యుగంధర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యుగంధర్
(1979 తెలుగు సినిమా)
Yugandhar.jpg
దర్శకత్వం కె.ఎస్.ఆర్.దాస్
నిర్మాణం పి. విద్యాసాగర్
కథ జావేద్ అఖ్తర్ (హిందీలో "డాన్")
తారాగణం నందమూరి తారక రామారావు,
జయసుధ ,
సత్యనారాయణ,
జయమాలిని,
జగ్గయ్య,
ప్రభాకర రెడ్డి,
కాంతారావు,
జయమాలిని
సంగీతం ఇళయరాజా
నేపథ్య గానం ఎస్. జానకి
సంభాషణలు డి.వి. నరసరాజు
ఛాయాగ్రహణం ఎమ్.సి. శేఖర్
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ శ్రీ గజలక్ష్మి ఆర్ట్స్
నిడివి 159 నిముషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఇది 1979లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. అమితాబ్ సూపర్ హిట్ సినిమా 'డాన్' ఆధారంగా తెలుగులో నిర్మించారు. ఐతే చిత్రకథ అప్పటికే చైనా టౌన్ హిందీ చిత్రం ఆధారంగా తెలుగులో వచ్చిన 'భలే తమ్ముడు' చిత్రకథకు కొంత దగ్గరగా ఉంటుంది. దీని దర్శకుడు కెయెస్ఆర్ దాస్. ఎన్టీఆర్ నటించి, ఇళయ రాజా స్వర పరచిన ఒకే ఒక చిత్రం యుగంధర్.

చిత్రకథ[మార్చు]

యుగంధర్ పెద్ద స్మగ్లర్. అతని ముఠా చేసే కార్య క్రమాలు పోలీసులు ఆపలేకపోతుంటారు. జయసుధ అన్నయ్య, జయమాలిని ప్రేమికుడు ఐన ప్రసాద్ బాబు పోలీసుల తరఫున యుగంధర్ వద్ద పనిచేస్తుంటాడు. అతన్ని కనిపెట్టిన యుగంధర్ అతన్ని చంపేస్తాడు. జయమాలిని ,యుగంధర్ ను పోలీసులకు పట్టించబోయి అతనిచేతిలో చనిపోతుంది. జయసుధ ,యుగంధర్ మీద పగబడుతుంది.పోలీసు దాడి లో యుగంధర్ గాయపడి పోలీసు అధికారి జగ్గయ్య కారులో మరణిస్తాడు. జగ్గయ్యకు యుగంధర్ పోలికలతో ఉన్న మరో ఎన్.టి.ఆర్ కనిపిస్తాడు. అతన్ని దగ్గరకు తీసి, యుగంధర్ స్థానంలో ప్రవేశపెడతారు. స్మగ్లరు ముఠా ను పట్టుకునే ప్రయత్నం లో జగ్గయ్య మరణిస్తాడు. యుగంధర్ స్తానంలో వేరే వ్యక్తి ఉన్నాడని మిగతావారికి తెలుస్తుంది. ఐతే పోలీసులు అతనినే యుగంధర్ అనుకుంటున్నారు. ఈ స్థితి లో స్మగ్లర్ల చేతిలో మోసపోయిన సత్యనారాయణ ప్రవేశిస్తాడు. అతని పిల్లల్ని ఎన్.టి.ఆర్ ఆదుకుంటాడు. సత్యనారాయణ, జయసుధల సాయంతో ఎన్.టి.ఆర్ స్మగ్లర్లను పోలీసులకు పట్టించి ఇవ్వడం మిగతా చిత్రం.

పాటలు[మార్చు]

  • నాపరువం నీకోసం
  • జంతర్ మంతర్ నగరం
  • దా దా దా దాస్తే దాగేదా
  • ఓ రబ్బా ఏసుకున్నా కిళ్ళీ
  • మీ కోసమే నేనొచ్చాను

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=యుగంధర్&oldid=3142953" నుండి వెలికితీశారు