యాచింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రేవులో ఉంచబడ్డ యాచ్

యాచింగ్ ఒక వినోదాత్మక సెయిలింగ్ లేదా బోటింగ్, ఇది నీటి మీద చేసే యానానికి సంబంధించిన ఒక నిర్దిష్టమైన చర్య లేదా క్రీడా లక్ష్యాల కోసం ఇతర నీటి పడవలను ఉపయోగించడాన్ని సూచిస్తుంది.

సెయిలింగ్ పోటీలు[మార్చు]

సెయిలింగ్ అనేది ఒక క్రీడ. సెయిలింగ్ యొక్క నూతన ఆవిష్కారం నమోదు చేయబడ్డ చరిత్రకు మునుపటిది, ఇక సెయిలింగ్ పడవల పందెములు 17వ శతాబ్దంలో నెదెర్లాండ్స్‌లో మొదలయ్యిందని నమ్ముతారు. కొద్ది కాలంలోనే, వ్యక్తుల కోసం నిర్మించిన "చిన్నవిహారనౌకలు" వెలువడడం మొదలయ్యాయి. 1851లో న్యూయార్క్‌లో అమెరికన్ యాచ్ రేసింగ్ క్లబ్‌ పై విసిరిన సవాలు అమెరికా'స్ కప్ మొదలవ్వడానికి దోహదం చేసింది. 1983లో ఈ పోటీలోకి ఆస్ట్రేలియా యొక్క రాయల్ పెర్త్ యాచ్ క్లబ్ ఆస్ట్రేలియా IIని ప్రవేశపెట్టాక, దాని చేతిలో ఓడేంత వరకూ ఈ రెగెట్టాను న్యూ యార్క్ యాచ్ క్లబ్ గెలిచింది. ఈ లోపల, చిన్న డింగీల నుండి అతిపెద్ద మాక్సి యాచ్‌ల వరకు పందెపు విహారనౌకల యొక్క గుర్తించబడిన వర్గాల అభివృధ్ధితో యాచ్ రేసింగ్ వికసించడం కొనసాగింది.

అనేక భిన్న రకాల పందెపు పడవలు ఉన్నప్పటికీ, వాటిని సాధారణంగా పెద్దగా ఉండి పొడిగించిన సముద్రయానములకు సంబంధించిన సౌలభ్యాల కలిగిన పెద్దవైన విహారనౌకలు, ఇంకా డింగీలు మరియు స్కిఫ్ఫ్‌లు (చిన్న బోట్లు) లాంటి చిన్నపాటి హార్బర్ రేసింగ్ బోట్లుగా వేరుచేయవచ్చు. అన్ని వినోదాత్మక బోట్లు (వాణిజ్యపరమైన లేదా సైనిక ఓడలకు విరుధ్ధంగా) యాచ్‌లు అయినప్పటికీ, చిన్నపాటి బోట్లను సాధారణంగా యాచ్ అనరు. ఈ రోజుల్లో యాచ్ పందెములు మరియు డింగీ పందెములు అభివృధ్ధి చెందిన ప్రపంచంలో సాధారణంగా పాల్గొనే క్రీడలు, ప్రత్యేకంగా ఎక్కడయితే అనుకూలమైన వాయు స్థితులు మరియు తగినవిధంగా ఉండే నీటితో కూడిన ప్రదేశాలు అందుబాటులో ఉన్నపుడు. చాలా వరకు యాచింగ్ ఉప్పునీటి మీద నిర్వహించబడుతుంది, కానీ చిన్న ఓడలు సరస్సులలో ఇంకా పెద్ద నదులలో కూడా పందెములకు ఉపయోగించవచ్చు.

డింగీ రేసులను ఒకటి నుండి ముగ్గురు మనుషులతో చిన్నపాటి బోట్ల మీద నలుదిక్కులా భూమి ఉన్న నీటి ప్రదేశాలలో నిర్వహిస్తారు. పందెపు పడవలకు సాధారణ అమరిక స్లూప్, అంటే స్తంభము కలిగిన పడవ. కొన్ని డింగీలకు ఒక త్రిభుజాకారపు తెరచాప మాత్రం ఉంటుంది, కానీ చాలా వాటికి ఒక స్లూప్‌గా రూపొందించిన రెండు తెరచాపలు ఉంటాయి; కొన్ని డింగీలు మరియు దాదాపు అన్ని పెద్ద పందెపు పడవలు ఒక స్పిన్నాకర్ కలిగి ఉంటాయి, అది "గాలితో" తేలియాడుతూ యానం చేయడానికి రూపకల్పన చేయబడ్డ ఒక పెద్ద, ఉబికే తెరచాప. చాలా పందెములు ఒకేరకపు రూపకల్పన ("ఒకే రూపకల్పన కలిగిన" పందెం) కలిగిన ఓడల మధ్య జరుగుతాయి. ఈ పందేలలో ఒకే రకపు సామగ్రి కలిగి ఉన్న నావికులు చుట్టూ ఉన్న పరిస్థితులను అత్యుత్తమంగా గెలవడానికి ఉపయోగించుకుంటారు.

