యువరాజు (2000 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యువరాజు
(2000 తెలుగు సినిమా)
Yuvaraju.jpg
దర్శకత్వం వై.వి.ఎస్.చౌదరి
నిర్మాణం బూరుగుపల్లి శివరామకృష్ణ
రచన వై.వి.ఎస్. చౌదరి,
చింతపల్లి రమణ
తారాగణం మహేష్ బాబు ,
సాక్షి శివానంద్ ,
సిమ్రాన్
సంగీతం రమణ గోగుల
ఛాయాగ్రహణం అజయ్ విన్సెంట్
నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్
విడుదల తేదీ ఏప్రిల్ 14, 2000
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

యువరాజు 2000 లో విడుదలైన తెలుగు చిత్రం. వై.వి.ఎస్ చౌదరి దర్శకత్వం వహించి నిర్మించాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు, సిమ్రాన్, సాక్షి శివానంద్ నటించారు . ఈ చిత్రం మహేష్ బాబుకు "ప్రిన్స్" అనే ట్యాగ్ ఇచ్చింది. ఈ చిత్రాన్ని హిందీలో ఏక్ ఔర్ రాజ్‌కుమార్ అనే పేరుతో అనువదించారు.

కథ[మార్చు]

శ్రీనివాస్ ( మహేష్ బాబు ) ఇప్పుడే భారతదేశానికి తిరిగి వచ్చి హైదరాబాద్ లోని ఒక కళాశాలలో చేరాడు. అక్కడ, అతను తన క్లాస్మేట్ శ్రీవల్లి ( సాక్షి శివానంద్ ) ను కలుస్తాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. శ్రీవల్లికి విదేశాలలో చిన్ననాటి స్నేహితుడు, వంశీ (వెంకట్) ఉన్నాడు. అతన్ని ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ గా భావిస్తుంది. 20 సంవత్సరాల క్రితం ఒక విమానం కూలిపోయినప్పుడు ఈ ఇద్దరు మాత్రమే ఈ విషాదం నుండి బయటపడ్డారు. అంచేత అతడిని తన హృదయానికి దగ్గరగా ఉంచుకుంటుంది.  

చివరగా శ్రీనివాస్, శ్రీవల్లి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామని తెలుసుకుంటారు. ఈ సంగతి చెప్పగానే పెద్దలు విలాసవంతమైన నిశ్చితార్థ వేడుకను ఏర్పాటు చేస్తారు. నిశ్చితార్థానికి హాజరు కావడానికి శ్రీలత ( సిమ్రాన్ ) వస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితమే వాళ్ళిద్దరికీ విదేశాలలో పరిచయం ఉందని కొద్దిపాటి పరిశీలన లోనే శ్రీవల్లికి అర్థమౌతుంది.

శ్రీలతకు తేజ అనే కుమారుడు ఉన్నాడు. అతడితో శ్రీనివాస్ స్నేహం చేస్తాడు. తన తండ్రి తమతో కలిసి జీవించడం లేదని అతనికి తెలుసు. తరువాత ఒక విహారయాత్రలో తేజ ఒక ట్యూన్ వాయిస్తాడు. ఇది అతని తండ్రి ట్యూన్ అని తల్లి అతనికి నేర్పింది. ఇక్కడ తేజ తన కొడుకే అని శ్రీనివాస్ తెలుసుకుంటాడు.

శ్రీలత అతనికి విషయం వివరిస్తుంది. ఒకసారి విహారయాత్రలో ఉండగా వారికి గిరిజనులు పానీయం ఇచ్చారు. అప్పుడు ఏమి జరిగిందనేది ఆమెకు 3 నెలల తరువాత తెలిసింది కాని అతను కనబడలేదు. ఇప్పుడు అతను శ్రీవల్లికి నిజం చెప్పాలనుకుంటాడు. కాని ఎవరికీ చెప్పనని శ్రీలత తన కొడుకు ఫోటోపై వాగ్దానం చేయిస్తుంది. తేజ నిజం తెలుసుకుంటాడు. శ్రీనివాస్, తేజ ఇద్దరూ దగ్గరౌతారు. శ్రీనివాస్ తన కొడుకును కోరుకుంటున్నందున తన పెళ్ళి గురించి పునరాలోచిస్తాడు. వంశీ శ్రీవల్లిని ప్రేమిస్తాడు. ఆమెను గెలుచుకోడానికి పెళ్ళికి వస్తాడు.

పెళ్లి రోజు వచ్చింది. శ్రీలత పెళ్ళి చూడటం భరించలేక, వెళ్ళిపోడానికి ప్రయత్నిస్తుంది. తేజ బయలుదేరే ముందు తండ్రిని చూడాలనుకుంటాడు. తేజ రాసిన లేఖ ద్వారా శ్రీవల్లీ నిజం తెలుసుకుంటుంది. శ్రీనివాస్ విమానాశ్రయంలో వారిని ఆపడానికి ప్రయత్నిస్తాడు, అక్కడ ఆమె విషం తీసుకున్నట్లు వారు తెలుసుకుంటారు. శ్రీవల్లి కూడా అక్కడకు చేరుకుంటుంది.వారు ఆమెను ఆసుపత్రికి తీసుకువెళతారు, ఈ సమయంలో రౌడీలు వారిపై దాడి చేస్తారు.

ఆమెను ఆసుపత్రికి తీసుకెళతారు. తరువాత శ్రీనివాస్, శ్రీలత తమ కుమారుడితో కలిసి ఒక ట్రిప్ కోసం ఇంటి నుండి బయలుదేరుతున్నట్లు చూపిస్తారు.

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకుడు. వై. వి. ఎస్. చౌదరి
  • సంగీతం - రమణ గోగుల

సమీక్షలు[మార్చు]

ఐడిల్‌బ్రేన్ ఈ చిత్రాన్ని 3/5 రేటింగు ఇచ్చింది. [1] ఫుల్‌హైడ్ 7/10 ఇచ్చింది. [2] సినిమా సినిమా యావరేజ్ అని పేర్కొంది. [3]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Telugu Cinema – Review – Yuvaraju – Mahesh Babu, Simran, Sakshi Sivanand – YVS Chowdary. Idlebrain.com (2000-04-14). Retrieved on 2015-07-24.
  2. Yuvaraju review: Yuvaraju (Telugu) Movie Review – fullhyd.com. Movies.fullhyderabad.com. Retrieved on 2015-07-24.
  3. [1] Archived 6 జూన్ 2014 at the Wayback Machine