యోగర్ట్ (పెరుగు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టర్కిష్ యోఘుర్ట్
Yoghurt, full fat
Nutritional value per 100 g (3.5 oz)
శక్తి257 kJ (61 kcal)
4.7 g
చక్కెరలు4.7 g (*)
3.3 g
సంతృప్త క్రొవ్వు2.1 g
మోనోశాచురేటెడ్ కొవ్వు0.9 g
3.5 g
విటమిన్లు Quantity %DV
రైబోఫ్లావిన్ (B2)
12%
0.14 mg
ఖనిజములు Quantity %DV
కాల్షియం
12%
121 mg

(*) Lactose content diminishes during storage.
Percentages are roughly approximated using US recommendations for adults.
Source: USDA Nutrient Database
కాసిక్, పెరుగుతో చేసిన తీపి అపిటైజేర్

యోఘర్ట్ లేదా యోగర్ట్ పాలతో తయారుచేసే ఒక పాల పదార్ధము. లాక్టోస్ యొక్క కిణ్వప్రక్రియ లాక్టిక్ ఆమ్లాన్ని తయారు చేస్తుంది, ఇది పాల ప్రోటీన్‌పై పనిచేసి పెరుగుకు దాని రూపమును మరియు స్వాభావిక రుచిని ఇస్తుంది.పాలపదార్ధానికి ప్రత్యామ్నాయమైన సోయా-పెరుగు, సోయా పాల నుండి తయారవుతుంది.

4,500 సంవత్సరాల నుండి ప్రజలు పెరుగును-తయారుచేసి-తింటున్నారు.నేడు ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక సాధారణ ఆహారపదార్ధం.ఇది ప్రత్యేక ఆరోగ్యప్రయోజనాలున్న ఒక పోషకాహారం.ఇది ప్రోటీన్, కాల్షియం, రిబోఫ్లావిన్, విటమిన్ B6 మరియు విటమిన్ B12 వంటి పోషకాలను కలిగి ఉంది.

శబ్ద ఉత్పత్తి మరియు అక్షరక్రమము[మార్చు]

ఈ పదం టర్కిష్ పదమైన యోగర్ట్ నుండి వచ్చింది,[1] మరియు యోగర్మక్ 'పిసికి కలుపు' మరియు యోగన్ "దట్టమైన" లేదా "చిక్కని"కి సంబంధించినది.[2]. ğ అనే అక్షరం సాంప్రదాయకంగా "gh" అని టర్కిష్ భాషను మరోభాషలో వ్రాసినపుడు వ్రాయబడుతుంది, ఇది అరబిక్ అక్షరం యొక్క రూపాంతరంగా 1928లో లాటిన్ అక్షరం కనుగొనబడేవరకు వ్రాయబడింది. పాత టర్కిష్ భాషలో ఈ పదం ఊష్మ తాలవ్య ధ్వనిని /ɣ/సూచిస్తుంది, కానీ ఈ ధ్వని ఆధునికటర్కిష్లో పదం యొక్క ఉచ్చారణలో చివరి హల్లుల మధ్య వదిలివేయబడిందిమూస:IPA-tr. కొన్ని తూర్పు మాండలికాలుహల్లుని అదే స్థానంలో ఉంచాయి, మరియు బాల్కన్లోనున్న టర్కు దేశీయులు ఈ పదాన్ని కష్టంతో ఉచ్చరిస్తారు/ɡ/.

బల్గేరియాలో పెరుగు "кисело мляко" (కిసేలో మ్లయాకో)గా పిలువబడుతుంది, దీని అర్ధం "పుల్లటి పాలు".

ఆంగ్లభాషలో, ఈ పదం యొక్క అక్షర క్రమంలో అనేక వైవిధ్యతలు ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ లో, "yogurt'" అనేది సాధారణ అక్షరక్రమం మరియు "yoghurt" స్వల్పమార్పు కలిగినది. యునైటెడ్ కింగ్డంలో "yoghurt" మరియు "yogurt" రెండు పదాలూ వాడుతున్నారు, "yoghurt" సాధారణమైనది, మరియు "yoghourt" దాని అసాధారణ ప్రత్యామ్నాయం.[3] రెండు అధికారిక భాషలలో సరిపోవడం వలన కెనడియన్ బ్రాండ్లు "yogourt" అనే మాటను వాడుతున్నాయి, ఏదేమైనా, "yogurt" అనే పదం ఎక్కువగా వాడబడేది మరియు ఆంగ్ల భాష మాట్లాడేవారు సాధారణంగా వాడేది; ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్‌లలో "yoghurt" అనే పదం సాధారణం.[4][5]

అక్షరక్రమం ఏదైనా, UK లో ఈ పదం హ్రస్వ oతో (/ˈjɒɡərt/), దీర్ఘ oతో (/ˈjoʊɡərt/) ఉత్తర అమెరికా, ఐర్లాండ్, ఆస్ట్రేలియా మరియు దక్షిణ ఆఫ్రికాలలో, హ్రస్వ లేదా దీర్ఘ oతో న్యూజిలాండ్‌లో ఉచ్చరింపబడుతోంది.

