రంగినేని మోహనరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రంగినేని మోహనరావు

రంగినేని మోహనరావు తెలంగాణకు చెందిన పారిశ్రామికవేత్త, సంఘసేవకుడు. ఈయన "రంగినేని సుజాత మోహనరావు ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్టు" వ్యవస్థాపకులు.[1] ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు 'సంఘసేవ, నిరంతర విద్య, వ్యక్తిత్వ వికాసం' విభాగంలో "కీర్తి పురస్కారాన్ని" ప్రకటించారు.[2]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన 1946 నవంబరు 14లో జన్మించారు. ఆయన తండ్రి రంగినేని రామచంద్రరావు.[3] ఈయన "రంగినేని స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్", "రైస్ మిల్లర్స్ గ్రైన్స్ వేర్ హౌస్ లిమిటెడ్" వంటి కంపెనీలకు డైరక్టరుగా ఉన్నారు.[4][5] ఆయన "రంగినేని సుజాత మోహనరావు ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్టు"ను నెలకొల్పి అనేకమంది అనాథలకు విద్యా, వసతి సౌకర్యాల నందిస్తున్నారు.[6]

రంగినేని సుజాత మోహనరావు ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్టు[మార్చు]

రంగినేని ట్రస్టు 1998 లో రంగినేని మోహనరావు అండ్ కంపెనీచే స్థాపించబడింది.ఈ ట్రస్టు సిరిసిల్ల లోని బాలాజీనగర్లో నెలకొనిఉంది. మోహనరావు 10 ఎకరాల స్థలాన్ని అనాథ పిల్లల కోసం కేటాయించారు. ఆయన ఆశయం అనాథ పిల్లలకు వసతి, ఆహారం, ఉత్తమ విద్యను అందించడమే. ఆయన భాగస్వాములైన రాజూరి శేఖరయ్య, చిట్నేని సుధాకరరావు గార్ల సహకారంతో ఈ ప్రాజెక్టును సమర్థవంతంగా నడుపుతున్నారు. ఈ ట్రస్టు భవన నిర్మాణం 2000 లో పూర్తి అయింది. 2001 జూలై నుండి ట్రస్టు పూర్తిస్థాయిలో పనిచేస్తోంది.

14 మంది అనాథ పిల్లలతో ప్రారంభించబడింది. అనతి కాలంలోనే స్నేహితులు, శ్రేయోభిలాషుల సహకారంతో 2002 లో ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. ఈ పాఠశాల భవనాన్ని అప్పటి కరీంనగర్ కలెక్టరు శ్రీమతి సుమిత్రా దార్వే ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పాఠశాల ఉన్నత పాఠశాల వరకు పొడిగింపబడి మంచి విద్యను 1 నుండి 10 వ తరగతి వరకు అందిస్తున్నది.

2015 నాటికి ఈ సంస్థ ద్వారా 177 మంది పిల్లలు (85 మంది బాలికలు) లబ్ధి పొందారు.

2004 లో రంగినేని ట్రస్టు ఖమ్మంలో ఒక అద్దె భవనంలో 24 మంది అనాథలతో ఒక శాఖను ప్రారంభించింది. ఈ శాఖలో కూడా విద్య, వసతి సౌకర్యాలు కల్పించబడుతున్నవి.[7]

పురస్కారాలు[మార్చు]

రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం[మార్చు]

రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారాన్ని రంగినేని మోహన్‌రావు తన తల్లి కీ||శే|| రంగినేని ఎల్లమ్మ పేర నెలకొల్పి ప్రతి సంవత్సరం సాహితీ ప్రముఖులకు అందిస్తారు.ఈ పురస్కారాన్ని 2006 నుండి ప్రదానం చేస్తున్నారు. అందులో భాగంగా అవార్డు క్రింద 12 వేల రూపాయల నగదు, మెమొంటోతో సత్కరిస్తారు.

పురస్కార గ్రహీతలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "రంగినేని సుజాత మోహనరావు ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్టు". రంగినేని ఛారిటబుల్ ట్రస్టు. Archived from the original on 2015-02-18. Retrieved 2015-06-29.
  2. తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రకటన[permanent dead link]
  3. About Rangineni Mohan Rao[permanent dead link]
  4. Rangineni Mohan Rao Company Info[permanent dead link]
  5. "RANGINENI STEEL PRIVATE LIMITED". Archived from the original on 2016-03-05. Retrieved 2015-06-29.
  6. "RANGINENI TRUST". Archived from the original on 2016-03-05. Retrieved 2015-06-30.
  7. "About Us". Archived from the original on 2015-02-18. Retrieved 2015-06-29.
  8. "35 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". www.andhrajyothy.com. 2015-06-27. Archived from the original on 2022-09-17. Retrieved 2022-09-17.
  9. ముదిగంటి సుజాత రెడ్డికి ‘రంగినేని ఎల్లమ్మ’ సాహిత్య పురస్కారం[permanent dead link]
  10. స్మారక పురస్కారం[permanent dead link]
  11. "రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం". Archived from the original on 2016-07-26. Retrieved 2015-06-30.
  12. జూపాక సుభద్రకు రంగినేని సాహిత్య పురస్కారం[permanent dead link]

ఇతర లింకులు[మార్చు]