Jump to content

రంజిత్ కుమార్ పంజా

వికీపీడియా నుండి
రంజిత్ కుమార్ పంజా

పదవీ కాలం
1998–2004
ముందు సుబ్రతా బోస్
తరువాత చిత్త బసు
నియోజకవర్గం బరాసత్

వ్యక్తిగత వివరాలు

జననం (1932-10-01)1932 అక్టోబరు 1
కోల్‌కతా , బెంగాల్ ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా
మరణం 2006 April 5(2006-04-05) (వయసు: 73)
కోల్‌కతా , పశ్చిమ బెంగాల్
రాజకీయ పార్టీ తృణమూల్ కాంగ్రెస్
జీవిత భాగస్వామి కృష్ణ పంజా
బంధువులు అజిత్ కుమార్ పంజా (సోదరుడు)
సంతానం 1 కొడుకు, కూతురు
మూలం [1]

డాక్టర్ రంజిత్ కుమార్ పంజా (జననం 1 అక్టోబర్ 1932) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బరాసత్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

రంజిత్ కుమార్ పంజా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బరాసత్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి చిత్ర ఘోష్ పై 66707 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4] ఆయన 1999 లోక్‌సభ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి సరళ్ దేబ్ పై 96,900 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[5]

రంజిత్ కుమార్ పంజా 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బరాసత్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి సుబ్రతా బోస్ చేతిలో 12160 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

మూలాలు

[మార్చు]
  1. "Partywise Comparison since 1977 Barasat Parliamentary Constituency". Election Commission of India. Retrieved 24 October 2015.
  2. "Skin disease on the rise". The Times of India. 4 February 2003. Retrieved 24 October 2015.
  3. "Ranjit Panja Dead". The Telegraph. 5 April 2006. Archived from the original on 7 April 2006. Retrieved 24 October 2015.
  4. "General Elections, 1998 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on July 18, 2014. Retrieved 25 May 2014.
  5. "General Elections, 1999 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on July 18, 2014. Retrieved 25 May 2014.