చరిత్ర[మార్చు]

గత 4,500 సంవత్సరాలుగా రసాయనిక మార్పు చెందించిన పాలఉత్పత్తులను ఆహారంగా ఉపయోగిస్తున్నట్లు ఆధారం ఉంది.ప్రారంభంలో పెరుగు బహుశా లాక్టోబాసిల్లస్ దెల్బ్రుక్కీ subsp. బల్గారికాస్ అనే అదుపులేని బాక్టీరియా వెంటనే కిణ్వప్రక్రియ చెందటం ద్వారా తయారయేది.[ఉల్లేఖన అవసరం]

మధ్యయుగపు టర్క్‌ల ద్వారా పెరుగు వాడబడినట్లు పదకొండో శతాబ్దంలో మహ్మూద్ కష్గారి రచించిన దివాన్ లుఘాట్ అల్-టర్క్ మరియు యూసఫ్ హస్ హజిబ్ రచించిన కుతద్గు బిలిగ్ లలో నమోదు చేయబడింది.[6][7] రెండు గ్రంథాలలో "పెరుగు" అనే పదం విభిన్న విభాగాలలో చెప్పబడింది మరియు సంచారటర్క్ లచే దాని వినియోగం వివరించబడింది.[6][7] పెరుగుతో యురోపియన్ల తొలిపరిచయం ఫ్రెంచ్ రోగ చరిత్రలో ఉంది: ఫ్రాన్సిస్ I తీవ్ర విరేచనాలతో బాధపడుతున్నపుడు ఏ ఫ్రెంచ్ వైద్యుడూ నయం చేయలేక పోయాడు. ఆయన స్నేహితుడు సులేమన్ ది మగ్నిఫిసెంట్ ఒక వైద్యుడిని పంపగా, ఆయన రోగికి పెరుగుతో నయం చేసాడని చెప్పబడింది.[8][9] కృతజ్ఞతతో ఫ్రెంచ్ రాజు, తనకు నయంచేసిన ఆహారంయొక్క సమాచారాన్ని వ్యాపింపచేసారు.

పెరుగునుండి చేసిన చల్లనిపానీయం టరటర్ బాల్కన్లలో ప్రసిద్ధి చెందింది.

1900ల వరకు, పెరుగు దక్షిణ ఆసియా, మధ్య ఆసియా, పశ్చిమ ఆసియా, ఆగ్నేయ ఐరోపా మరియు మధ్య యూరోప్ ప్రాంతాల ఆహారంలో ముఖ్యంగా ఉంది.అసాధారణంగా పెరిగిన బల్గేరియన్ కర్షకుల ఆయుప్రమాణానికి కారణం వారు క్రమం తప్పకుండా పెరుగును వినియోగించడమేనని పారిస్ లోని ఇన్స్టిటూట్ పాశ్చర్‌కు చెందిన రష్యన్ జీవశాస్త్రవేత్త ఇల్ల్య ఇల్ల్య్చ్ మేచ్నికోవ్యొక్క నిరూపింపబడని సిద్ధాంతం. మంచి ఆరోగ్యానికి లాక్టోబాసిల్లస్ అవసరమని నమ్మి, మేచ్నికోవ్ పెరుగు ఐరోపా అంతటా ఆహారపదార్ధంగా ప్రజాదరణ పొందడానికి కృషిచేసారు.

బల్గేరియాకి చెందిన వైద్యశాస్త్ర విద్యార్థి జేనేవ స్టేమెన్ గ్రిగోరోవ్ (1878–1945) మొట్టమొదట బల్గేరియన్ పెరుగు యొక్క మైక్రోఫ్లోరాను పరీక్షించారు. 1905లో అది ఒక గోళాకార మరియు ఒక చువ్వ-వంటి లాక్టిక్ ఆమ్ల బాక్టీరియాను కలిగి ఉన్నదని ఆయన వివరించారు. 1907 లో చువ్వ వంటి బాక్టీరియా లాక్టోబాసిల్లస్ బల్గారికాస్ అనేపేరుతో (ఇప్పుడు లాక్టోబాసిల్లస్ దెల్బ్రుకీ subsp. బల్గారికాస్ )గా పిలువబడుతోంది.

ఇసాక్ కారస్సో అనే పేరుగల ఒక సేఫర్దిక్ యూదు పారిశ్రామిక వేత్త పెరుగును పారిశ్రామికంగా ఉత్పత్తిచేసాడు. 1919 లో, సలోనికకి చెందిన కారస్సో, బార్సిలోనాలో తన చిన్న కుమారుని పేరు మీద చిన్న పెరుగు వ్యాపారాన్ని డానన్ ("లిటిల్ డానిఎల్") ప్రారంభించారు. ఇదే బ్రాండ్ తరువాత యునైటెడ్ స్టేట్స్ కు అమెరికన్ పేరువలె ధ్వనించే డన్నొన్ అనే పేరుతొ ఎగుమతిచేయబడింది.

