యులిసెస్ (నవల)
| రచయిత(లు) | జేమ్స్ జాయిస్ |
|---|---|
| దేశం | పారిస్, ఫ్రాన్స్ |
| భాష | ఆంగ్లం |
| శైలి | ఆధునికవాద నవల |
| Set in | డబ్లిన్, 16–17 జూన్ 1904 |
| ప్రచురణ కర్త | షేక్స్పియర్ అండ్ కంపెనీ (1919–1941) |
ప్రచురించిన తేది | 2 ఫిబ్రవరి 1922 |
| మీడియా రకం | ముద్రణ: హార్డ్బ్యాక్ |
| పుటలు | 732 |
| 823.912 | |
| LC Class | PR6019.O8 U4 1922 |
| Preceded by | ఆ పోర్ట్రైట్ అఫ్ ది ఆర్టిస్ట్ అస్ ఆ యంగ్ మాన్ |
| Text | యులిసెస్ (నవల) at Wikisource |
యులిసెస్ అనేది ఐరిష్ రచయిత జేమ్స్ జాయిస్ రాసిన ఒక ఆధునిక నవల. మార్చి 1918 నుండి డిసెంబర్ 1920 వరకు అమెరికన్ పత్రిక 'ది లిటిల్ రివ్యూ'లో పాక్షికంగా ధారావాహికగా ప్రచురించబడిన ఈ పూర్తి రచన, జాయిస్ నలభైవ పుట్టినరోజు అయిన 2 ఫిబ్రవరి 1922న పారిస్లో సిల్వియా బీచ్ ద్వారా ప్రచురించబడింది. ఇది ఆధునికవాద సాహిత్యంలోని అత్యంత ముఖ్యమైన రచనలలో ఒకటిగా [3], ఈ ప్రక్రియలో ఒక క్లాసిక్గా పరిగణించబడుతుంది, దీనిని "మొత్తం ఉద్యమానికి ఒక ప్రదర్శన, సారాంశం" అని పిలుస్తారు. [4]
యులిసెస్, 1904 జూన్ 16వ తేదీన ఒకే రోజులో ముగ్గురు డబ్లిన్ వాసుల అనుభవాలను వివరిస్తుంది (ఈ రోజును ఇప్పుడు దాని అభిమానులు ప్రతి సంవత్సరం బ్లూమ్స్డేగా జరుపుకుంటారు). హోమర్ రచించిన ' ఒడిస్సీ ' ఇతిహాసంలోని కథానాయకుడైన ఒడిస్సియస్ లాటిన్ నామమే యులిసెస్. ఈ నవల లియోపోల్డ్ బ్లూమ్, ఒడిస్సియస్, మోలీ బ్లూమ్, పెనెలోప్, అలాగే స్టీఫెన్ డెడలస్, టెలిమాకస్ల మధ్య అనేక సారూప్యతలను నెలకొల్పుతుంది. విలియం షేక్స్పియర్ నాటకం హామ్లెట్తో, యేసు, ఏలీయా, మోసెస్, డాంటే అలిఘేరి, డాన్ జువాన్తో సహా ఇతర సాహిత్య, మత, పౌరాణిక వ్యక్తులతో కూడా సంబంధాలు ఉన్నాయి. [5] యూదు వ్యతిరేకత, మానవ లైంగికత, ఐర్లాండ్లో బ్రిటిష్ పాలన, క్యాథలిక్ మతం, ఐరిష్ జాతీయవాదం వంటి అంశాలు 20వ శతాబ్దం ప్రారంభ నాటి డబ్లిన్ నేపథ్యంలో చర్చించబడ్డాయి. ఇది అధికంగా సూచనాత్మకంగా ఉండి, వివిధ శైలులలో వ్రాయబడింది.
