మ్యాడం కిషన్‌రావు
మ్యాడం కిషన్‌రావు | |
|---|---|
| జననం | 1936 (age 89–90) |
| Known for | బాంబినో సేమియా (వర్మిసెల్లి) సేమియా ఖీర్ |
| పిల్లలు | రఘువీర్ రావు సుబ్రమణ్యం అనూరాధ శ్రీదేవి అనందదేవి తుల్జాభవాని |
| Parent(s) | సత్తెమ్మ, అంజయ్య |
| బంధువులు | మ్యాడం జనార్ధనరావు (సోదరుడు) |
మ్యాడం కిషన్‌రావు (1936 - 2021 జనవరి 12),[1] తెలంగాణ రాష్ట్రానికి చెందిన భారతీయ పారిశ్రామికవేత్త. ఆయన బాంబినో ఆగ్రోటెక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు.[2] దీంతో భారతీయ గృహాల్లో సేమియాను ఒక ముఖ్యమైన వస్తువుగా మార్చగలిగాడు. కంపెనీ మొట్టమొదటి ప్లాంట్ హైదరాబదు నగరానికి దగ్గరగా ఉన్న బీబీనగర్‌లో ఉంది. దేశవిదేశాలలో విస్తరించిన కంపనీ ఉత్పత్తులలో సేమ్యాతో పాటు మాకరోనీ, స్పఘెట్టి, పాస్తా, మసాలా పొడులు, ఖీర్ వంటి తక్షణ ఆహార మిశ్రమాలు ఎన్నో అత్యంత ప్రజాదరణ పొందాయి.
సమాజసేవలో భాగంగా ఆయన హైదరాబాదు, కాచిగూడలో విద్యార్థులకు మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం అందుబాటులోకి తీసుకొచ్చాడు.
బాంబినో ఆగ్రోటెక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
[మార్చు]రేవతి టొబాకో కంపెనీ (స్థాపన:1953), ఆంప్రో బిస్కెట్స్ (స్థాపన:1970) వంటి సంస్థలను విజయవంతంగా నిర్వహిస్తున్న మ్యాడం కిషన్‌రావుకు జర్మనీలో జరిగిన ఒక ట్రేడ్ ఫెయిర్‌ను సందర్శించిన తర్వాత వర్మిసెల్లి ఆలోచన వచ్చింది, అక్కడ అతను దాని కోసం ఒక పైలట్ ప్లాంట్‌ను చూశాడు. 1982లో బీబీనగర్ వద్ద మొట్టమొదటి ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిన బాంబినో ఆగ్రోటెక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు ప్రస్తుతం, ఢిల్లీ, ఇండోర్, గుర్గావ్, నాగ్‌పూర్, తిరుపతిలలో కూడా ఉత్పత్తి ప్లాంట్లు ఉన్నాయి. ఈ సంస్థ ఉత్పత్తులను భారతదేశంలోనే కాకుండా జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా వంటి 20 దేశాలకు ఎగుమతి చేస్తుంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో నమోదయిన ఈ కంపనీ 2019-20 వార్షిక నివేదిక ప్రకారం, టర్నోవర్ రూ. 252 కోట్లు, నికర లాభం 8 కోట్లు.
మరణం
[మార్చు]మ్యాడం కిషన్ రావు హైదరాబాదులో 83 ఏళ్ల వయస్సులో 2021 జనవరి 12న మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "'Vermicelli Man' Myadam Kishan Rao passes away". The Week (in ఇంగ్లీష్). Retrieved 2025-10-19.
- ↑ "బాంబినో కంపెనీ షేర్ల బదిలీ వ్యవహారం.. వ్యవస్థాపకుడి నలుగురు కుమార్తెలపై కేసు". EENADU. Retrieved 2025-10-19.