రక్తపరీక్ష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రక్తపరీక్ష చేయుటకు సిరంజి ద్వారా రక్త సేకరణ

రక్తపరీక్ష (Blood test) అనేది రక్త నమూనాపై చేసే ప్రయోగశాల విశ్లేషణ, ఇది చేయడానికి సాధారణంగా చేతి సిర నుండి హైపోడెర్మిక్ సూదిని ఉపయోగించి లేదా చేతి వేలు నుంచి ఫింగర్ ప్రిక్ ని ఉపయోగించి రక్తం సేకరిస్తారు. గ్లూకోజ్ పరీక్ష వంటి రక్త పరీక్షను చేయడానికి చేతి వేలు యొక్క చివరన ఫింగర్ ప్రిక్ ను గుచ్చుతారు, అప్పుడు వేలు నుంచి కొద్దిగా రక్తం బయటికి వస్తుంది, ఆ రక్తంలో ఉన్న గ్లోజోజ్ పరిమాణాన్ని గుర్తించడానికి గ్లూకోజ్‌ మీటర్ ని ఉపయోగిస్తారు. టైఫాయిడ్ వంటి వ్యాధి లక్షణాలను తెలుసుకొనుటకు రోగి చేతి యొక్క సిరలో హైపోడెర్మిక్ సూదిని గుచ్చి సిరంజి ద్వారా రక్తాన్ని సేకరిస్తారు, ఆ రక్తాన్ని ప్రయోగశాలలో విశ్లేషణ జరిపి వ్యాధి నిర్ధారణ చేస్తారు. అనేక వ్యాధుల నిర్ధారణకు నేడు రక్తపరీక్షలు సర్వసాధారణం. రక్తపరీక్షలకు అపకేంద్ర యంత్రం, మైక్రోస్కోపు, గ్లూకోజ్ మీటర్ వంటి పరికరాలను ఉపయోగిస్తారు.

రక్త పరీక్ష చేయించుకొను సందర్భములు[మార్చు]

  • జ్వరం వచ్చినప్పుడు, జ్వరం వచ్చిన కారణాన్ని తెలుసుకొనుటకు రక్త పరీక్షలు జరుపుతారు.
  • రక్తదానం చేసిన వారి రక్తం ఏ రక్త వర్గమునకు చెందినదో అని తెలుసుకొనుటకు
  • ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడిన వారికి రక్తం ఎక్కించవలసి వచ్చినప్పుడు వారికి ఏ రక్త వర్గం అవసరమో తెలుసుకొనుటకు
  • కాన్పుల సమయంలో తల్లికి, బిడ్డకి రక్త పరీక్షలు చేస్తారు, కొన్ని సందర్భాలలో ఇది అత్యవసరం కూడా, మళ్ళీ కాన్పులో బిడ్డకు ఆటంకాలు కలుగకుండా కొన్ని ఇంజెక్షన్‌లు తల్లికి ఇవ్వవలసివుంటుంది.
  • శస్త్రచికిత్సల సమయంలో రోగికి రక్తపరీక్ష చేస్తారు.