యుగయుగాలుగా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ గీతాన్ని అబ్బూరి రామకృష్ణారావు గారు రచించారు. రవీంద్రనాథ టాగూరు రచించిన Red Oleanders (ఇంగ్లీషు)/ రక్తకరబీ (బెంగాలీ) నాటకాన్ని అబ్బూరి రామకృష్ణారావు ' ఎర్రగన్నేరు ' పేరుతో అనువదించారు. దాన్ని 1961లో ఆకాశవాణి హైదరాబాదులో బాలాంత్రపు రజనీకాంతరావుగారు సంగీత రూపకంగా ప్రసారం చేశారు. అందులోది ఈ పాట. దీన్ని మహాభాష్యం చిత్తరంజన్ గానం చేశారు. స్వర రచన రజనీ గారు చేశారు.

రాగం: మధువంతి

తాళం : రూపకం (దాద్రా)

<poem>

యుగయుగాలుగా నన్నే కోరియుండె కాబోలును నేనడిచే దారిచెంత నిలిచియుండెనో ఏమో ॥

ఏనాడో సంజె వేళ మసక మసక వెలుతురులో కనుగోనల నేనాతని కాంచియుంటిననిపించును నేనడిచే దారిచెంత నిలిచియుండెనో ఏమో ॥

వెలుగు జిలుగు పాటలతో నేడే జాబిలీ నివాళి వీడిపోవు నీలిముసుగు నిశాముఖము నుండి వ్రీలి వెన్నెల వెలుగున నాతడు కన్నులెదుట కనిపించగ తెరలన్నీ చిటికెలోన సురిగి మాయమైపోవును నేనడిచే దారిచెంత నిలిచియుండెనో ఏమో ॥