ప్రేగ్లోని రాడ్లిక మ్లేకర్న డైరీలో జామ్ తో కలిపిన పెరుగు 1933లో పేటెంట్ చేయబడింది.[10] అది యునైటెడ్ స్టేట్స్ లో 1947 లో డన్నొన్ చే ప్రవేశపెట్టబడింది.

యునైటెడ్ స్టేట్స్ లో పెరుగు మొదటిసారిగా ఆర్మేనియా వలసదారులైన సర్కిస్ మరియు రోజ్ కలోమ్బోసియన్లచే ప్రవేశపెట్టబడింది, వారు 1929లో మసాచుసెట్స్ లోని అన్దోవేర్ లో "కలోమ్బో అండ్ సన్స్ క్రీమరీ"ని ప్రారంభించారు.[11][12][13]. కలోమ్బో పెరుగు న్యూ ఇంగ్లాండ్ ప్రాంతంలో గుర్రపు-బగ్గీ ద్వారా అందించబడేది, దానిపై దానిపై అర్మేనియన్ పదం "మద్జూన్" అని వ్రాయబడి ఉండేది, తరువాత అది టర్కిష్ పదమైన "యోగర్ట్"గా మారింది, ఎందుకంటే టర్కిష్ ఆ సమయంలో ప్రధాన వినియోగదారులుగా ఉన్న అనేక సమీప ప్రాచ్య దేశాల వలసదారులకు అది ఆమోద యోగ్య పరాయిభాష . యునైటెడ్ స్టేట్స్ లో పెరుగుకు ప్రజాదరణ 1950లు మరియు 1960లలో అది ఒక ఆరోగ్య కరమైన ఆహారంఅని పేర్కొన్నపుడు పెరిగింది. 20 వ శతాబ్దం చివరికి, పెరుగు అమెరికన్ల సామాన్య ఆహారపదార్ధంగా మారింది మరియు కలోమ్బో యోగర్ట్ 1993లో జనరల్ మిల్స్ కు అమ్మబడింది.

భారతదేశంలో, యోగర్ట్ సాధారణంగా "కర్డ్ " అనే పేరుతో అమ్మబడుతోంది, లేదా ఇంకా సాధారణంగా స్థానిక నామాలైన "దహి"అని (హిందీలో), పెరుగు అని (తెలుగులో), తైర్ అని (తమిళ్లో), మొసరు (కన్నడలో)అంటారు. పాశ్చాత్యదేశాలతో పరిచయం ఉన్నవారు తప్ప, "యోగర్ట్" అనేది భారతదేశంలో సామాన్యులు వినని పదం. హిందూ ఆచార కర్మలలో తరచూ ఉపయోగించే ఐదు అమృతాలలో (పంచామృత) పెరుగు ఒకటి. భారతదేశంలోని చాలా ప్రాంతాలలో, భోజనం సాధారణంగా పెరుగుతో ముగుస్తుంది.పురాతనకాలం నుండి, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుందని మరియు ఆమ్లప్రభావం తగ్గిస్తుందని నమ్మబడింది.చాలామంది గృహస్తులు వారి "పెరుగు"ను ఇంట్లోనే తయారుచేసుకుంటారు.క్రింద భారతదేశంలో మరియు మిగిలిన ప్రాంతాలలో ప్రజాదరణ పొందిన పెరుగులోని రకాలను చూడవచ్చు.

"కర్డ్ " మరియు యోగర్ట్ భిన్నమైనవి. http://in.answers.yahoo.com/question/index?qid=20060821102556AACd5hz

పోషక విలువ మరియు ఆరోగ్య ప్రయోజనాలు[మార్చు]

త్జాత్జికి, గ్రీస్ లో ప్రసిద్ధి చెందిన పేరుకు నుండి తయారు చేయబడే అపిటైజర్

పెరుగులో ప్రోటీన్, కాల్షియం, రిబోఫ్లావిన్, విటమిన్ B6 మరియు విటమిన్ B12 వంటి పోషకాలు ఉన్నాయి.[14] దీనిలో పాలలోకంటే ఎక్కువ పోషక ప్రయోజనాలు ఉన్నాయి. మితంగా లాక్టోస్-సరిపడని వారు ఎటువంటి చెడు-ప్రభావాలు లేకుండా పెరుగును తినవచ్చు, ఎందుకంటే పాలలో రాబోయే లాక్టోస్ బాక్టీరియా ఉత్పన్నత వలన లాక్టిక్ ఆమ్లంగా మారుతుంది.లాక్టోస్ తరుగుదల, ప్రభావిత వ్యక్తులు పాలలోని చక్కర చర్యను తమంతట తాము చేసుకొనే అవసరాన్ని తప్పిస్తుంది.[15]

