యక్షులు
యక్షులు ఒక ప్రకృతి దేవతల సమూహం. వీరు సాధారణంగా సాధుస్వభావులు అయినప్పటికీ ఒక్కోసారి అల్లరి, చంచల స్వభావాన్ని కలిగిన వారిగా ఉంటారు. వీరు నీరు, సంతానం, వృక్షాలు, అడవులు, గుప్తనిధులు, నిర్జన ప్రాంతాలతో సంబంధం కలిగిన వారు.[1][2] దక్షిణ, ఆగ్నేయ ఆసియాలోని దేవాలయాలలో రక్షక దేవతలుగా కనిపిస్తారు.[2][3] వీరిని గురించి హిందూ, జైన, బౌద్ధ పురాణాలలో ప్రస్తావనలు ఉన్నాయి. వీరు పురుషులైతే యక్షుడు అనీ, స్త్రీలైతే యక్షిణి అని పిలుస్తారు. వీరి పేరు మీదుగా యక్షగానం అనేక ఒక సాంప్రదాయ నృత్యరూపం కూడా ఉంది.
కుబేరుడు
[మార్చు]
హిందూ, బౌద్ధ, జైన మతాలలో, సంపద, శ్రేయస్సుకు అధిపతి అయిన కుబేరుడు యక్షులకు రాజుగా మరియు ప్రపంచ రక్షకుడిగా (లోకపాలుడు) పరిగణిస్తారు. బౌద్ధమతంలో, అతడిని వైశ్రవణుడితో పోలుస్తారు. అతనికున్న అనేక బిరుదులు అతడిని అనేక రకాల ఉప-దేవతలకు అధిపతిగా, ప్రపంచ నిధులకు యజమానిగా కొనియాడుతాయి. కుబేరుడు భారీ శరీరంతో, ఆభరణాలతో అలంకరించబడి, ధన కలశం, గదను ధరించి కనిపిస్తాడు. అతని వాహనం ముంగిస. అతను హిందూ సంపద, అదృష్ట దేవత అయిన లక్ష్మీదేవితో కలిసి కనిపిస్తాడు.
మూలాలు
[మార్చు]- ↑ Singh (2008). A History of Ancient and Early Medieval India. New Delhi: Pearson Education. p. 430. ISBN 978-81-317-1120-0.
- ↑ 2.0 2.1 Stefon, Matt. "Yaksha | Hindu mythology". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Archived from the original on 3 September 2019. Retrieved 15 July 2007.
- ↑ Richard John Richards (1995). South-east Asian Ceramics: Thai, Vietnamese, and Khmer: From the Collection of the Art Gallery of South Australia. Oxford University Press. pp. 27, 67. ISBN 978-967-65-3075-2.