యువభారతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యువభారతి
యువభారతి
Yblogo.jpg
స్థాపన27 అక్టోబరు 1963 (1963-10-27) (56 years ago)
వ్యవస్థాపకులుఇరివెంటి కృష్ణమూర్తి
సంస్థ రకంసాహిత్య, సాంస్కృతిక సంస్థ
కార్యస్థానం
సేవలు180 కు పైగా గ్రంథాల ప్రచురణ
ముఖ్యమైన వ్యక్తులువంగపల్లి విశ్వనాథం (కన్వీనర్)

చుట్టూరా ఆవరించుకుని వున్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటె ప్రయత్నించి ఎంత చిన్న దీపాన్నయినా వెలిగించడం మంచిది అనే ధ్యేయంతో 1963లో విజయదశమి అక్టోబరు 27 నాడు యువభారతి ఆవిర్భవించింది[1]. ఇరివెంటి కృష్ణమూర్తి దీనిని స్థాపించి అధ్యక్షుడిగా ఉన్నాడు. మొదట ఈ సంస్థ కార్యస్థానం సికిందరాబాదులోని కింగ్స్‌వేలో ఉండేది. ప్రస్తుతం హైదరాబాదు లోని బొగ్గులకుంట ప్రాంతంలో ఈ సంస్థ కార్యాలయం ఉంది. ప్రస్తుతం వంగపల్లి విశ్వనాథం ఈ సంస్థకు సమావేశ కర్త (కన్వెనర్)గా, డా. ఆచార్య ఫణీంద్ర అధ్యక్షుడిగాను, జీడిగుంట వెంకట్రావు కార్యదర్శిగాను వ్యవహరిస్తున్నారు.ఈ సంస్థ ప్రచురించే ప్రచురణల రూపకల్పనకు డా.బి.జయరాములు సంపాదకులుగా, సుధామ ప్రధాన సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. యువభారతి సమాజహితం కోసం, సాహిత్య అభ్యుదయం కోసం కృషిచేస్తున్నది. సమాజంలో సౌమనస్యం, సౌజన్యం పెంపొందించడానికి ప్రయత్నిస్తున్నది. వ్యక్తులు ఉన్నత భావాలను, నిర్మాణాత్మక దృక్పథాలను ఏర్పరచుకోడానికి ప్రోత్సహిస్తున్నది.

యువభారతి సంస్థ "సమయపాలన మా క్రమశిక్షణ" నినాదంతో, సాహిత్య సభలను ఒక ప్రత్యేక ఒరవడి, శైలిలో నిర్వహించడం, అత్యధికస్థాయిలో సాహిత్య ప్రసంగాలను/ఉపన్యాసాలను పుస్తకరూపంలో తీసుకురావడం ద్వారా, సాహిత్యాసక్తపరులకు పఠనయోగం కల్పించడంలో అర్థ శతాబ్దకాలంగా, స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించుకున్న నేపథ్యంలో, అసామాన్య సేవలను అందించడం ప్రధాన ధ్యేయ లక్ష్యాలతో సంస్థ నిర్వహింపజేసుకోవడంలో తనదైన ప్రత్యేకతను సంతరించుకున్న సాహితీ సాంస్కృతిక సంస్థ.

విశేషాలు[2],[3][మార్చు]

 • మారుతున్న విలువలు రచయితల బాధ్యతలు అని 1970 లో 'రచన' చర్చాగోష్ఠి నిర్వహించింది.
 • పాతకొత్తల మేలు కలయికను ప్రాతిపదికగా పెట్టుకుని ఇప్పటివరకు 180 పుస్తకాలకు పైగా ప్రచురించింది.
 • నందిని అనే మాసపత్రికను నడిపింది.
 • ప్రాచీన ప్రబంధాలపై దివాకర్ల ఉపన్యాసాలను ఏర్పాటు చేసి ఆ ఉపన్యాసాలను కావ్యలహరి పేరుతో గ్రంథస్తం చేసింది.
 • లహరి శీర్షికలో విశ్వనాథ నుండి విప్లవ కవులదాకా ప్రసంగాలను ఏర్పాటు చేసి ఆ వ్యాసాలను పుస్తకరూపంలో తెచ్చింది.
 • భారత స్వాతంత్య్ర రజతోత్సవాల సందర్భంగా 1972లో స్వాతంత్య్ర యుగోదయంలో (1947- 72) తెలుగు తీరుతెన్నులు గురించి మహతి పేర నూటొక్కవ్యాసాల సమీక్షావ్యాస సంకలనం ప్రచురించింది.

