యమన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యమన్‌
దర్శకత్వంజీవా శంకర్
రచనజీవా శంకర్
నిర్మాతమిర్యాల రవీందర్ రెడ్డి
తారాగణంవిజ‌య్ ఆంటోని
మియా జార్జ్‌
త్యాగరాజన్‌
ఛాయాగ్రహణంజీవా శంకర్
కూర్పువీరా సెంథిల్ రాజ్
సంగీతంవిజ‌య్ ఆంటోని
నిర్మాణ
సంస్థలు
లైకా ప్రొడక్షన్స్, ద్వారకా క్రియేషన్స్
విడుదల తేదీ
2017 ఫిబ్రవరి 24 (2017-02-24)
సినిమా నిడివి
153 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

యమన్‌ 2017లో విడుదలైన తెలుగు సినిమా. మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో లైకా ప్రొడక్షన్స్, ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు జీవ శంకర్‌ దర్శకత్వం వహించాడు. విజ‌య్ ఆంటోని, మియా జార్జ్‌, త్యాగరాజన్‌, సంగ్లీ మురుగన్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 24 ఫిబ్రవరి 2017న విడుదలైంది.[1]

కథ[మార్చు]

దేవరకొండ గాంధీ (విజయ్ ఆంటోని)కి ఎమ్మెల్యేగా నిలబడేందుకు పోటీపడుతుంటాడు. కానీ తన రాజకీయ ప్రత్యర్ధి, స్నేహితుడు అయిన పాండురంగ అతడిని హత్య చేస్తాడు. దీంతో గాంధీ భార్య, తన బిడ్డ దేవరకొండ అశోక్ చక్రవర్తి (విజయ్ ఆంటోని)తో కలిసి చనిపోవాలని భావించి విషం తీసుకుంటుంది. కానీ కొడుకుతో సహా ఆమె చేసిన ఈ ఆత్మహత్యాయత్నంలో అశోక్ బతికి బయటపడతాడు. అశోక్ తన తాతయ్య (సంగిలి మురుగన్) పెరిగి పెద్దవుతాడు. అలాంటి తాత అనారోగ్యం పాలవడంతో సర్జరీ చేయడానికి అతని దగ్గర డబ్బులు లేక డబ్బుల కోసం ఒక యాక్సిడెంట్ కేసును నెత్తిన వేసుకుని జైలుకు వెళ్తాడు. ఈ కేసు వల్ల అతడి జీవితం మలుపు తిరుగుతుంది. అశోక్ తన తెలివితేటలతో అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటాడు. తనకు మాజీ ఎమ్మెల్యే కరుణాకర్(త్యాగరాజన్) అండ దొరుకుతుంది. అశోక్‌ను అహల్య (మియా జార్జ్) ప్రేమిస్తుంది. ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. అశోక్‌కు అన్ని వేళల సహాయం చేసే కరుణాకర్ అశోక్‌ను చంపాలనుకుంటాడు. దానికి అసలు కారణం ఏంటి ? అశోక్ రాజకీయాల్లోకి వెళ్లాడా ? తనను చంపాలనుకునే వారిపై పగ తీర్చుకున్నాడా ? తన తండ్రిని ఎవరు చంపారో అశోక్ తెలుసుకుంటాడా ? అశోక్ అనుకున్నది ఎలా సాధించాడు అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు[మార్చు]

 • విజ‌య్ ఆంటోని [3]
 • మియా జార్జ్
 • త్యాగరాజన్‌
 • సంగ్లీ మురుగన్‌
 • డి. ఆర్. కె. కిరణ్
 • చార్లె
 • జి. మరిముత్తు
 • ఆర్జై
 • స్వామినాథన్
 • అరౌల్ డి. శంకర్
 • జయకుమార్

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్: లైకా ప్రొడక్షన్స్‌, ద్వారకా క్రియేషన్స్
 • నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
 • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జీవా శంకర్
 • సంగీతం: విజయ్ ఆంటోనీ
 • సినిమాటోగ్రఫీ: జీవా శంకర్
 • ఎడిటర్: వీరా సెంథిల్ రాజ్

మూలాలు[మార్చు]

 1. Deccan Chronicle (15 February 2017). "Vijay Antony is back". Archived from the original on 10 September 2021. Retrieved 10 September 2021.
 2. Suryaa (24 February 2017). "యమన్ సినిమా రివ్యూ". Retrieved 10 September 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
 3. Sakshi (22 February 2017). "అంతకు ముందు వరకూ నేను బిచ్చగాణ్ణే!". Archived from the original on 10 September 2021. Retrieved 10 September 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=యమన్&oldid=3718926" నుండి వెలికితీశారు