రంబన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Ramban District
District
Ramban District is located in Jammu and Kashmir
Ramban District
Location in Jammu and Kashmir, India
భౌగోళికాంశాలు: 33°14′24″N 75°14′24″E / 33.24000°N 75.24000°E / 33.24000; 75.24000Coordinates: 33°14′24″N 75°14′24″E / 33.24000°N 75.24000°E / 33.24000; 75.24000
Country  India
State Jammu and Kashmir
Headquarters Ramban
Languages
 • Official Urdu
సమయప్రాంతం IST (UTC+5:30)
Website http://ramban.gov.in

జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రం లోని 22 జిల్లాలలో రంబన్ జిల్లా (ఉర్దు: ضلع رام بن ) ఒకటి. హిమాలయాలలోని పిర్‌పంజల్ పర్వతశ్రేణిలో ఉంది. దొడ జిల్లాలోని కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది. రంబా ప్రాతం వెనుకబడి ఉండడం మరియు సుదూరప్రాంతంలో ఉండడం కారణంగా 2007 నుండి రంబా యూనిట్ స్వతంత్రంగా వ్యవహరించడానికి అనుమతి లభించింది.[1] జిల్లా కేంద్రగా రంబన్ పట్టణం ఉంది. ఈ పట్టణం జమ్మూ మరియు శ్రీనగర్ మద్య చినాబ్ నదీతీరంలోఉన్నది. ఇది జమ్మూ మరియు శ్రీనగర్కు సుమారు 150 కి.మీ దూరంలో జాతీయరహదారి 44 పక్కన ఉంది.[2]

పాలనా విభాగాలు[మార్చు]

రంబన్ జిల్లా 2 తెహ్సిల్స్‌గా విభజించబడింది.

  • రంబన్ తెహ్సిల్
  • బనిహల్ తెహ్సిల్

ఒక్కొక్క తెహ్సిల్‌కు ఒక్కొక తెహ్సిల్దార్ ఉంటారు. తెహ్సిల్దార్ తెహ్సిల్‌కు అధికారబాధ్యతలు కలిగి ఉంటాడు. జిల్లా అదనంగా 4 బ్లాకులుగా విభజించబడి ఉంది : రంబన్, బనిహల్, గూల్ మరియు రాంసు. ఒక్కొక్క బ్లాకుకు ఒక్కొక్క బ్లాక్ డెవెలెప్మెంట్ అధికారి ఉంటాడు.2001 గణాంకాలను అనుసరించి ఒక్కొక్క బ్లాకులో పలు పనచాయితీలు ఉంటాయి. జిల్లాలో 116 గ్రామాలు మరియు 127రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో పంచాయతీ హల్కాలు 124 ఉన్నాయి.

భౌగోళికం[మార్చు]

[3] రంబన్ జిల్లా సముద్రమట్టానికి 1,156 మీ ఎత్తులో ఉంది. జిల్లా దక్షిణ సరిహద్దులో " పత్నిటాప్ " హిల్ స్టేషను ఉంది. పశ్చిమ సరిహద్దులో గూల్ మరియు ఉత్తర సరిహద్దులో బనిహాల్ ఉన్నాయి. జిల్లాలోని టెర్రిన్ ప్రాతం కొండలమయంగా ఉంటుంది. జిల్లా సరిహద్దులలో రీసి, ఉధంపుర్,అనంతనాగ్, దొడ, మరియు కుల్‌గం జిల్లాలు ఉన్నాయి. [4]

వాతావరణం[మార్చు]

రంబన్ జిల్లా వాతావరణం ఎత్తు పల్లాలను అనుసరించి మారుతూ ఉంటాయి. అత్యధిక ఉష్ణోగ్రత 42 డిగ్రీల ° సెల్షియస్ ఉంటుంది. రంబన్ వంటి ఎత్తైన ప్రదేశాలలో ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెల్షియస్‌కు చేరుకుంటుంది. క్లిష్టమైన శితోష్ణస్థితి కారణంగా ఇక్కడి ప్రజలు సంవత్సరంలో 8 మాసాలు మాత్రమే పనిచేస్తుంటారు.