పెరుగుకు వైద్యపరమైన ఉపయోగాలు కూడా ఉన్నాయి, ప్రత్యేకించి విభిన్న జీర్ణకోశ వ్యాధులలో [16] మరియు యాంటీబయాటిక్-సంబంధిత విరేచానాలను నిరోధించడంలో ఉపయోగపడుతుంది.[17] ఆధారాలు పూర్తిగా లేనప్పటికీ, L. అసిడో ఫైలస్ కలిగిన పెరుగు తినడం వుల్వో వజైనల్కాండిడయాసిస్ను నిరోధించడంలో సహాయ పడుతుందని ఒకఅధ్యయనం సూచిస్తోంది.[18]

బహూశా పెరుగులో ఉన్న లాక్టిక్ ఆమ్లాలలోని ప్రోబైయటిక్ ప్రభావం వలన, పెరుగు చిగుళ్ళ ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుందని నమ్మకం ఉంది.[19]

ఇంటర్నేషనల్ జర్నల్ అఫ్ ఒబేసిటీ (2005 జనవరి 11) లో ప్రచురించిన ఒక అధ్యయనం, తక్కువ కొవ్వుఉన్న పెరుగు వినియోగం బరువుతగ్గడానికి తోడ్పడుతుందని కనుగొంది.ఈ ప్రయత్నంలో, తక్కువ కాలరీలు ఉన్న ఆహారంలో భాగంగా రోజుకు 3 సార్లు తక్కువ కొవ్వు పెరుగును తిన్న స్థూల కాయులు, కేవలం కాలరీలు తగ్గించుకొని అదనపు కాల్షియం తీసుకోని వారితో పోల్చినపుడు 22% బరువు అదనంగా తగ్గారు.వీరు ఉదరకొవ్వును కూడా 81% అదనంగా తగ్గించుకున్నారు.[20]

రకములు మరియు సమర్పణ[మార్చు]

దాని సహజమైన పులుపును తగ్గించుకోవడానికి, పెరుగు తీయగా, సువాసనతో లేదా అడుగున పండు లేదా పండ్ల జామ్ తో అమ్మబడుతుంది.[21] కొనడానికి ముందే పండు పెరుగుతో బాగా కలుపబడి ఉంటె దానిని సాధారణంగా స్విస్-స్టైల్ అని సూచిస్తారు.[22] తక్కువ ఖర్చుతో పెరుగుకు కృత్రిమ చిక్కదనాన్ని మరియు మీగడను సృష్టించేందుకు యునైటెడ్ స్టేట్స్ లో[ఉల్లేఖన అవసరం] పెక్టిన్ లేదా జెలటిన్ ఎక్కువగా వాడతారు.స్విట్జర్లాండ్ లో పెరుగు తినే పద్ధతికి దీనితో సంబంధం లేకపోయినా, ఈ విధమైన కల్తీ ఉత్పత్తులు స్విస్-స్టైల్ పేరుతో అమ్మబడుతున్నాయి.తరచూ "క్రీం లైన్"గా పిలువబడే కొన్ని ప్రత్యేక మైన పెరుగులు, పైన కిణ్వప్రక్రియ కొవ్వును కలిగి ఉంటాయి.పండ్ల పెరుగు కొన్ని వారాలపాటు నిల్వఉండేందుకు పండ్లముక్కలకు బదులుగా పండ్లజామ్ వాడబడుతుంది.[ఉల్లేఖన అవసరం]

వ్యాపారపరంగా పెద్దమొత్తాలలో చేసే పెరుగులో తియ్యదనానికి చెరకు పంచదార ఉంటుంది.

బుకిట్టింగ్గి మార్కెట్లో అమ్ముతున్న పెరుగు

దదియ, లేద దదిహ్, సాంప్రదాయకంగా పశ్చిమ సుమత్రాలో నీటి గేదె పాల నుండి తయారైన పెరుగు . దీనిని వెదురుబొంగులలో తోడు పెడతారు.

పెరుగుకు నేపాల్‌లో చాలా ప్రజాదరణ ఉంది, అది ఇక్కడ భోజనానికి ముందు మరియు తరువాత కూడా వడ్డించబడుతుంది.నేపాలి సంస్కృతిలో భాగమై స్థానికంగా దహి (दही) అని పిలువబడే దీనిని, స్థానిక పండుగలు, వివాహ కార్యక్రమాలు, పార్టీలు, మత కార్యక్రమాలు, కుటుంబ కలయికలో వాడతారు.బాగా ప్రసిద్ధి చెందిన నేపాలీస్ పెరుగును జుజు దహు అంటారు, ఇది భక్తపుర్ నగరంలో తయారవుతుంది..

