Jump to content

మౌలానా అబుల్ కలామ్ ఆజాద్

వికీపీడియా నుండి
అబుల్ కలాం ఆజాద్ ابو الکلام آزاد
నవంబర్ 11, 1888ఫిబ్రవరి 22, 1958

జన్మస్థలం: మక్కా, ఉస్మానియా సామ్రాజ్యము (ప్రస్తుత సౌదీ అరేబియా)
నిర్యాణ స్థలం: ఢిల్లీ, భారతదేశం
ఉద్యమం: భారత స్వాతంత్ర్య ఉద్యమము
ప్రధాన సంస్థలు: భారత జాతీయ కాంగ్రెస్

మౌలానా అబుల్ కలాం ఆజాద్ (నవంబర్ 11, 1888ఫిబ్రవరి 22, 1958) (Bengali: আবুল কালাম মুহিয়ুদ্দিন আহমেদ আজাদ, ఉర్దూ: ابو الکلام آزاد ) ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి, మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆయన అసలుపేరు 'మొహియుద్దీన్ అహ్మద్', 'అబుల్ కలాం' అనేది బిరుదు, 'ఆజాద్' కలంపేరు. ఆలియా బేగమ్, ఖైరుద్దీన్ అహమ్మద్ లకు 1888 నవంబరు 11మక్కాలో జన్మించాడు.

ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 10 సంవత్సరాలపాటు జైలుశిక్ష అనుభవించాడు. భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాలపాటు విద్యాశాఖామంత్రిగా పనిచేసాడు. 1958 ఫిబ్రవరి 22 న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ మరణించాడు.

గౌరవాలు, బిరుదులు

సిమ్లా కాన్‌ఫరెన్స్ (1946) లో, మౌలానా, బాబూ రాజేంద్రప్రసాద్, జిన్నా మరియు రాజగోపాలాచారి.
  • గాంధీజీ ఇతడిని భారత ప్లాటో అని, గాంధీ మరియు నెహ్రూ ఇతడిని మౌలానా, మీర్-ఎ-కారవాన్‌ అని పిలిచేవాడు.
  • 1992లో భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించింది.
  • ఇతడి జన్మదినమైన నవంబరు 11 ను జాతీయ విద్యా దినోత్సవం గా జరుపుకుంటారు.

సాహిత్యం