యాంటీరియర్ క్రూసియేట్ లిగమెంట్ గాయం
| యాంటీరియర్ క్రూసియేట్ లిగమెంట్ గాయం | |
|---|---|
| ఇతర పేర్లు | పూర్వ క్రూసియేట్ లిగమెంట్ గాయం |
| కుడి మోకాలు చిత్రం | |
| ప్రత్యేకత | ఆర్థోపెడిక్ శస్త్ర చికిత్స |
| లక్షణాలు | నొప్పి, గాయం ఉన్నప్పుడు పాపింగ్ శబ్దం, మోకాలు స్థిరంగా నిలవలేక పోవడం, కీళ్ల వాపు |
| కారణాలు | దిశలో వేగంగా మార్పు, అకస్మాత్తుగా ఆగడం, దూకిన తర్వాత వెంటనే దిగడం |
| ప్రమాద కారకములు | క్రీడాకారులు , మహిళలు |
| రోగనిర్ధారణ పద్ధతి | శారీరక పరీక్ష ద్వారా రోగనిర్ధారణ చేస్తారు. కొన్నిసార్లు మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI) |
| నివారణ | నరాల కండరాల శిక్షణ, ఉదర కండరాల బలోపేతం |
| చికిత్స | బ్రేసింగ్, ఫిజియోథెరపీ, శస్త్రచికిత్స |
| తరుచుదనము | అమెరికాలో సంవత్సరానికి సుమారు 200,000 మంది |
పూర్వ క్రూసియేట్ లిగమెంట్ గాయాన్ని ఆంగ్లంలో యాంటీరియర్ క్రూసియేట్ లిగమెంట్ గాయం అని పిలుస్తారు. ఇది పూర్వ క్రూసియేట్స్ లిగమెంట్ (ACL) సాగినప్పుడు, పాక్షికంగా లేదా పూర్తిగా నలిగిపోతుంది. అత్యంత సాధారణ గాయం లక్షణం ఏమంటే స్నాయువు పూర్తిగా చీరి ఉంటుంది.[1]
లక్షణాలు
[మార్చు]నొప్పి, గాయం ఉన్నప్పుడు పాపింగ్ శబ్దం, మోకాలు స్థిరంగా నిలవలేక పోవడం, కీళ్ల వాపు, ఉంటుంది.[1] వాపు సాధారణంగా రెండు గంటల్లో కనిపిస్తుంది.[2] సుమారు 50% కేసులలో, మోకాలి ఇతర నిర్మాణాలు, చుట్టుపక్కల స్నాయువులు, మృదులాస్థి లేదా నెలవంక[గమనిక 1] వంటివి దెబ్బతింటాయి.[1]
కదిలే దిశలో వేగంగా మార్పు చేయడం, అకస్మాత్తుగా ఆగడం, దూకిన తర్వాత వెంటనే దిగడం వంటి వాటిలో మోకాలు ప్రత్యక్షంగా ప్రభావితం అవుతుంది.[1] ఇది క్రీడాకారులలో, ముఖ్యంగా ఆల్పైన్ స్కీయింగ్, ఫుట్ బాల్ లేదా బాస్కెట్బాల్ వంటి క్రీడలలో పాల్గొనేవారిలో సర్వసాధారణంగా కనపడుతుంది.[1][3]
రోగనిర్ధారణ
[మార్చు]సాధారణంగా శారీరక పరీక్ష ద్వారా రోగనిర్ధారణ చేస్తారు. కొన్నిసార్లు మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI) ఉపయోగిస్తారు.[1] శారీరక పరీక్ష తరచుగా మోకాలి కీలు చుట్టూ ఉన్న సున్నిత భాగం, మోకాలి కదలిక తగ్గడం, కీలు వదులుగా ఉండిన స్థితి చూపుతుంది.[2]
చికిత్స, నివారణ
[మార్చు]నరాల కండరాల శిక్షణ, ఉదర కండరాలు బలోపేతం[గమనిక 2] ద్వారా నివారణ జరుగుతుంది.[4][5] చికిత్స గాయం స్థాయి మీద ఆధారపడి ఉంటాయి. తక్కువ స్థాయి కార్యకలాపాలు ఉన్నవారిలో, శస్త్రచికిత్స లేకుండా బ్రేసింగ్, ఫిజియోథెరపీ నిర్వహణ సరిపోతుంది. అధిక స్థాయి కార్యక్రమాలు ఉన్నవారిలో, ఆర్థ్రోస్కోపిక్ యాంటీరియర్ క్రూసియేట్ లిగమెంట్ పునర్నిర్మాణం ద్వారా తరచుగా శస్త్రచికిత్స సిఫార్సు చేస్తారు.[1] శరీరంలోని మరొక ప్రాంతం నుండి లేదా చనిపోయిన వారినుండి తీసుకున్న స్నాయువుతో భర్తీ చేయడం వంటివి చేస్తారు.[2] శస్త్రచికిత్స తర్వాత పునరావాసం నెమ్మదిగా కీళ్ల కదలిక పరిధిని విస్తరించడం, మోకాలి చుట్టూ కండరాలను బలోపేతం చేయడంలో ఉంటుంది. అయితే, గాయం నుండి వాపు తగ్గేవరకు సాధారణంగా శస్త్రచికిత్స సిఫార్సు చేయరు.[1]
ప్రాబల్యం