కార్యక్రమాలు[మార్చు]

 • ప్రతి నెల మొదటి ఆదివారం యువకులకు ఉచితంగా వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలను నిర్వహిస్తున్నది.
 • వక్తృత్వం, రచన, సమీక్ష మొదలగు సామర్థ్యాలను పెంపొందించుకోడానికి 'ప్రతిభ' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.
 • ప్రముఖుల జయంతి సభలను ఇతర సాహితీ సభలను ఏర్పాటు చేస్తున్నది.

స్వర్ణోత్సవాలు[మార్చు]

2012లో ఈ సంస్థ స్వర్ణోత్సవాలను ఘనంగా జరుపుకొంది.

యువభారతి ప్రచురణలు[మార్చు]

 1. సరస్వతీ సాక్షాత్కారము[4]
 2. జీవనగీత [5]
 3. వీచికలు [6]
 4. విద్యావైద్యశాస్త్రకళారంగాలు - మానవతా విలువలు
 5. స్వాతంత్ర్య స్వర్ణభారతి
 6. సాహితీ సమాలోచనం 1992-93
 7. విజయానికి అభయం
 8. అనుభూతి
 9. భావుక సీమ
 10. వ్యాస సాహితీ సంహిత
 11. స్వరాలు[7]
 12. జగద్గురు సాహితీ లహరి
 13. మరో జంఘాలశాస్త్రి
 14. దివాకర ప్రభ
 15. విశ్వనాథ సాహితీ సమాలోచనం
 16. తెలుగు బాల సాహిత్యం
 17. బాబా ఫరీద్ సూక్తులు
 18. వ్యాస సూక్తం
 19. ప్రజా సూక్తం
 20. యువత
 21. భోగినీ లాస్యం
 22. నవ్యసాహితీ లహరి
 23. కొత్త గొంతుకలు సరికొత్త విలువలు
 24. నవ జీవనం
 25. స్వామి వివేకానంద కవితా వైభవం
 26. వెలుగు రేఖలు
 27. చిలకమర్తి కవితావైభవం
 28. తెలుగు, తమిళ కవితలు జాతీయవాదం
 29. భావన
 30. ప్రభావం
 31. మాఘకావ్యవైభవం
 32. సంస్కృత సాహితీ లహరి
 33. ఈ దశాబ్దంలో తెలుగు సాహిత్యం (1980-1990)
 34. పాతికేళ్ల పత్రికారచన (1965-1990)
 35. వెండివెలుగులు
 36. అమృతరాజీవం
 37. పెద్దన కవితావైభవం
 38. నన్నయ కవితావైభవం
 39. గోరాశాస్త్రీయం
 40. మరపురాని మనీషి
 41. ప్రతిభా లహరి
 42. సాహిత్యాధ్యయనం
 43. పగలే వెన్నెల
 44. రామాయణ సుధాలహరి
 45. విశ్వనాథ కవితావైభవం
 46. మేం (కవితా సంకలనం)
 47. పింగళి సూరన కవితావైభవం
 48. అయ్యలరాజు కవితావైభవం
 49. తిమ్మన కవితావైభవం
 50. వేమన వేదం
 51. శిఖరాలు లోయలు
 52. కాళిదాసు కవితావైభవం (ప్రచురణ సంఖ్య 51) [8]
 53. కవితాలహరి
 54. రచన (విలువలు-బాధ్యతలు-దృక్పథాలు)
 55. ఆలోచనాలహరి
 56. ఇతిహాసలహరి
 57. నవోదయలహరి
 58. మహాతి (స్వాతంత్ర్య యుగోదయంలో తెలుగు తీరుతెన్నులు)
 59. కావ్య సందర్శనం
 60. చైతన్యలహరి
 61. వికాసలహరి
 62. ఆంధ్ర సాహిత్య విమర్శ-ఆంగ్ల ప్రభావం
 63. రావిశాస్త్రిగారి ధర్మేతిహాసం
 64. ఆధునిక సాహిత్య విమర్శ అభిరుచి ధోరణి
 65. వ్యాస సాహితీ సంహిత
 66. నారాయణరెడ్డి సాహితీమూర్తి (ప్రచురణ సంఖ్య 80) [9]
 67. వెలుగు చూపే తెలుగు పద్యాలు (ప్రచురణ సంఖ్య 92) [10]
 68. అన్నమయ్య[11] (ప్రచురణ సంఖ్య:94) - ముదిగొండ సంగమేశం -1983
 69. దేశమును ప్రేమించుమన్నా (ప్రచురణ సంఖ్య 102) [12]
 70. కవిసమయములు (ప్రచురణ సంఖ్య 120) [13]
 71. భారతంలో ప్రేమకథలు (ప్రచురణ సంఖ్య 133) [14]
 72. వేద విజ్ఞాన లహరి (ప్రచురణ సంఖ్య 176)
 73. విజయానికి అభయం (ప్రచురణ సంఖ్య 177) [15]
 74. ఉపనిషత్ సుధాలహరి (ప్రచురణ సంఖ్య 178)
 75. వ్యక్తిత్వవికాసం సూత్రాలు - సూక్తులు (ప్రచురణ సంఖ్య 179)

