యెర్నేని సుబ్రహ్మణ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యెర్నేని సుబ్రహ్మణ్యం (1898 - 1974) భారత స్వతంత్ర సమరయోధుడు. గాంధేయవాధి. ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా లోని కొమరవోలు ఈయన స్వస్థలం. ఈ గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. ఇదే గ్రామంలో గాంధీ ఆశ్రమం నెలకొల్పాడు. కులమతాల పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవాడు. అతను నెలకొల్పిన గాంధీ ఆశ్రమంలో పొట్టి శ్రీరాములు కూడా 1939లో చేరాడు.[1] దండి సత్యాగ్రహంలో పాల్గొన్న తెలుగువాడు. గాంధీతో కలిసి నడిచిన తెలుగు వ్యక్తిగా గుర్తింపు పొందాడు. తర్వాత కాలంలో ఆయన గాంధీ సిద్ధాంతాలతో కొమరవోలులో ఒక ఆశ్రమాన్ని స్థాపించారు.[2] అతను ‘దరిద్ర నారాయణ’ అనే పత్రిక నడిపేవారు. ఆ పత్రికలో పొట్టి శ్రీరాములు గాంధీ సిద్ధాంతంపై రచనలు చేసేవాడు. [3]

మూలాలు[మార్చు]

  1. ivr. "మన కోసం పొట్టి శ్రీరాములు..." telugu.webdunia.com. Retrieved 2020-07-04.
  2. కాసం, ప్రవీణ్ (2018-03-12). "దండి మార్చ్: గాంధీతో కలిసి నడిచిన తెలుగు వ్యక్తి ఎవరు?". BBC News తెలుగు. Retrieved 2020-07-04.
  3. m.andhrajyothy.com https://m.andhrajyothy.com/telugunews/abnarchievestoryv-218203. Retrieved 2020-07-04. Missing or empty |title= (help)