యనమండ్ర నారాయణమూర్తి
యనమండ్ర నారాయణమూర్తి(జననం 1874-మరణం 1926) జన్మస్థలం, సొంతవూరు కాకినాడ, తల్లి సర్వలక్షమ్మ తండ్రి పరదేశి. విజయనగరం రాజాగారి కళాశాలలో ఆంగ్లోపాధ్యాయులుగా పనిచేశారు. తమిళం కూడా నేర్చుకున్నారు. గురజాడ మిత్రులు, సంస్కరణ, వ్యావహారిక భాషాభిమాని. నవ్యకవిత్వం,నవల, కథలు రాశారు, ఇంగ్లీషులో కుడా రచనలు చేశారు. సమకాలిక పత్రికల్లో రచనలు చేశారు. 1918 లో ఉత్తమ కావ్యంగా ఎంపికయిన దువ్వూరి రామిరెడ్డి వనకుమారికి పీఠికరాశారు. వీరి ఖండకావ్యం అడవి మల్లెలు (1919), రూపాలి ద్విపదకావ్యం. నూతన రీతుల్లొ,కొత్త ఛందస్సుల్లో రాసే కవిత్వాన్ని, వాడుకభాషను ప్రోత్సహించారు. విజయరామగజపతి(1883-1922) వీరిని సన్మానించారు. ఈశ్వరపూజ, కుంభరాణ, నా టెన్నిస్ జోడు(కథ) వీరి వచన రచనలు.
మూలాలు:
[మార్చు]1. తూమాటి దొణప్ప, ఆంధ్రసంస్థానాలు, పుట 434.2. The Madras Christian College Magazine, VOL XXVII, OCT 1909, pp 187 to 195.Spoken and Written Telugu -As Today In Linguistic Reform,eeay by Narayanamurthy.Y.