రక్షణవాదం


రక్షణవాదం (ఆంగ్లంలో ప్రొటెక్షనిజం) లేదా వాణిజ్య రక్షణవాదం, దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు, దిగుమతి కోటాలు ఇంకా వివిధ రకాల ప్రభుత్వ నిబంధనలు వంటి పద్ధతుల ద్వారా ఇతర దేశాల నుండి దిగుమతులను నియంత్రించే ఆర్థిక విధానం. దీని ప్రతిపాదకులు, రక్షణాత్మక విధానాలు దేశంలోని ఉత్పత్తిదారులు, వ్యాపారాలు, కార్మికులను విదేశీ పోటీదారుల నుండి రక్షించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతాయని వాదిస్తారు. దీని వ్యతిరేకులు, ఈ విధానాలు వాణిజ్యాన్ని తగ్గిస్తాయని, దిగుమతి చేసుకున్న వస్తువుల ధరను పెంచడం ద్వారా వినియోగదారులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని, ఎగుమతి రంగాలలో ఉత్పత్తిదారులు, కార్మికులను కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని వాదిస్తారు.[1]
రక్షణవాదం ప్రధానంగా ఆర్థిక జాతీయవాద భావాలు కలిగి ఉన్న పార్టీలచే బలపరచబడింది, అయితే ఆర్థికంగా ఉదారవాద రాజకీయ పార్టీలు సాధారణంగా స్వేచ్ఛా వాణిజ్యానికి మద్దతు ఇస్తాయి.[2][3][4][5][6]
రక్షణవాదం ఆర్థిక వృద్ధి, ఆర్థిక సంక్షేమానికి ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఆర్థికవేత్తలలో ఏకాభిప్రాయం ఉంది, అయితే స్వేచ్ఛా వాణిజ్యం, వాణిజ్య అడ్డంకులను తగ్గించడం ఆర్థిక వృద్ధిపై గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూపుతాయి.[7][8][9][10] డగ్లస్ ఇర్విన్ వంటి అనేక ఆర్థికవేత్తలు కొన్ని ఆర్థిక సంక్షోభాలలో, ముఖ్యంగా మహా మాంద్యంలో రక్షణవాదాన్ని ఒక ముఖ్యమైన కారకంగా పేర్కొన్నారు.[11] మరింత సాంప్రదాయవాద దృక్పథాన్ని కలిగున్న న్యూ కీనేసియన్ ఆర్థికవేత్త పాల్ క్రుగ్మాన్, సుంకాలు మహా మాంద్యానికి ప్రధాన కారణం కాదని, దానికి ప్రతిస్పందన అని, కేటాయింపు అసమర్థతకు రక్షణవాదం ఒక చిన్న మూలం మాత్రమే అని వాదించాడు.[12][13] వాణిజ్య సరళీకరణ కొన్నిసార్లు నష్టాలు లాభాలలో, అసమాన పంపిణీకి దారితీయవచ్చు, కొంత కాలం దిగుమతి-పోటీ రంగాలలో కార్మికుల తొలగింపుకు కారణమవుతుంది. స్వేచ్ఛా వాణిజ్యం ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు వస్తువులు, సేవల ఖర్చులను సాధారణంగా తగ్గిస్తుంది.[14]
మూలాలు
[మార్చు]- ↑ Piketty, Thomas (April 19, 2022). A Brief History of Equality. Belknap Press. Retrieved January 5, 2024.
- ↑ Murschetz, Paul (2013). State Aid for Newspapers: Theories, Cases, Actions. Springer Science+Business Media. p. 64. ISBN 978-3-642-35690-2.
Parties of the left in government adopt protectionist policies for ideological reasons and because they wish to save worker jobs. Conversely, right-wing parties are predisposed toward free trade policies.
- ↑ Peláez, Carlos (2008). Globalization and the State: Volume II: Trade Agreements, Inequality, the Environment, Financial Globalization, International Law and Vulnerabilities. United States: Palgrave MacMillan. p. 68. ISBN 978-0-230-20531-4.
Left-wing parties tend to support more protectionist policies than right-wing parties.
- ↑ Mansfield, Edward (2012). Votes, Vetoes, and the Political Economy of International Trade Agreements. Princeton University Press. p. 128. ISBN 978-0-691-13530-4.
Left-wing governments are considered more likely than others to intervene in the economy and to enact protectionist trade policies.
- ↑ Warren, Kenneth (2008). Encyclopedia of U.S. Campaigns, Elections, and Electoral Behavior: A–M, Volume 1. Sage. p. 680. ISBN 978-1-4129-5489-1.
Yet, certain national interests, regional trading blocks, and left-wing anti-globalization forces still favor protectionist practices, making protectionism a continuing issue for both American political parties.
- ↑ "The End of Reaganism". POLITICO Magazine. Retrieved 24 March 2017.
- ↑ "Economic Consensus On Free Trade". PIIE (in ఇంగ్లీష్). 25 May 2017. Retrieved 27 February 2018.
- ↑ "Free Trade". IGM Forum. 13 March 2012. Retrieved 24 June 2017.
- ↑ "Import Duties". IGM Forum. 4 October 2016. Retrieved 24 June 2017.
- ↑ "Trade Within Europe". IGM Forum. Retrieved 24 June 2017.
- ↑ Irwin, Douglas (2017). Peddling Protectionism: Smoot-Hawley and the Great Depression. Princeton University Press. pp. vii–xviii. ISBN 978-1-4008-8842-9.
- ↑ "The Mitt-Hawley Fallacy". 4 March 2016.
- ↑ "Hayek, Trade Restrictions, and the Great Depression". 10 July 2010.
- ↑ Rosenfeld, Everett (11 March 2016). "Here's why everyone is arguing about free trade". CNBC. Retrieved 10 August 2021.