యశ్
యాష్ | |
|---|---|
యాష్ 2014లో | |
| జననం | నవీన్ కుమార్ గౌడ్ 1986 జనవరి 8 భువనహళ్ళి, హసన్, కర్ణాటక |
| జాతీయత | భారతీయుడు |
| వృత్తి | నటుడు |
| భాగస్వామి | రాధికా పండిట్ |
| పిల్లలు | ఐరా, యథర్వ్ |
యశ్ అనే పేరుతో ప్రాచుర్యం పొందిన నవీన్ కుమార్ గౌడ కన్నడ నటుడు.[1][2] టివి ధారావాహికలలో నటించడం ప్రారంభించి సినిమాల్లోకి వచ్చాడు. కె.జి.ఎఫ్ సినిమాతో భారతదేశమంతటా గుర్తింపు పొందాడు.
ప్రారంభ జీవితం
[మార్చు]నవీన్ కుమార్ గౌడ్ 1986 జనవరి 8న కర్ణాటకలో హసన్ లోని భువనహళ్లిలో జన్మించాడు.[3] తండ్రి అరుణ్ కుమార్ కెఎస్ఆర్టిసి రవాణా సేవలో, డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తల్లి పుష్ప లతా [4] యశ్ నందిని అనే చెల్లెలు ఉంది. యశ్ చిన్ననాటి రోజులు మైసూర్ లో ఉండేవాడు. కర్ణాటకలోని మైసూర్ లోని మహాజన హై స్కూల్ లో పాఠశాల విద్యను అభ్యసించాడు. చదువు పూర్తయిన తరువాత, నాటక రచయిత బివి కరాంత్ చేత ఏర్పడిన బెనకా డ్రామా బృందంలో చేరాడు. స్టేజ్ షోలు, టీవీ సీరియల్స్ తో అరంగేట్రం చేశారు. యష్ గాయకుడిగా కూడా సినీపరిశ్రమకు సుపరిచితుడు.[5]
కెరీర్
[మార్చు]యష్ తన నటనా జీవితాన్ని 2004 లో ఉత్తరాయణ అనే టీవీ సీరియల్ ద్వారా ప్రారంభించాడు. నందా గోకుల, ప్రీతి ఇల్లాడ మేలే, శివలలో వంటి టెలిసీరియల్ నటించాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]నంద గోకుల సెట్స్‌పై యాష్ రాధిక పండిట్‌తో పరిచయం ఏర్పడింది. 2016 ఆగస్టులో గోవాలో నిశ్చితార్థం చేసుకున్నారు.[6]2016 డిసెంబర్ 9న పెళ్లి జరిగింది.[7]ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. 2018 డిసెంబర్ 2న జన్మించింది.[8][9]
నటించిన చిత్రాలు
[మార్చు]| సంవత్సరం | శీర్షిక | పాత్ర(లు) | గమనికలు | Ref. |
|---|---|---|---|---|
| 2007 | జంబాడ హుడుగి | లక్ష్మీకాంతం | ||
| 2008 | మొగ్గిన మనసు | రాహుల్ | ||
| రాకీ | రాకీ | |||
| 2009 | కల్లారా సంతే | సోము | ||
| గోకుల | ఎన్. రాజా | |||
| 2010 | తమస్సు | ఇమ్రాన్ | అతిధి పాత్ర | |
| మొదటిసాల | కార్తీక్ | |||
| 2011 | రాజధాని | రాజా | రాజధాని రౌడీ - తెలుగు | |
| కిరాతక | నందీశ | |||
| 2012 | లక్కీ | విక్రమ్ "విక్కీ" కుమార్ "లక్కీ" | లక్కీ స్టార్- తెలుగు | |
| జాను | సిద్ధార్థ్ | |||
| నాటకం | టికె వెంకటేశం | |||
| 2013 | చంద్ర | నర్తకి | "తస్సే ఒత్తు" & "రాజా రాజన్" పాటలలో అతిధి పాత్ర | |
| గూగ్లీ | శరత్ | |||
| రాజా హులీ | రాజా హులీ | |||
| 2014 | గజకేసరి | కృష్ణ & బాహుబలి | ద్విపాత్రాభినయం | |
| మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి | రామాచారి | |||
| 2015 | మాస్టర్ పీస్ | యువ | ||
| 2016 | సంతు స్ట్రెయిట్ ఫార్వర్డ్ | సంతు | రారాజు (తెలుగు) | |
| 2018 | సమ్మె | రాజా కృష్ణప్ప భైర్య "రాకీ" | ||
| 2022 | కె.జి.యఫ్ చాప్టర్ 2 | |||
| 2025 | టాక్సిక్ | TBA | నిర్మాత కూడా |
పురస్కారాలు
[మార్చు]- 2009లో యశ్ తన మొగ్గినా మనసు చిత్రం కోసం ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ లో ఉత్తమ సహాయ నటుడు - కన్నడను గెలుచుకున్నాడు.[10]
- డ్రామా (2013), గూగ్లీ (2014) చిత్రాలకు యష్ ఉత్తమ నటుడు - కన్నడకు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌లో ఎంపికయ్యాడు .[11]
- 2015లో, యష్ ఉత్తమ నటుడు - కన్నడను ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్, సినీ అవార్డులలో సాధించాడు.[12]
మూలాలు
[మార్చు]- ↑ "Who is Naveen Kumar Gowda in Sandalwood?". The Times of India. 27 January 2014.
- ↑ "Who is Naveen Kumar Gowda in Sandalwood?". The Times of India. 27 January 2014. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 January 2017.
- ↑ "YouTube". www.youtube.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-03-30.
- ↑ "Actor Yash family, childhood photos – Rocking star | Celebrity family wiki" (in అమెరికన్ ఇంగ్లీష్). 15 September 2014. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-03-30.
- ↑ "wikibio.in/yash/amp/".
- ↑ BengaluruAugust 12, Aravind Gowda; August 12, 2016UPDATED; Ist, 2016 15:36. "Actors Yash and Radhika get engaged in Goa". India Today (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-03-30.
{{cite web}}:|first2=has generic name (help);|first3=has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ "Kannada actors Yash and Radhika Pandit tie the knot in a dream wedding, see pics". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-12-09. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-03-30.
- ↑ "Inside Yash and Radhika Pandit's daughter Ayra's 1st grand birthday bash; Check it out". PINKVILLA (in ఇంగ్లీష్). the original నుండి 2020-05-28 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-03-30.
- ↑ Eenadu (2 May 2022). "సీరియల్లో కలుసుకుని.. జీవితంలో ఒక్కటయ్యారు". the original నుండి 10 June 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 June 2022.
- ↑ "56th Idea Filmfare Awards 2008 South: The winners". The Times of India. August 2009. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 April 2015.
- ↑ "60th Idea Filmfare Awards 2013 (South) Nominations". Filmfare. the original నుండి 7 July 2013 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 April 2015.
- ↑ "Yash, Shwetha Srivatsav are Filmfare best actors". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 June 2015.