రచయిత్రి జూనా బార్న్స్, జాయిస్ ఇలా అన్నట్లు ఉటంకించారు, "విచారకరమైన విషయం ఏమిటంటే... ప్రజలు నా పుస్తకంలో ఒక నీతిని ఆశిస్తారు, కనుగొంటారు—లేదా అంతకన్నా దారుణంగా వారు దానిని మరింత గంభీరమైన రీతిలో తీసుకోవచ్చు, ఒక పెద్దమనిషి గౌరవం మీద ఒట్టు, అందులో ఒక్క గంభీరమైన వాక్యం కూడా లేదు. ... యులిస్సెస్లో నేను, ఒక మనిషి ఏమి చెబుతాడో, చూస్తాడో, ఆలోచిస్తాడో, అలా చూడటం, ఆలోచించడం, చెప్పడం, మీరు ఫ్రాయిడియన్లు ఉపచేతన అని పిలిచే దానికి ఏమి చేస్తుందో ఏకకాలంలో నమోదు చేశాను." [6]
రచయిత డెక్లాన్ కిబెర్డ్ ప్రకారం, "జాయిస్కు ముందు, ఏ కల్పనా రచయిత కూడా ఆలోచనా ప్రక్రియకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు". [7] దీనిలోని భావధార శైలి, జాగ్రత్తగా కూర్చిన నిర్మాణం, శ్లేషలు, అనుకరణలు, ఆకస్మిక జ్ఞానోదయాలు, పరోక్ష సూచనలతో నిండిన ప్రయోగాత్మక గద్యం, అలాగే గొప్ప పాత్ర చిత్రణ, విస్తృత హాస్యం వంటివి దీనిని గొప్ప సాహిత్య రచనలలో ఒకటిగా పరిగణించేలా చేశాయి. దీని ప్రచురణ జరిగినప్పటి నుండి , 1921లో యునైటెడ్ స్టేట్స్లో జరిగిన అశ్లీలత విచారణ నుండి మొదలుకొని, ఈ గ్రంథం ప్రామాణికమైన కూర్పు గురించిన సుదీర్ఘ వివాదాల వరకు ఇది అనేక వివాదాలను, పరిశీలనలను ఆకర్షించింది.
నేపథ్యం
[మార్చు]పిల్లల కోసం రూపొందించిన ఒడిస్సీ అనుసరణ అయిన చార్లెస్ లాంబ్ ' అడ్వెంచర్స్ ఆఫ్ యులిసెస్'లో జాయిస్ మొదటిసారిగా ఒడిస్సియస్/యులిసెస్ పాత్రను చూశారు, ఇది జాయిస్ మనసులో ఆ లాటిన్ పేరును స్థిరపరిచినట్లు అనిపిస్తుంది. పాఠశాలలో అతను ఆ పాత్రపై "నాకు ఇష్టమైన హీరో" అనే శీర్షికతో ఒక వ్యాసం రాశాడు. [8] సాహిత్యంలో యులిస్సెస్ మాత్రమే సర్వగుణ సంపన్నమైన పాత్ర అని తాను భావిస్తున్నట్లు జాయిస్ ఫ్రాంక్ బడ్జెన్కు చెప్పాడు. అతను డబ్లినర్స్ కోసం "యులిసెస్" అనే పేరుతో మరొక చిన్న కథను వ్రాయాలని భావించాడు, ఇది ఆల్ఫ్రెడ్ హెచ్. హంటర్ అనే యూదు డబ్లిన్ వాసిపై ఆధారపడి ఉంటుంది, అతను ఒక కుక్కోల్డ్ అని భావించబడ్డాడు. [9] ఈ ఆలోచన 1906లో ఒక కథగా మొదలై, 1907లో "చిన్న పుస్తకం"గా [10], 1914లో అతను ప్రారంభించిన బృహత్ నవలగా రూపుదిద్దుకుంది.
మూలాలు
[మార్చు]- ↑ Hanaway-Oakley, Cleo (1 February 2022). "Ulysses at 100: why Joyce was so obsessed with the perfect blue cover". The Conversation (in ఇంగ్లీష్). Retrieved 2023-01-12.
- ↑ Ellmann 1982, p. 524.
- ↑ Harte, Tim (Summer 2003). "Sarah Danius, The Senses of Modernism: Technology, Perception, and Aesthetics". Archived 2003-11-05 at the Wayback Machine (review of Danius book).
- ↑ Beebe 1972, p. 176.
- ↑ Tindall 1959, p. 130.
- ↑ Barnes, Djuna (April 1922). "James Joyce: A Portrait of the Man Who is, at Present, One of the More Significant Figures in Literature". Vanity Fair.
- ↑ (16 June 2009). "Ulysses, modernism's most sociable masterpiece.".
- ↑ Jaurretche, Colleen (2005). Beckett, Joyce and the art of the negative. European Joyce studies. Vol. 16. Rodopi. p. 29. ISBN 978-90-420-1617-0. Retrieved 1 February 2011.
- ↑ Ellmann 1982, p. 230.
- ↑ Ellmann 1982, p. 265.