Jump to content

యోగి రామయ్య

వికీపీడియా నుండి
యోగి రామయ్య
జననంమోపూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
నిర్యాణము1962 ఫిబ్రవరి 12
అన్నారెడ్డిపాలెం
జాతీయతభారతీయుడు
స్థాపించిన సంస్థయోగి రామ తపోవనం & ఋషి మార్గ మిషన్ అన్నారెడ్డిపాలెం దువ్వూరు సంగం (నెల్లూరు జిల్లా) పిన్ - (524306) ph. 08622212484
గురువుశ్రీబ్రహ్మనందతీర్ధులు, రమణ మహర్షి
తత్వంఅద్వైతం
ప్రముఖ శిష్యు(లు)డుశ్రీ ప్రజ్ఞారణ్యస్వామి ( యోగి ప్రోటొప్లాజమ్)
తండ్రిచేవూరి పిచ్చిరెడ్డి

యోగి రామయ్య, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సంగం మండలం అన్నారెడ్డిపాలెం చెందిన ప్రసిద్ధ యోగి పుంగవుడు. శ్రీ రమణ మహర్షి అగ్రగణ్య శిష్యులలో ఇతను ఒకడు. శ్రీ భగవాన్ రమణ మహర్షి ఆశ్రమ కార్యక్రమాలలో భక్తులు వివిధ సేవా కార్యక్రమాలలో పాల్గొనేవారు. కొందరు ఆశ్రమ నిర్వహణా కార్యక్రమాలు , కొందరు భక్తుల, యాత్రికుల సేవకు, మరికొందరు భగవాన్ రమణుల పరిచర్యకు , కొందరు మేధావులు భగవాన్ రమణులు సూచించిన విచార మార్గం లో స్థిరంగా నిలిచి సాధన చేసారు. అటువంటివారిలో శ్రీ యోగి రామయ్య ఒకరు [1] ఇంగ్లీష్ ప్రధాన భాషగా ఉన్న ప్రపంచానికి శ్రీరమణ మహర్షిని పరిచయం చేసిన పుస్తకం "రహస్య భారతదేశంలో ఒక అన్వేషణ" (A Search in Secret India by Paul Brunton") అనే ఈ పుస్తక రచయత పాల్ బ్రంటన్ తాను ఎంతో ప్రశాంతతను శ్రీరామయోగి సాన్నిధ్యంలో అనుభవించినట్లు వ్రాసాడు.

కుటుంబ నేపథ్యం

[మార్చు]

నెల్లూరు పట్టణానికి పశ్చిమంగా ఉన్న వేదాద్రి (నరసింహ కొండ) చెంగటి "మోపూరు" గ్రామం ఇతని జన్మ స్థలం. అతని తండ్రి చేవూరి పిచ్చిరెడ్డి. యోగి రామయ్య చిన్నప్పుడే తండ్రి మరణించారు. వారిది సంపన్న కుటుంబం. ఇతని వంశం దాన ధర్మాలకు జ్ఞాన సాధనకు ప్రసిద్ధికెక్కింది. మూడుతరాలుగా ఈ వంశానికికొక్కడే పుత్రుడు. తండ్రి మరణాంతరం మేనమామలు ఇంట "బుచ్చిరెడ్డిపాలెం" లలో పెరిగారు. పంథొమ్మిదొవ ఏట శ్రీ బ్రహ్మనందతీర్థస్వామి వారి వద్ద తారక మంత్రోపదేశం పొందారు. స్వత్వికాహారులై ప్రాణాయామం స్వయంగా చేయడం ఆరంభించారు. అనేక యోగాలు అభ్యసించి అనుభవాలు పొందారు. తన సంగతి తాను గమనించి అరుణాచలం వచ్చి, శ్రీ భగవాన్ రమణ మహర్షి దర్శించి , వారి సలహా తీసుకొని, చూత గుహలో పన్నేడేళ్ల్లు మౌనం వహించి తపస్సు చేశారు.

ఆ తర్వాత అన్నారెడ్డిపాలెంలో ఆశ్రమం నిర్మించుకొని కొంతకాలం అక్కడ, కొంతకాలం అరుణాచలంలో గడిపేవారు ఆయన శ్రీ రమణాశ్రమానికి ఎంతో ధన సహాయం చేసారు. ఎందరో మేధావులు ఆయన్ని దర్శించి, గొప్ప తపశ్శాలిగా గుర్తించారు. వారిలో పాల్ బ్రంటన్ ఒకరు. వారు "A Search in Secret India" అనే తమ గ్రంధం లో రామయోగి గారిని ప్రశంసించారు. ఆయనకు సిద్దులు కలవని చాలామంది అభిప్రాయం. అన్నారెడ్డి పాలెంలో ఈ నాటికి ఆయన జయంతి ఉత్సవాలు జరుపుతున్నారు.

సహ యోగులు

[మార్చు]

యోగి రామ తపోవనం

[మార్చు]

యోగి రామ తపోవనం & ఋషి మార్గ మిషన్ అన్నారెడ్డిపాలెం గ్రామంలో ఉంది

యోగి రామయ్య శిష్యులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Jul / Aug 2008 Maharshi newsletter". web.archive.org. 2013-11-27. Archived from the original on 2013-11-27. Retrieved 2022-07-01.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లింకులు

[మార్చు]
  • A Search in Secret India, Paul Brunton, Rider & Company, 1934, పుస్తకం: శ్రీరమణ లీల, రచన: కృష్ణ భిక్షు, ప్రచురణ: రమణాశ్రమం