డింగీ రూపకల్పనలు చిన్నవి, స్థిరంగా ఉండేవి మరియు కొత్తగా అభ్యాసము మొదలుపెట్టిన వారికి నెమ్మదిగా కదిలే నౌకల నుండి తక్కువ బరువు కలిగి ఉండి, అతివేగంగా నడిచే రూపకల్పనల వరకూ వివిధ రకాలుగా ఉంటాయి, వీటిలో అతివేగపు రూపకల్పనలు అనుభవజ్ఞులైన సిబ్బందికి కూడా క్షేమంగా మరియు ప్రభావవంతంగా నడపడానికి కష్టంగా ఉంటాయి. ఆస్ట్రేలియా యొక్క 18-అడుగుల స్కిఫ్ఫ్ వర్గం బోట్లు అత్యంత వేగంగా కదిలే మోనోహల్ డింగీలు, అవి సాపేక్షకంగా తేలిక వీచే గాలులలో కూడా గంటకు 40 కిలోమీటర్ల వేగం (గంటకు 25 మైళ్ళు) అందుకోగలవు. సెయిలింగ్‌కు ఒక విసుగు పుట్టించే ప్రేక్షకుల క్రీడగా పేరున్నది,[ఉల్లేఖన అవసరం] కానీ, ప్రత్యేకంగా సిబ్బంది తమ పడవలను నిట్టనిలువుగా ఉంచడానికి పెనుగులాడుతోన్న అనూహ్యమైన పరిస్థితులలో స్కిఫ్ఫ్ రేసింగ్ చాలా ఉత్కంఠతను రేకెత్తించేది అయి ఉంటుంది. వివిధ మల్టి-హల్ రేసింగ్ వర్గాలు మరింత వేగంగా ఉంటాయి. వివిధ వన్-డిజైన్ డింగీ వర్గాలు వేసవి ఒలింపిక్ గేమ్స్‌లో పందెములకు దిగుతాయి.

పెద్దవైన యాచ్‌లు కూడా హార్బర్స్‌లో పందెములకు వెళ్తాయి, కానీ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పాయింట్-టు-పాయింట్ బహు దూరపు పందెములు సముద్రాల పైన జరుగుతాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు కనీసం ఈ పందెములను పూర్తి చేయడానికి కూడా సామగ్రి మరియు సంకల్ప బలానికి సంబంధించిన పరిగణించదగిన పరీక్షగా మారతాయి. అతిపొడవైన అలాంటి పోటీలు నెలల తరబడి సమయం పట్టే "ప్రపంచ వ్యాప్త" పందెములు, కానీ గుర్తింపు ఉన్న పోటీలలో యునైటెడ్ కింగ్‌డమ్ లోని ఫాస్ట్‌నెట్ రేస్ మరియు ఆస్ట్రేలియా యొక్క తూర్పు కోస్తా ప్రాంతపు సిడ్నీ టు హోబార్ట్ యాచ్ రేస్ లాంటివి ఉన్నాయి. పెద్ద పందెములు సాధారణంగా ఫర్స్ట్-పాస్ట్-ది-పోస్ట్ ట్రాఫి("లైన్ హానర్స్" అని పిలువబడినది)తో ఇంకా బోట్ల రూపకల్పనకు సంబంధించిన సాపేక్షక వేగాలకు ఫినిషింగ్ టైమ్స్ సర్దుబాటు చేసే హాండికాప్ వ్యవస్థ కింద సైధ్ధాంతికంగా ప్రతి పోటీదారుడికి గెలవడానికి సమానావకాశం కల్పిస్తూ నిర్వహించబడతాయి.


ఇతర యాచింగ్ పోటీలు[మార్చు]

ఒకపక్క సెయిలింగ్ సముదాయాలు అత్యంత క్రియాశీలక మరియు జనాకర్షక యాచింగ్ పోటీలు నిర్వహిస్తుంటే, మరోపక్క ప్రపంచవ్యాప్త ఇతర బోటింగ్ పోటీలు కూడా నిర్వహించబడుతూ ఉంటాయి: వాటిలో స్పీడ్ మోటార్ బోట్ రేసింగ్; కనోయింగ్, కయాకింగ్ మరియు రోవింగ్ పోటీలు; నౌకాయానపు పోటీలు (సాధారణంగా GPS మరియు ఇతర ఎలెక్ట్రానిక్ నౌకాయాన సామగ్రిని ఉపయోగించనివ్వనపుడు ఆకాశసంబంధిత మరియు కొండగురుతుల ఆధారితమైన నౌకాయాన నైపుణ్యాలు యొక్క పరీక్ష) లాంటివి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే పోటీలలో ఉంటాయి. హైడ్రోఫాయిల్స్, హోవర్‌క్రాఫ్ట్‌లు లేదా వ్యక్తిగత వాటర్‌క్రాఫ్ట్‌ల లాంటి ప్రత్యేక ప్రావీణ్యత కలిగిన యాచ్‌లు కూడా సామగ్రిని మరియు నైపుణ్యతను (సాధారణంగా, భద్రతాలక్ష్యసాధనకు సంబంధించిన నైపుణ్యత) పరీక్షించే పోటీలలో పాలు పంచుకుంటాయి. అవి వినోద లేదా క్రీడా లక్ష్యాల కోసం ఉద్దేశించినవి అయితే, అలాంటి పోటీలన్ని కూడా మరింత పెద్ద యాచింగ్ ప్రపంచంలో భాగమే.

