యువ తెలంగాణ పార్టీ
Jump to navigation
Jump to search
యువ తెలంగాణ పార్టీ | |
---|---|
స్థాపకులు | జిట్టా బాలకృష్ణా రెడ్డి |
స్థాపన తేదీ | 5 సెప్టెంబరు 2018 |
ప్రధాన కార్యాలయం | హైదరాబాద్, తెలంగాణ 500034 |
యువ తెలంగాణ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 2018లో ఏర్పడిన ప్రాంతీయ పార్టీ. జిట్టా బాలకృష్ణా రెడ్డి ఈ పార్టీని 2018 సెప్టెంబరు 05న ఏర్పాటు చేశాడు.[1]
ఎన్నికల్లో పోటీ
[మార్చు]- యువ తెలంగాణ పార్టీ 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. యువతెలంగాణ పార్టీ తరపున 2018లో భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి జిట్టా బాలకృష్ణా రెడ్డి పోటీ చేసి మూడుస్థానంలో నిలిచాడు.[2]
- 2019 మార్చిలో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ - మెదక్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి యువతెలంగాణ పార్టీ తరపున రాణి రుద్రమ రెడ్డి పోటీ చేసి ఓడిపోయింది.[3][4][5]
- 2021 మార్చిలో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి యువతెలంగాణ పార్టీ తరపున రాణి రుద్రమ రెడ్డి పోటీ చేసి ఓడిపోయింది.[6][7]
బీజేపీలో విలీనం
[మార్చు]యువ తెలంగాణ పార్టీని న్యూ ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తవ్డే, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో 2022 ఫిబ్రవరి 16న విలీనం చేశారు.[8][9]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (6 September 2018). "'యువ తెలంగాణ' ఆవిర్భావం". Archived from the original on 23 February 2022. Retrieved 23 February 2022.
- ↑ Sakshi (9 November 2018). "బీజేపీతో యువ తెలంగాణ పార్టీ పొత్తు". Archived from the original on 23 February 2022. Retrieved 23 February 2022.
- ↑ Suryaa (7 March 2019). "ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రుద్రమదేవి". Archived from the original on 23 February 2022. Retrieved 23 February 2022.
- ↑ Sakshi (18 March 2019). "కొట్లాడే ధైర్యం, నిబద్ధత ఉన్నాయి : రాణి రుద్రమ". Archived from the original on 23 February 2022. Retrieved 23 February 2022.
- ↑ HMTV (6 March 2019). "ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రాణి రుద్రమదేవి". Archived from the original on 23 February 2022. Retrieved 23 February 2022.
- ↑ The Hans India (10 March 2021). "Women should be given chance in Council: Rani Rudrama" (in ఇంగ్లీష్). Archived from the original on 23 February 2022. Retrieved 23 February 2022.
- ↑ The Hindu (14 March 2021). "Battle among 71 candidates in Warangal-Khammam-Nalgonda Graduates constituency" (in Indian English). Archived from the original on 23 February 2022. Retrieved 23 February 2022.
- ↑ Andhra Jyothy (16 February 2022). "బీజేపీలో యువ తెలంగాణ పార్టీ విలీనం". Archived from the original on 23 February 2022. Retrieved 23 February 2022.
- ↑ V6 Velugu (16 February 2022). "యువ తెలంగాణ పార్టీ బీజేపీలో విలీనం" (in ఇంగ్లీష్). Archived from the original on 23 February 2022. Retrieved 23 February 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)