మావతి పట్నాయక్ గృహిణి.

తాతయ్య కూడా న్యాయమూర్తి కావడంతో మోహినీ మోహన్ కూడా న్యాయవాది కావాలని అతని తండ్రి కోరుకున్నాడు, కానీ అతనికి చిన్నప్పటి నుండి సంగీతంపై మక్కువ. దీంతో అతను ఒక వేణువును కొని, పూరీ బీచ్‌లో తన స్నేహితులతో కలిసి తిరుగుతూ స్వయంగా దాన్ని వాయించడం నేర్చుకున్నాడు. చిన్నతనం నుంచే అతను సింఘారి శ్యాంసుందర్ కర్, సితార్ వాద్యకారుడు రమాప్రతిహారి, కాశీనాథ్ పూజాపాండల వద్ద శిక్షణ పొందాడు.

తర్వాత భువనేశ్వర్ కి చేరి రాజధాని హైస్కూల్‌లో చదువు పూర్తిచేసాడు. అలాగే అతను లలిత కళాపీఠానికి వచ్చిన వివిధ కళాకారుల వద్ద సంగీతం నేర్చుకున్నాడు. అతను ఉత్కల్ విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పట్టా 1970లో పుచ్చుకున్నాడు. అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి ఆయన మాస్టర్స్ డిగ్రీ సంగీత ప్రదర్శన, వేణువు కోర్సు 1975లో, అలాగే రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, భువనేశ్వర్ నుండి ఉపాధ్యాయ విద్యలో 1978వ సంవత్సం డిగ్రీలు పొందాడు.

కెరీర్[మార్చు]

మోహినీ మోహన్ ఫ్లూటిస్ట్ వృత్తిని ఎంచుకుని కెరీర్ ప్రారంభించాడు. మొదట్లో రోజుకు 2 నుంచి 5 రూపాయలు మాత్రమే అతను సంపాదించేవాడు. క్రమంగా ఒడిస్సీ నృత్యంలో వేణువు వాయించడం మొదలుపెట్టాడు. అతను ఆకాశవాణి కటక్ కేంద్రం ద్వారా మంచి ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందాడు. 1970లో భారత ప్రభుత్వంచే ఎంపిక చేయబడి, ఎక్స్‌పో-70లో కన్జర్వేటర్‌ల ఒడిస్సీ నృత్యంలో ఫ్లూట్ వాయించేందుకు జపాన్‌కు వెళ్లాడు. ఇది ఆయన తొలి విదేశీ పర్యటన. ఆ తరువాత 70, 80 దశకాలలో దేశ విదేశాల్లో ఆయన ఫ్లూట్ ప్రదర్శనలెన్నో ఇచ్చాడు. ఇక సంగీతకారుడిగా ప్రజాదరణ పెరిగిన ఆయన ఉత్కల్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌లో సీనియర్ ప్రొఫెసర్ గానే కాకుండా విభాగాధిపతిగా విధులు నిర్వహిస్తున్నాడు.

పురస్కారాలు[మార్చు]

1999లో రెండు సంవత్సరాలు భారత ప్రభుత్వంచే ఆయన గిరిజన సంగీత రంగంలో రీసెర్చ్ స్కాలర్‌గా సీనియర్ ఫెలోషిప్ పొందాడు.

  • 1980లో సుర్మణి గౌరవం
  • 1985లో పద్మ కేశరి అవార్డు
  • 2002లో వృత్తిపరమైన గౌరవాలు
  • 2003లో సరళ హర్మాన్
  • 2003లో సాల్వేగ్ హానర్
  • 2006లో ఒడిషా సంగీత నాటక అకాడమీ గౌరవాలు
  • 2010లో గురు కేలుచరణ్ మోహపాత్ర గౌరవం[2]
  • 2013లో నేషనల్ ఆర్ట్ జెమ్ అవార్డు
  • 2013లో పెర్కషన్ ఆనర్స్

మూలాలు[మార్చు]

  1. Orissa Review. Home Department, Government of Orissa. 1984.
  2. http://www.srjan.com/awardee.php