పెరుగు నుండి తయారయ్యే టారటర్ మరియు కసిక్ అనే చల్లని సూప్, అల్బేనియా, బల్గేరియా, రిపబ్లిక్ అఫ్ మాసడోనియా, మరియు టర్కీలలో వేసవిపానీయంగా ప్రసిద్ధిచెందింది. వీటిని అయ్రాన్, ఖీర దోసకాయలు, శతపుష్పం, ఉప్పు, ఆలివ్ నూనె, మరియు ఇష్టానుసారం వెల్లుల్లి మరియు అక్రోట్లను ఉపయోగించి తయారుచేస్తారు.

జర్మనీలో లభించే రహంజోఘుర్ట్, ఎక్కువ మీగడను కలిగి ఇతర ఆంగ్ల భాష మాట్లాడే దేశాలలో లభించే పెరుగుల కంటే (10%) ఎక్కువ పాల కొవ్వును కలిగి ఉంటుంది (రహం అనగా జర్మన్లో మీగడ అని అర్ధం).

రసాయనికంగా మార్పుచెందని పాలతో పైన మీగడ ఉండే పెరుగును తయారుచేస్తారు.ఒక మీగడపొర పైకి వచ్చి, పెరుగు పుల్లగా లేకుండా రూపంలో మరియు రుచిలో నాణ్యంగా ఉండేటట్లు చేస్తుంది.న్యూ ఫీల్డ్, న్యూయార్క్ కు చెందిన బ్రౌన్ కౌవారు మొదటిసారి వ్యాపారపరంగా ప్రజాదరణ పొందిన మీగడ పైన ఉండే పెరుగు తయారుచేసి, తక్కువ- మరియు కొవ్వు -లేని పెరుగు వైపు ధోరణిని మార్చారు.

1986లో జార్జియా ప్రాంతంలోనికాకసస్ నుండి తిరిగివచ్చిన పరిశోధకుల ద్వారా కాస్పియన్ సముద్ర పెరుగు జపాన్‌లో ప్రవేశపెట్టబడిందని భావిస్తున్నారు.[23] మట్సోనిగా పిలువబడే ఈరకం, లాక్టోకొకుస్ లక్టిస్ subsp. క్రేమోరిస్ మరియు అసిటోబాక్టర్ ఒరిఎంటలిస్ జాతి నుండి ప్రారంభమైంది మరియు ప్రత్యేకమైన, జిగట, తేనె-వంటి రూపం కలిగి ఉంటుంది.[24] ఇతర పెరుగుల కంటే దీనికి వగరు తక్కువ. ఎటువంటి ప్రత్యేకమైన ఉపకరణాలు లేదా రసాయనాలు అవసరంలేని కాస్పియన్ సముద్ర పెరుగు ఇంట్లో చేసుకోవడానికి వీలుగా ఉంటుంది.సాదారణ గది ఉష్ణోగ్రతలో దీనిని (20–30 °C) 10 నుండి 15 గంటలలో తయారు చేయవచ్చు.[25] జపాన్‌లో, ఘనీభవించి-పొడిగా చేసిన తోడు పెరుగును డిపార్టుమెంటు స్టోర్లలో మరియు ఆన్ లైన్లో అమ్ముతారు, అయితే చాలామంది తోడుపెరుగు స్నేహితుల నుండి తీసుకుంటారు.[ఉల్లేఖన అవసరం]

జమీద్ అనే పెరుగు నిల్వచేసుకోవడానికి వీలుగా ఉప్పు వేస్తారు.ఇది జోర్డాన్‌లో ప్రజాదరణ పొందింది.

జాబది అనే పెరుగును ఈజిప్టులో తయారు చేస్తారు. రంజాన్ ఉపవాసాలలో రోజంతా ఉపవాసమున్నపుడు దప్పిక లేకుండా ఉంచుతుందని ఇది ప్రసిద్ధి చెందింది.[26]

దక్షిణ ఆసియా/ లోని భారతదేశంలో పెరుగుతో చేసే సంబారమైన రైతా, సహాయ ఆహారంగా ఉపయోగపడుతుంది. పెరుగులో కొత్తిమీర (ధనియా), జీలకర్ర, పుదీనా, కారపు పొడి, మరియు ఇతర మూలికలు మరియు మసాలాలను రుచికోసం ఉపయోగిస్తారు. దోసకాయ మరియు ఉల్లిపాయ వంటి కూరగాయలను కలుపుతారు.ఈ మిశ్రమాన్ని చల్లగా వడ్డిస్తారు.రైతా అంగిటిపై చల్లని ప్రభావాన్ని కలిగించి దక్షిణ భారతదేశ మసాలా వంటలకు విరుగుడుగా పనిచేస్తుంది.

