మ‌ల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మ‌ల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజను
మల్కాజ్‌గిరి నగరం విహంగవీక్షణ
మల్కాజ్‌గిరి నగరం విహంగవీక్షణ
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామేడ్చల్ మల్కాజ్‌గిరి

మ‌ల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని 2 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. దీని పరిపాలనలో 8 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం మల్కాజ్‌గిరి పట్టణంలో ఉంది.[2] 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[3]

వివరాలు[మార్చు]

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[4]

పరిపాలన[మార్చు]

మ‌ల్కాజ్‌గిరి డివిజన్‌లోని మండలాలు:[5]

క్ర.సం మ‌ల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 మల్కాజ్‌గిరి మండలం 2 రెవెన్యూ గ్రామాలు
2 అల్వాల్ మండలం 10 రెవెన్యూ గ్రామాలు
3 కుత్బుల్లాపూర్ మండలం 6 రెవెన్యూ గ్రామాలు
4 దుండిగల్ గండిమైసమ్మ మండలం 10 రెవెన్యూ గ్రామాలు
5 బాచుపల్లి మండలం 2 రెవెన్యూ గ్రామాలు
6 బాలానగర్ మండలం 8 రెవెన్యూ గ్రామాలు
7 కూకట్‌పల్లి మండలం 6 రెవెన్యూ గ్రామాలు
8 మూడుచింతలపల్లి మండలం 18 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు)

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "Suryapet district" (PDF). New Districts Formation Portal. Archived from the original (PDF) on 11 October 2016. Retrieved 2022-09-25.
  3. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-09-25.
  4. "Revenue Divisions | District Medchal Malkajgiri, Government of Telangana | India". Archived from the original on 2022-01-29. Retrieved 2022-09-25.
  5. "మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-09-25. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)