[మార్చు]అమెరికాలో సంవత్సరానికి సుమారు 200,000 మంది ప్రజలు ప్రభావితమవుతున్నారు.[2] కొన్ని క్రీడలలో, ఆడవారికి ఈ గాయం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, మరికొన్ని క్రీడలలో ఆడవారికి, మొగవారికి ప్రమాదం సమానంగా ఉంటుంది.[3][6] పూర్తిగా చీరిన లిగమెంట్ ఉన్న పెద్దవాళ్లలో మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్ అధికంగా వచ్చే సంభావ్యత ఉంటుంది, అయితే చికిత్సలో ఈ తేడా కనిపించదు.[7]
సూచనలు
[మార్చు]- 1 2 3 4 5 6 7 8 "Anterior Cruciate Ligament (ACL) Injuries-OrthoInfo - AAOS". orthoinfo.aaos.org. March 2014. Archived from the original on 5 July 2017. Retrieved 30 June 2017. Archived 5 జూలై 2017 at the Wayback Machine
- 1 2 3 4 "ACL Injury: Does It Require Surgery?-OrthoInfo - AAOS". orthoinfo.aaos.org. September 2009. Archived from the original on 22 June 2017. Retrieved 30 June 2017. Archived 22 జూన్ 2017 at the Wayback Machine
- 1 2 Prodromos CC, Han Y, Rogowski J, Joyce B, Shi K (December 2007). "A meta-analysis of the incidence of anterior cruciate ligament tears as a function of gender, sport, and a knee injury-reduction regimen". Arthroscopy. 23 (12): 1320–25. doi:10.1016/j.arthro.2007.07.003. PMID 18063176.
- ↑ (March 2006). "Anterior cruciate ligament injuries in female athletes: Part 2, a meta-analysis of neuromuscular interventions aimed at injury prevention".
- ↑ (March 2015). "Specific exercise effects of preventive neuromuscular training intervention on anterior cruciate ligament injury risk reduction in young females: meta-analysis and subgroup analysis".
- ↑ Montalvo, Alicia M; Schneider, Daniel K; Yut, Laura; Webster, Kate E; Beynnon, Bruce; Kocher, Mininder S; Myer, Gregory D (August 2019). "'What's my risk of sustaining an ACL injury while playing sports?' A systematic review with meta-analysis". British Journal of Sports Medicine. 53 (16): 1003–1012. doi:10.1136/bjsports-2016-096274. PMC 6561829. PMID 29514822.
- ↑ Monk, A Paul; Davies, Loretta J; Hopewell, Sally; Harris, Kristina; Beard, David J; Price, Andrew J (3 April 2016). "Surgical versus conservative interventions for treating anterior cruciate ligament injuries". Cochrane Database of Systematic Reviews. 4: CD011166. doi:10.1002/14651858.CD011166.pub2. PMC 6464826. PMID 27039329.
{{cite journal}}: CS1 maint: article number as page number (link)
గమనిక
[మార్చు]- ↑ చంద్రవంక ఆకారంలో ఉండే ఫైబ్రోకార్టిలాజినస్ శరీర నిర్మాణ నిర్మాణం, ఇది కీలు కుహరాన్ని పాక్షికంగా విభజిస్తుంది. మానవులలో, అవి కొన్ని రకాల కీళ్లలో ఉంటాయి, ఉదా. మోకాలు, మణికట్టు అక్రోమియోక్లావిక్యులర్, స్టెర్నోక్లావిక్యులర్ టెంపోరోమాండిబ్యులర్ కీళ్లు.
- ↑ ఉదర వ్యాయామాలు ఉదరంలోని కండరాలను బలోపేతం చేసే వ్యాయామం. మానవ ఉదరంలో రెక్టస్ ఉదర కండరాలు, అంతర్గత ఆబ్లిక్, బాహ్య ఆబ్లిక్, ట్రాన్స్‌వర్సస్ అబ్డోమినిస్ అనే నాలుగు కండరాలు ఉంటాయి.