దహి, లేదా పెరుగు, భారత ఉపఖండ యోగర్ట్, దాని స్వాభావిక రుచికి మరియు చిక్కదనానికి ప్రసిద్ధిచెందింది. దహి అనే పదం, సంస్కృత పదమైన దధి నుండి గ్రహింపబడింది. దధి సంజీవిని వలె (పంచామృతాల) ఉండి తరచూ హిందూ ఆచార కార్యక్రమాలలో వాడబడుతుంది. ఇది వేర్వేరు రుచులలో లభిస్తుంది, వీటిలో రెండు ప్రసిద్ధిచెందినవి: 1) పుల్ల పెరుగు - తౌక్ దోయి, మరియు 2) తీపి perugu- మీస్తి లేదా పోడి దోయి. భారతదేశంలో తరచుగా దీనిని పసుపు మరియు తేనెలతో కలిపి సౌందర్య సాధనంగా వాడతారు.పుల్ల పెరుగును खट्टी दही) భారతదేశంలోని అనేక ప్రాంతాలలో స్త్రీలు జుట్టుకు మిశ్రమంగా ఉపయోగిస్తారు.దహీని తయిరు (మలయాళం), డోయి (అస్సామీస్, బెంగాలీ), దోహి (ఒరియా), పెరుగు (తెలుగు), మొసరు (కన్నడ)అని పిలుస్తారు, మరియు తయిర్ (తమిళ్), కజాన ఎ పనీర్ (పష్తో).

భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీకండ్ వడకట్టిన పెరుగులో యాలకులు లేదా జాజికాయ మరియు కొన్నిసార్లు మామిడి మరియు అనాసపండ్లను కలిపి తయారుచేస్తారు.

వడకట్టిన పెరుగు మరియు పెరుగు జున్ను[మార్చు]

వడగట్టిన పెరుగు అంటే పెరుగులో రకాలను పెరుగును ఒక వస్త్రం లేదా కాగితంతో వడపోయటం ద్వారా చేస్తారు, సాంప్రదాయకంగా దీనిని సన్నని బట్ట,ద్వారా చేస్తారు, అందువలన పై నీరుతీసివేయచ్చు, తద్వారా చిక్కని మరియు ప్రత్యేకమైన, కొద్దిగా వాసనగల పెరుగు మిగులుతుంది.

పెరుగును వడగట్టగా వచ్చే లబ్నేను అరబ్ దేశాలలో సాండ్విచెస్ తయారు చేయడానికి వాడతారు. ఆలివ్ నూనె, దోసకాయ ముక్కలు, ఆలివ్, మరియు అనేక ఆకుపచ్చ మూలికలు కలుపుతారు.దానిని మరింత చిక్కబరచి మరియు ఉండలుగా చేసి, ఆలివ్ నూనెలో ఉంచడం ద్వారా కిణ్వప్రక్రియలో మరికొన్ని వారాలు భద్రపరచవచ్చు. కబాబ్ (كبة) ఉండలలో కూరడానికి దీనిని ఉల్లిపాయలు, మాంసం, మరియు గింజలను కలిపి కొన్నిసార్లు ఉపయోగిస్తారు.

శంక్లీష్ (చంక్లిచ్ లేదా شنكليش) ఎండబెట్టిన లబ్నే నుండి చేసిన ఒక విధమైన జున్ను, లెబనాన్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో ఆహారపదార్ధంగా వాడబడుతుంది.[27] ఈ లబ్నేకు ఉప్పు చేర్చి, ఎండబెట్టి మరియు ఉండలుగా చేస్తారు.ఇది అనేక రకాలుగా వాడతారు, తాజా వాటిని ఆలివ్ నూనెలో ఉంచి "వయసైన" వాటిపై వామాకు వేసి మసాలాలతో కప్పుతారు.

నీరు ఆవిరి అయ్యేందుకు గాను, కొన్ని రకాలైన పెరుగులను పెద్ద తొట్లలో మరిగిస్తారు.ప్రసిద్ధి చెందిన తూర్పు భారతదేశ వంటకం, ఒక విభిన్న సాంప్రదాయకమైన పెరుగు మిష్టి దహిగా పిలువబడుతుంది, చిక్కనైన ఈ పెరుగు పాశ్చ్యాత్త దేశాల పెరుగుతో పోల్చినపుడు ఎక్కువ తియ్యగా ఉంటుంది.

వడకట్టిన పెరుగు గ్రీస్ లో కూడా వాడబడుతుంది మరియు దీనిని త్జద్జికి తయారులో ముఖ్యంగా వాడతారు, ఇది బాగా ప్రసిద్ధి చెందిన గ్రోస్ మరియు సౌలకి పిత సాండ్విచేస్ తయారీలో వాడబడుతుంది.