వాటర్‌క్రాఫ్ట్ యొక్క యాచింగ్ ఇతర ఉపయోగాలు[మార్చు]

యాచింగ్‌గా గుర్తించబడని వాటర్‌క్రాఫ్ట్ యొక్క సామాన్య వాణిజ్య ఉపయోగాలలో, వ్యాపార సంబంధితమైన చేపలు పట్టే పనులు, షిప్పింగ్, ఫెర్రీలు నడపడం, మరియు సైనిక ప్రయోజనాలు ఉంటాయి. ఈ ఉదంతాలలో, పడవ అనేది వినోదాత్మక యాచ్ లేదా చిన్న పరిమాణపు వాణిజ్య లేదా సైనిక నౌకలకు కూడా వర్తించదగిన జాతికి అంతా చెందే పదం అయినప్పటికీ పెద్దవైన నౌకలను ఓడలు అంటారు, చిన్న నౌకలను ఓడలు లేదా పడవలు అంటారు.

వినోద నౌకా యానం - ఒక జీవనవిధానంగా యాచింగ్[మార్చు]

వినోదనౌకాయానంలో ఒక పడవలో ప్రయాణం చేయడం జరుగుతుంది, అది గ్రేట్ లేక్స్ (U.S.లో) మీద ఉన్న సముద్ర శాఖలో ఒక వైపు నుండి మరోవైపుకు వెళ్ళడం కావచ్చు లేదా సౌత్ పెసిఫిక్‌లో ఒక దీవి నుండి మరో దీవికి కావచ్చు. బహుదూరాల గుండా క్షేమంగా వినోదనౌకాయానం చేయడానికి స్వయంసమృధ్ధి మరియు పడవను ఉపయోగించే సామర్ధ్యం కంటే విస్తృతమైన శ్రేణిలో నైపుణ్యాలు అవసరం. దూర తీరాలకు వినోద నౌకా యానం చేసేపుడు నౌకాయానం, వాతావరణశాస్త్రము, యంత్ర సంబంధిత మరియు విద్యుత్ సంబంధిత వ్యవస్థలు, రేడియో, ఫర్స్ట్ ఎయిడ్, సముద్రజీవిత మనుగడ, పోషకాహారము మరియు మరిన్ని విషయములకు సంబంధించిన జ్ఞానం అవసరం, ఇంకా సుదీర్ఘ ప్రయాణాలు చేసేటప్పుడు అది ప్రాణాలు కాపాడవచ్చు కూడా. USలో యునైటెడ్ స్టేట్స్ సెయిల్ అండ్ పవర్ స్క్వాడ్రన్స్ ఈ నైపుణ్యాలలో కోర్సులు మరియు ధృవపత్రాలు ఉపలబ్ధం చేస్తాయి. UKలో, ధృవపత్రాలకు సంబంధించిన వ్యవస్థను రాయల్ యాచింగ్ అసోసియేషన్ నడుపుతుంది. ఇతర దేశాలలో సంస్థలు అలాంటి వ్యవస్థలు ఉపలబ్ధం చేస్తాయి వాటిల్లో విలక్షణంగా ఒక శ్రేణిలో కోర్సులు ఉంటాయి, అవి సైధ్ధాంతికము మరియు అభ్యాససిధ్ధమైనవి అయి ఉంటాయి.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • యాచ్
 • యాచ్ క్లబ్
 • నౌకావిహారం
 • నౌకాయానం
 • డింగి నౌకావిహారం
 • మాన్‌సూన్ రెగెట్టా
 • యాచ్ పందెములు
 • యాచ్ సంబంధిత సంఘ నిర్మాణ వ్యవహార నిబంధనలు
 • విలాసవంతమైన యాచ్
 • డింగీ పందెములు
 • వినోదనౌకాయానం (మారిటైమ్)
 • నౌకాసంబంధిత ప్రపంచవ్యాప్త షిప్ లొకేషన్ మాపింగ్ సర్వీస్

మూస:Keelboats worldwide మూస:Trailer sailers and Trailer yachts worldwide మూస:Sailing dinghies and skiffs మూస:List of catamarans and trimarans

"https://te.wikipedia.org/w/index.php?title=యాచింగ్&oldid=1519563" నుండి వెలికితీశారు