రాజకీయాలు[మార్చు]

రంబన్ జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి: బనిహాల్ మరియు రంబన్.[5]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 283,313.[6]
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. బార్బడోస్ నగర జనసంఖ్యకు సమం.[7]
640 భారతదేశ జిల్లాలలో. 573వ స్థానంలో ఉంది.[6]
1చ.కి.మీ జనసాంద్రత. 213[6]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 31.81%.[6]
స్త్రీ పురుష నిష్పత్తి. 901:1000 [6]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 56.9%.[6]
జాతియ సరాసరి (72%) కంటే.

జిల్లాలో పొగులి మరియు రంబని కలిసిన కాశ్మీరి భాష అత్యధికంగా వాడుకలో ఉంది. సిరాజి కూడా జిల్లాలో అధికంగా వాడుకలో ఉంది. రంబన్ మరియు బటొటే ప్రాంతాలలో డోగ్రీ భాష వాడుకలో ఉంది. జిల్లా తూర్పు మరియు దక్షిణ ప్రాంతాలలో హిందువులు అధికంగా ఉన్నారు. ఉత్తర మరియు పశ్చిమ ప్రాంతాలలో ముస్లిములు అధికంగా ఉన్నారు.భౌగోలికంగా కాశ్మీర్ లోయకు సమీపంగా ఉన్న కారణంగా జిల్లా వాయవ్యభాగంలో ఉన్న బనిహాల్, గోల్ మరియు కొన్ని ఇతర ప్రాంతాలలో వారిస్వంత యాసలో కాశ్మీరి భాషను మాట్లాడుతున్నారు. రంబన్ జిల్లా ప్రజలు మతాలను కులాలను మరచి ఒకరికొకరు సహోదరభావంతో మెలగుతుంటారు. జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రంలో అత్యంత శాతియుతమైన జిల్లాగా రంబన్ జిల్లాకు ప్రత్యేకత ఉంది. ఈ జిల్లాలో ఇప్పటి వరకు మతసంఘర్షణ నమోదు కాకపోవడం ఒక ప్రత్యేకత.[ఆధారం కోరబడింది]

బృహత్తర ప్రణాళికలు[మార్చు]

పిర్ పింజల్ రైల్వే టన్నెల్[మార్చు]

పిర్ పింజల్ రైల్వే టన్నెల్ ప్రణాళిక భారతదేశ పొడవైన రైల్వే టన్నెల్‌గా గుర్తించబడుతుంది. ఇది 11.2 కి.మీ పొడవైనది. ఇది కాశ్మీర్ లోయ లోని బనిహాల్‌ను క్వాజీగుండ్‌తో కలుపుతుంది. ఈ టన్నెల్ కాశ్మీర్ రైల్వేలో ఒక భాగం.[8]

బగ్లిహర్ ఆనకట్ట[మార్చు]

చందర్‌కోటే వద్ద జె.కె ఇండస్ట్రీస్ నిర్మించిన హైడ్రాలిక్ ప్రాజెక్ట్ " బగ్లిహర్ ఆనకట్ట " రంబన్‌కు 8 కి.మీ దూరంలో ఉంది. ఈ ప్రాజెక్ట్ 900 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసుతుంది.

See also[మార్చు]

మూలాలు[మార్చు]

  1. - About Ramban
  2. Statement showing the number of blocks in respect of 22 Districts of Jammu and Kashmir State including newly Created Districts dated 2008-03-13, accessed 2008-08-30
  3. - Geography of Ramban
  4. - About Ramban
  5. "ERO's and AERO's". Chief Electoral Officer, Jammu and Kashmir. Retrieved 2008-08-28. 
  6. 6.0 6.1 6.2 6.3 6.4 6.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. 
  7. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Barbados 286,705 July 2011 est.  line feed character in |quote= at position 9 (help)
  8. - Pir Panjal Railway Tunnel

వెలుపలి లింకులు[మార్చు]

  • [1] List of places in Ramban
"https://te.wikipedia.org/w/index.php?title=రంబన్&oldid=2004479" నుండి వెలికితీశారు