పానీయాలు[మార్చు]

అయ్రాన్ లేదా దాల్ అనేది పెరుగుతో చేసిన ఉప్పటి పానీయం, ఇది అల్బేనియా, బల్గేరియా, టర్కీ, అజెర్బైజాన్, ఇరానియన్ అజెర్బైజాన్, రిపబ్లిక్ అఫ్ మాసడోనియా, కజాఖ్స్తాన్ మరియు కిర్గిజ్స్తాన్లలో ప్రసిద్ధి చెందింది. ఇది పెరుగును నీళ్ళతో కలిపి మరియు (కొన్నిసార్లు)ఉప్పు చేర్చడం ద్వారా తయారవుతుంది.ఇదే పానీయాన్ని "డౌ" అని ఇరాన్లో; "తాన్" అని ఆర్మేనియాలో ; "లబన్ అయ్రాన్" అని సిరియా మరియు లెబనాన్లలో; "షేనిన" అని ఇరాక్ మరియు జోర్డాన్లలో; "లబన్ అర్బిల్" అని ఇరాక్‌లో; "మజ్జిగ" (తెలుగు), "మజ్జిగే" (కన్నడ), మరియు "మోరు" (తమిళ్) అని దక్షిణ భారతదేశంలో; మరియు ఆంగ్ల పేరైన "బట్టర్ మిల్క్"గా భారతదేశం అంతటా పిలుస్తారు. అదే రకమైన పానీయం, దూగ్, మధ్య ప్రాచ్యంలో లెబనాన్, ఇరాన్‌ల మధ్య మరియు ఆఫ్ఘనిస్తాన్లలో ప్రసిద్ధి చెందింది; ఇది మూలికలను , సాధారణంగా పుదీనాను కలపడం వలన అయ్రాన్ కంటే భిన్నంగా ఉంటుంది, మరియు కర్బనీకరించబడి సాధారణంగా శుద్ధ జలం(మినరల్ వాటర్)తో తయారవుతుంది.

లస్సి అనేది భారత ఉపఖండ పానీయం ఇది కొంత ఉప్పగా లేదా తియ్యగా ఉంటుంది. లస్సి పంజాబ్‌లో చాల ముఖ్యమైనది; ఉపఖండంలోని కొన్ని ప్రాంతాలలో తీపి లస్సిలో పన్నీరు, మామిడి లేదా ఇతర పండ్ల రసాలను కలిపి విభిన్నమైన ఒక కొత్తపానీయాన్ని తయారుచేస్తారు.ఉప్పటిలస్సిలొ రుచికోసం దంచిన జీలకర్ర మరియు ఎండు మిరపకాయలు వాడతారు; దీని కోసం మజ్జిగను కూడా వాడతారు, మరియు పేరు మార్పుతో ఘోల్ అని (బంగ్లాదేశ్‌లో), మత్తాఅని (ఉత్తర భారత దేశంలో), టక్ అని (మహారాష్ట్రలో), లేదా చాస్ అని (గుజరాత్లో) పిలుస్తారు. పాకిస్తాన్లో కూడా లస్సి ఎక్కువగా తాగుతారు.

కేఫీర్ అనేది కాకసస్ కు చెందిన కిణ్వప్రక్రియా పానీయం. ఇటువంటి మధ్య ఆసియన్ టర్కో-మంగోలియన్ పానీయాన్ని ఆడ గుర్రం యొక్క పాలతో చేస్తారు, దీనిని కుమిస్ అని పిలుస్తారు, మంగోలియాలో ఐరగ్ గా పిలుస్తారు. ఎటువంటి కర్బనీకరణం లేదా పండ్లవాసన లేకుండా కొన్ని అమెరికన్ డైరీలు అనేక సంవత్సరాలు "కేఫీర్"ను అందించాయి.

పండ్లు లేదా కృత్రిమ తీపికారకాలు కలిపిన తియ్యని పెరుగు పానీయాలు, US మరియు UK లలో సర్వసాధారణం. వీటిని "డ్రింకింగ్/ డ్రింకబుల్ యోఘుర్ట్", ఉదాహరణకు యోప్ వంటి పేర్లతో పిలువబడతాయి. ఎక్కువ భాగం పండ్లతో కూడిన "యోఘుర్ట్ స్మూతీస్" కూడా లభిస్తాయి మరియు ఇవి స్మూతీల లాగానే ఉంటాయి.

ఈక్విడార్‌లో, స్థానిక పండ్లతో చేయబడిన స్మూతీస్ పాన్ డి యుకా ఒక సాధారణ ఫాస్ట్ ఫుడ్‌గా వాడబడుతుంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

సూచనలు[మార్చు]

