యూసుఫ్ అలీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సయ్యద్ యూసుఫ్ అలీ

మాజీ ఎమ్మెల్యే & విప్‌
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1999 నుండి 2004
నియోజకవర్గం కామారెడ్డి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1955
కామారెడ్డి జిల్లా, తెలంగాణ, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి

సయ్యద్ యూసుఫ్ అలీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1999 నుండి 2004 వరకు కామారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

యూసుఫ్‌ అలీ 1955లో తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లాలో జన్మించాడు. ఆయన బాన్స్‌వాడలోని ప్రభుత్వ పాఠశాలలో 1970లో పదవ తరగతి పూర్తి చేసి, 1972లో కామారెడ్డిలోని ఆర్ట్స్ & సైన్స్ కళాశాల నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేసి, బి.కామ్ మద్యంలోనే ఆపేసాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

యూసుఫ్ అలీ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి ముహమ్మద్ అలీ షబ్బీర్ పై 12978 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన టీడీపీ ప్రభుత్వంలో వక్ఫ్‌బోర్డు రాష్ట్ర చైర్మన్‌గా పని చేశాడు. యూసుఫ్ అలీ 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి ముహమ్మద్ అలీ షబ్బీర్ పై 3,771 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై, టీడీపీ ప్రభుత్వంలో విప్‌గా పని చేశాడు.[2]

కామారెడ్డి స్థానం 2004లో పొత్తులో భాగంగా బీజేపీకి దక్కింది. ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[3] యూసుఫ్ అలీ 20 నవంబర్ 2018లో టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (3 November 2018). "నిజామాబాద్‌ నియోజకవర్గా ఎన్నికల రివ్యూ". Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.
  2. Eenadu (26 October 2023). "ఎంపీపీల నుంచి ఎమ్మెల్యేలుగా." Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.
  3. IndiaVotes (2009). "IndiaVotes AC Summary: Zahirabad 2009". Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.
  4. The Hans India (20 November 2018). "Former Kamareddy MLA Syed Yousuf Ali joins Congress" (in ఇంగ్లీష్). Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.