యు.రాజేష్ నాయక్
యు.రాజేష్ నాయక్ | |||
![]()
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2018 మే 11 | |||
ముందు | బి. రామనాథ్ రాయ్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | బంట్వాల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఉలిపాడి గుత్తు, దక్షిణ కన్నడ, కర్ణాటక, భారతదేశం | 1958 జూలై 11||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
ఉలిపాడి రాజేష్ నాయక్ (జననం 1985) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2018, 2023 శాసనసభ ఎన్నికలలో బంట్వాల్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]యు.రాజేష్ నాయక్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2013 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో బంట్వాల్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్సీ అభ్యర్థి బి. రామనాథ్ రాయ్ చేతిలో 17850 ఓట్ల తేడాతో ఓడిపోయాడు, ఆయన 2018 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్సీ అభ్యర్థి బి. రామనాథ్ రాయ్ పై 15971 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
యు.రాజేష్ నాయక్ 2023 శాసనసభ ఎన్నికలలో బంట్వాల్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్సీ అభ్యర్థి బి. రామనాథ్ రాయ్ పై 8,282 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ India Today (13 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 27 September 2023. Retrieved 17 November 2024.
- ↑ "Karnataka Assembly Elections 2023: Bantval". Election Commission of India. 13 May 2023. Archived from the original on 9 April 2025. Retrieved 9 April 2025.