మూలాలు[మార్చు]

 1. కినిగె. "యువభారతి ప్రింటు పుస్తకాలు". కినిగె.కామ్.
 2. యువ, విశ్వనాథం (15-10-2009). "కవి కాలమ్". ఆంధ్రప్రభ దినపత్రిక. Check date values in: |date= (help)
 3. ఎడిటర్ (అక్టోబర్ 26, 2012). "యువభారతి సాహితీ సంస్కృతులు". వార్త దినపత్రిక.
 4. అనుముల, కృష్ణమూర్తి. సరస్వతీసాక్షాత్కారము. హైదరాబాద్: యువభారతి.
 5. కాళోజీ, నారాయణరావు. జీవనగీత (ఖలీల్ జీబ్రాన్ ది ప్రాఫెట్‌కు తెలుగుసేత). హైదరాబాదు: యువభారతి.
 6. ఇరివెంటి, కృష్ణమూర్తి (అక్టోబరు 1968). వీచికలు (1 సంపాదకులు.). సికిందరాబాదు: యువభారతి. Check date values in: |date= (help)
 7. తిరుమల శ్రీనివాసాచార్య, విశ్వనాథ సూర్యనారాయణ (1973 ఏప్రిల్). స్వరాలు. హైదరాబాదు: యువభారతి. Check date values in: |date= (help)
 8. పుల్లెల, శ్రీరామచంద్రుడు (డిసెంబర్ 1976). కాళిదాసు కవితావైభవం. హైదరాబాదు: యువభారతి.
 9. తిరుమల, శ్రీనివాసాచార్య (డిసెంబర్ 1981). నారాయణరెడ్డి సాహితీమూర్తి. హైదరాబాదు: యువభారతి.
 10. ఇరివెంటి, కృష్ణమూర్తి (ఆగష్టు 1983). వెలుగుచూపే తెలుగు పద్యాలు. హైదరాబాదు: యువభారతి. Retrieved 3 December 2014. Check date values in: |date= (help)
 11. ముదిగొండ, సంగమేశం (1983). అన్నమయ్య. హైదరాబాదు: యువభారతి.
 12. ఇరివెంటి, కృష్ణమూర్తి (1984,2010). దేశమును ప్రేమించుమన్నా (7 సంపాదకులు.). హైదరాబాదు: యువభారతి. Check date values in: |date= (help)
 13. ఇరివెంటి, కృష్ణమూర్తి (1987). కవిసమయములు (1 సంపాదకులు.). సికిందరాబాదు: యువభారతి.
 14. ముక్తేవి, లక్ష్మణరావు; ముక్తేవి, భారతి (మే,1991). భారతంలో ప్రేమకథలు (1 సంపాదకులు.). హైదరాబాదు: యువభారతి. Retrieved 16 December 2014. Check date values in: |date= (help)
 15. గంధం, నారాయణ (2011). విజయానికి అభయం. హైదరాబాదు: యువభారతి.
"https://te.wikipedia.org/w/index.php?title=యువభారతి&oldid=2537571" నుండి వెలికితీశారు