 1. మేర్రియం-వెబ్ స్టర్ ఆన్ లైన్- యోగర్ట్ ఎంట్రీ
 2. ఆహ్మేట్ తొప్రక్'స్ ఆర్టికల్
 3. పీటర్స్, పామ్ (2004). ది కేంబ్రిడ్జి గైడ్ టు ఇంగ్లీష్ యూసేజ్ . కేంబ్రిడ్జి: కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రెస్, pp. 587-588.
 4. "yoghurt n." ది ఆస్ట్రేలియన్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, 2 న్ద్ ఎడిసన్. Ed. బ్రూస్ మూర్. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, 2004. ఆక్స్ఫర్డ్ రెఫెరెన్సు ఆన్ లైన్. యక్సేస్స్ద్ ఆన్ 2007-05-24.
 5. "yoghurt n." ది న్యూజిలాండ్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. టోనీ డెవెర్సొన్. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ 2004. ఆక్స్ఫర్డ్ రెఫెరెన్సు ఆన్ లైన్. యాక్సేస్స్ద్ ఆన్ 2007-05-24.
 6. 6.0 6.1 Toygar, Kamil (1993). Türk Mutfak Kültürü Üzerine Araştırmalar. Türk Halk Kültürünü Araştırma ve Tanıtma Vakfı. p. 29. Retrieved 2009-08-11.
 7. 7.0 7.1 Ögel, Bahaeddin (1978). Türk Kültür Tarihine Giriş: Türklerde Yemek Kültürü. Kültür Bakanlığı Yayınları. p. 35. Retrieved 2009-08-11.
 8. Rosenthal, Sylvia Dworsky (1978). Fresh Food. Bookthrift Co. p. 157. ISBN 978-0876902769. Retrieved 2009-08-11.
 9. Coyle, L. Patrick (1982). The World Encyclopedia of Food. Facts On File Inc. p. 763. ISBN 978-0871964175. Retrieved 2009-08-11.
 10. "První ovocný jogurt se narodil u Vltavy" (మూస:Cs లో). 2002-07-23. Retrieved 2009-04-27. Cite web requires |website= (help)CS1 maint: unrecognized language (link)
 11. "The Massachusetts Historical Society | Object of the Month". Cite web requires |website= (help)
 12. "Colombo Yogurt - First U.S. Yogurt Brand - Celebrates 75 Years; Colombo Takes Yogurt from a Small Kitchen in Andover, Mass., to Kitchens across America. - Free Online Library". Cite web requires |website= (help)
 13. యునైటెడ్ స్టేట్స్ ఫ్రమ్ అల్ బిజినెస్ .కాం">"Colombo Yogurt - First U.S. Yogurt Brand - Celebrates 75 Years; Colombo Takes Yogurt from a Small Kitchen in Andover, Mass., to Kitchens across America. | North America > United States from AllBusiness.com". Cite web requires |website= (help)
 14. యేల్-న్యూ హెవెన్ హాస్పిటల్ నుట్రిషన్ అడ్వైజర్- అండర్ స్టాండింగ్ యోగర్ట్
 15. యోగర్ట్--ఎన్ ఆటో డైజేస్టింగ్ సోర్స్ అఫ్ లాక్టోస్. J.C. కోలర్స్ et al., న్యూ ఇంగ్లాండ్ జర్నల్ అఫ్ మెడిసిన్, 310:1-3 (1984)
 16. O. అడాల్ఫ్స్సన్et al. , "యోగర్ట్ అండ్ గట్ ఫంక్షన్", అమెరికన్ జర్నల్ అఫ్ క్లినికల్ నుట్రిషన్ 80 :2:245-256 (2004) http://www.ajcn.org/cgi/content/full/80/2/245
 17. రిపుదామన్ S. బెనివాల్, et al. , "ఎ రాండమైజ్ద్ ట్రయల్ అఫ్ యోగర్ట్ ఫర్ ప్రివెన్షన్ అఫ్ యాంటిబయోటిక్ -అసోసియేటెడ్ డయేరియా", డైజస్టివ్ దిసీసేస్ అండ్ సైన్సెస్ 48 :10:2077-2082 (అక్టోబర్, 2003) doi:10.1023/A:1026155328638
 18. ఎరిక N. రింగ్దహ్ల్, " Treatment of Recurrent Vulvovaginal Candidiasis", అమెరికన్ ఫ్యామిలీ ఫిజీషియన్ 61 :11 (June 1, 2000)
 19. " యోగర్ట్ గుడ్ ఫర్ గమ్స్, హెల్త్", డెంటల్ బ్లాగ్స్ .కాం (February 26, 2008)
 20. డైరీ ఆగ్మేన్టేషన్ అఫ్ టోటల్ అండ్ సెంట్రల్ ఫాట్ లాస్ ఇన్ ఒబేస్ సబ్జక్ట్స్
 21. అస్క్ద్ర్సేర్స్ .Com - Faq "లైవ్ కల్చర్స్ ఇన్ యోగర్ట్"
 22. ఎన్సైక్లోపీడియా
 23. ది జపాన్ టైమ్స్ బాక్టీరియా స్ప్రెడ్స్ అక్రాస్ నేషన్ టు క్రియేట్ స్లిమి, హెల్తి ట్రీట్, బై తకుయ కరుబే క్యోడో న్యూస్
 24. హెల్త్ అండ్ నుట్రిషన్ న్యూస్
 25. జపాన్స్ #1 ఇంగ్లీష్ మగజైన్, హెల్త్ అండ్ బ్యూటీ, యోగర్ట్ యో
 26. యాసిడిఫైడ్ మిల్క్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్
 27. http://www.shankleesh.com/

బాహ్య లింకులు[మార్చు]

మూస:Turkish cuisine