యూసుఫ్ ఖాన్
వ్యక్తిగత సమాచారం | |||
---|---|---|---|
పూర్తిపేరు | మహ్మద్ యూసుఫ్ ఖాన్ | ||
జనన తేదీ | 1937 ఆగస్టు 5 | ||
జనన ప్రదేశం | హైదరాబాదు, తెలంగాణ | ||
మరణ తేదీ | 2006 జూలై 1 | (వయసు: 68)||
మరణ ప్రదేశం | హైదరాబాదు, తెలంగాణ | ||
ఆడే స్థానం | మిడ్ ఫీల్డర్ | ||
సీనియర్ కెరీర్* | |||
సంవత్సరాలు | జట్టు | Apps† | (Gls)† |
హైదరాబాదు సిటీ పోలీస్ ఫుట్‌బాల్ క్లబ్ | |||
జాతీయ జట్టు | |||
భారత జాతీయ ఫుట్‌బాల్ టీం | |||
|
యూసుఫ్ ఖాన్ ( 1937 ఆగస్టు 5 – 2006 జూలై 1) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారుడు. 1960లో రోమ్ నగరంలో జరిగిన వేసవి ఒలింపిక్స్‌లో భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.[1] బీయర్డ్ హర్స్ ఆఫ్ ఇండియాగా పిలువబడ్డాడు.[2]
జననం
[మార్చు]యూసుఫ్ ఖాన్ 1937, ఆగస్టు 5న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు.[3]
క్రీడారంగం
[మార్చు]1965 ఆసియా ఆల్ స్టార్స్ XIలో చేర్చబడిన ఇద్దరు భారతీయులలో యూసుఫ్ ఖాన్ ఒకడు.[4] 1962 ఆసియా క్రీడలను గెలిచిన జట్టులో సభ్యుడిగా కూడా ఉన్నాడు.[5] అతని కెరీర్‌లో తలకు మూడుసార్లు గాయాలైనా కూడా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు, జట్టు గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 1966లో అర్జున అవార్డును కూడా అందుకున్నాడు.[6]
కుటుంబ వివరాలు
[మార్చు]ఖాన్ కు భార్య, ఒక కుమారుడు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. పోలీస్ డిపార్ట్‌మెంట్, కేంద్ర ప్రభుత్వం నుండి పదవీ విరమణ తర్వాత ఖాన్ కు రూ.5500 పెన్షన్ వచ్చింది.
మరణం
[మార్చు]తల గాయాల తర్వాత ఆటను కొనసాగించడంతో పార్కిన్సన్స్ వ్యాధికి గురయ్యాడు. యూసుఫ్ ఖాన్ 2006, జూలై 1న గుండెపోటుతో హైదరాబాదులో మరణించాడు.[7]
మూలాలు
[మార్చు]- ↑ "MOHD. YOUSUF KHAN". www.thehinduimages.com. Archived from the original on 2020-12-04. Retrieved 2021-10-31.
- ↑ Network, KreedOn; Network, KreedOn (2017-02-15). "Yousuf Khan – The Forgotten Indian Football Master lost in history". Voice of Indian Sports - KreedOn (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 2021-10-31. Retrieved 2021-10-31.
- ↑ Shetty, Ashish. "Mohammed Yousuf Khan - A forgotten hero". www.sportskeeda.com (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2016-03-03. Retrieved 2021-10-31.
- ↑ "Mohammed Yousuf Khan - A forgotten hero". sportskeeda.com. 23 May 2014. Archived from the original on 16 October 2014. Retrieved 14 October 2014.
- ↑ "The plight of Mohd. Yousuf Khan". The Hindu. 14 July 2003. Archived from the original on 16 October 2014. Retrieved 14 October 2014.
- ↑ "Indian Muslim Legends: 281. Yousuf Khan (soccer player)". Indian Muslim Legends. Retrieved 2021-10-31.
- ↑ Shetty, Ashish. "Mohammed Yousuf Khan - A forgotten hero". www.sportskeeda.com (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2015-10-05. Retrieved 2021-10-31.