Jump to content

రంగనాయకి

వికీపీడియా నుండి
రంగనాయకి
రంగనాయకి అమ్మవారు
అనుబంధంశ్రీ వైష్ణవులు
నివాసంవైకుంఠం
భర్త / భార్యశ్రీ రంగనాథ స్వామీ
వాహనంఏనుగు
పాఠ్యగ్రంథాలునాలాయిర దివ్య ప్రబంధం
పండుగలువైకుంఠ ఏకాదశి

రంగనాయకి (తమిళం: ரங்கநாயகி, సంస్కృతం: रङ्गनायकी) హిందూ దేవత.[1] ఈమె శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయానికి అధిష్టాన దేవత.[2] రంగనాథస్వామి భార్య. ఆ అమ్మవారు లక్ష్మి స్వరూపంగా పరిగణించబడుతుంది. రంగనాథుడు విష్ణువు స్వరూపంగా పరిగణించబడతాడు.[3] ఆమెను రంగనాయకి నాచియార్, పెరియ పిరట్టి, తాయార్ అని కూడా కొలుస్తారు.[4] శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం, ఆమె స్వయంగా రంగనాథునికి సహ-సమానంగా పరిగణించబడుతుంది.

శ్రీ రంగనాథస్వామి దేవాలయం, శ్రీరంగం

[మార్చు]

రంగనాథస్వామి ఆలయంలో రెండు ప్రధాన విగ్రహాలు (మూల మూర్తులు), ఒక ఊరేగింపు విగ్రహం (ఉత్సవ మూర్తి) ఉన్నాయి. ఆ ఊరేగింపు విగ్రహాన్ని 1323 CEలో ఖల్జీ రాజవంశంనకు చెందిన మాలిక్ కాఫూర్ ఆలయంపై దాడి చేసిన సమయంలో అమ్మవారి మందిరం సమీపంలోని చెట్టు కింద పాతిపెట్టారు.[5] ఆ విగ్రహం అపవిత్రం కాకూడదని మందిరం నుండి తరలించబడింది. ఆ దోపిడి తరువాత, విగ్రహం కనిపించలేదు, ఆలయ పూజారి కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించాలని భావించాడు. ఈ విగ్రహం మందిరంలో రెండవ ప్రధాన విగ్రహం (మూల మూర్తి).

స్థల పురాణం ప్రకారం, రంగనాయకి ఒక భక్తునికి కలలో కనిపించి, తన ఊరేగింపు విగ్రహం ఎక్కడ ఉందో చెప్పింది. ఆ విగ్రహాన్ని భక్తుడు తవ్వి తిరిగి ప్రతిష్టించాడు. ఇతర దేవాలయాల మాదిరిగా కాకుండా, రంగనాయకి ఊరేగింపు విగ్రహం ఆమె గర్భగుడిని వదిలి వెళ్ళదు.[6][7]

సంవత్సరానికి ఒకసారి పంగుని ఉత్తిరం సందర్భంగా రంగనాథ, రంగనాయకి ఉత్సవ మూర్తులను కలిపి ఊరేగిస్తారు. వారిని దివ్య-దంపతీగల్ అని పిలుస్తారు.[8] ఈ ఆలయంలో వివాహోత్సవం ఉండదు. ఈ దర్శనాన్ని సెర్టి-సేవై అంటారు.

పరాశర భట్టర్ రచించిన శ్రీ గుణరత్న కోశం అనే శ్లోకం రంగనాయకికి అంకితం చేయబడింది. అయితే, ఆచారాల సమయంలో ఆలయంలో సాంప్రదాయ లక్ష్మి అష్టోత్రం పఠిస్తారు. వేదాంత దేశిక రచించిన శ్రీ స్తుతి, ఆదిశంకరాచార్యులు రచించిన కనకధారా స్తోత్రాన్ని భక్తులు ఆమెను కీర్తిస్తూ ఆలయంలో ఆలపిస్తారు.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Hawley, John Stratton; Wulff, Donna Marie (1998). Devī: Goddesses of India (in ఇంగ్లీష్). Motilal Banarsidass Publ. pp. xii. ISBN 978-81-208-1491-2.
  2. "Story On Ranganathaswamy Temple, Srirangapatna - Sakshi". web.archive.org. 2023-03-28. Archived from the original on 2023-03-28. Retrieved 2023-03-28.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. Kumar, P. Pratap (1997). The Goddess Lakṣmī: The Divine Consort in South Indian Vaiṣṇava Tradition (in ఇంగ్లీష్). Scholars Press. p. 81. ISBN 978-0-7885-0199-9.
  4. Raman, K. V. (2003) [1975]. Sri Varadarajaswami Temple, Kanchi: A Study of Its History, Art and Architecture (in ఇంగ్లీష్). Abhinav Publications. p. 8. ISBN 978-81-7017-026-6.
  5. Gembali, Neeharika (2022-03-30). Sri Ranganatha Swamy Temple (in ఇంగ్లీష్). Writers Pouch. p. 13. ISBN 979-8-88641-724-1.
  6. Viswanatha (2016-01-15). Theology and Tradition of Eternity: Philosophy of Adi Advaita (in ఇంగ్లీష్). Partridge Publishing. p. 68. ISBN 978-1-4828-6982-8.
  7. Warrier, Shrikala (December 2014). Kamandalu: The Seven Sacred Rivers of Hinduism (in ఇంగ్లీష్). MAYUR University. p. 204. ISBN 978-0-9535679-7-3.
  8. "I need to know the significance of Pankuni uttiram and Kalyana utsavam". Sri Vaishnava Home Page. 28 March 2002. Retrieved 21 November 2011.
"https://te.wikipedia.org/w/index.php?title=రంగనాయకి&oldid=3882757" నుండి వెలికితీశారు