Jump to content

రఘునందన్ స్వరూప్ పాఠక్

వికీపీడియా నుండి
రఘునందన్ పాఠక్
న్యాయమూర్తి - అంతర్జాతీయ న్యాయస్థానం
In office
1989–1991
18వ భారత ప్రధాన న్యాయమూర్తి
In office
21 డిసెంబర్ 1986 – 18 జూన్ 1989
Appointed byజ్ఞాని జైల్ సింగ్
అంతకు ముందు వారుపి.ఎన్. భగవతి
తరువాత వారుఇ. ఎస్. వెంకట్రామయ్య
సుప్రీమ్‌కోర్టు న్యాయమూర్తి
In office
20 ఫిబ్రవరి 1978 – 20 డిసెంబర్ 1986
Nominated byమీర్జా హమీదుల్లా బేగ్
Appointed byనీలం సంజీవరెడ్డి
వ్యక్తిగత వివరాలు
జననం(1924-11-25)1924 నవంబరు 25
మరణం2007 నవంబరు 17(2007-11-17) (వయసు: 82)
న్యూ ఢిల్లీ, భారతదేశం

రఘునందన్ స్వరూప్ పాఠక్ (25 నవంబర్ 1924 - 17 నవంబర్ 2007) భారతదేశ 18వ ప్రధాన న్యాయమూర్తి. ఇతడు భారత మాజీ ఉపరాష్ట్రపతి గోపాల్ స్వరూప్ పాఠక్ కుమారుడు.[1]

హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ)లో భారతదేశం నుండి పనిచేసిన నలుగురు న్యాయమూర్తులలో ఇతడు ఒకరు (మిగిలినవారు 1952 నుండి 1953 వరకు పనిచేసిన బెనెగల్ నర్సింగ్ రావు, 1985 నుండి 1988 వరకు దాని అధ్యక్షుడిగా పనిచేసిన నాగేంద్ర సింగ్, ప్రస్తుతం పనిచేస్తున్న మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి దల్వీర్ భండారి). అలహాబాద్‌లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో చదువుకొన్న పాఠక్ అలహాబాద్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించాడు. అలహాబాద్‌లో న్యాయవాద వృత్తిని చేపట్టిన తర్వాత, 1962లో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా, తరువాత 1972లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితుడైనాడు.[2]

సుప్రీంకోర్టులో

[మార్చు]

ఇతడు 1978లో భారత సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఎంపికయ్యాడు. 1986 డిసెంబర్ 21న దాని 18వ ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు. మధ్యవర్తిత్వం వహించిన న్యాయమూర్తిగా, కోర్టుకు సాపేక్ష శాంతిని తీసుకురాగలిగిన న్యాయమూర్తిగా ఇతడిని జ్ఞాపకం ఉంచుకుంటారు. ఇతడు రెండున్నర సంవత్సరాలు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. ఈ సమయంలో కోర్టుకు డజను మంది న్యాయమూర్తులు నియమించబడ్డారు. వారిలో ఐదుగురు - మధుకర్ హిరాలాల్ కనియా, లలిత్ మోహన్ శర్మ, మానేపల్లె నారాయణరావు వెంకటాచలయ్య, అజీజ్ ముషబ్బర్ అహ్మది, జగదీష్ శరణ్ వర్మ 1991 - 1998ల మధ్య ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారు.[3]

సుప్రీంకోర్టులో తన పదవీకాలంలో, పాఠక్ 267 తీర్పులను చెప్పాడు. ఇంకా 812 బెంచ్‌లపై కూర్చున్నాడు.[4]

భారత ప్రధాన న్యాయమూర్తిగా, ఇతడు 8వ భారత రాష్ట్రపతి రామస్వామి వెంకటరామన్ తో ప్రమాణ స్వీకారం చేయించాడు.

భోపాల్ గ్యాస్ దుర్ఘటన

[మార్చు]

భోపాల్ గ్యాస్ విషాదానికి చెల్లించాల్సిన నష్టపరిహారం విషయంలో 1989లో యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్, భారత ప్రభుత్వాల మధ్య కోర్టు వెలుపల పరిష్కారాన్ని[5] కుదర్చడంలో ఇతడు ప్రధాన పాత్ర వహించాడు. ప్రభుత్వం $3.3 బిలియన్ల నష్ట పరిహారం కోరింది కానీ $470 మిలియన్లు మాత్రమే అందుకుంది. ఈ పరిష్కారం ఫలితంగా యూనియన్ కార్బైడ్ పై ఉన్న నేర అభియోగాలను తొలగించారు.పదవీ విరమణ చేసిన మూడు నెలల్లోనే పాఠక్ హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో సభ్యుడయ్యాడు.[6][7] 1991లో సుప్రీంకోర్టు ఈ పరిష్కారాన్ని సమర్థించింది, తద్వారా ఈ కేసులో యూనియన్ కార్బైడ్ బాధ్యతకు ముగింపును పలికింది.[8]

అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా

[మార్చు]

పాఠక్ అంతర్జాతీయ న్యాయస్థానానికి న్యాయమూర్తిగా ఎన్నికై 1989 నుండి 1991 వరకు ఆ పదవిలో పనిచేశాడు. అంతర్జాతీయ న్యాయస్థానంలో రెండవ దఫా పనిచేస్తున్న భారతీయ న్యాయమూర్తి ఎం. నాగేంద్ర సింగ్ మరణం తరువాత జరిగిన "సాధారణ ఎన్నిక"లో ఇతడు ఎన్నికయ్యాడు. 1991లో భారతదేశం పాఠక్‌ను తిరిగి నామినేట్ చేయకూడదని నిర్ణయించింది, అయితే ఆయన ఐర్లాండ్ మద్దతుతో రంగంలోకి దిగారు. యూనియన్ కార్బైడ్‌తో $470 మిలియన్ల భోపాల్ గ్యాస్ విపత్తు పరిష్కారాన్ని భారత ప్రధాన న్యాయమూర్తిగా ఆమోదించినందుకు పాఠక్‌ను నిందించిన ఎంపీల నుండి ఐరిష్ ప్రభుత్వం విమర్శలకు గురైన తర్వాత, పాఠక్ పోటీ నుండి వైదొలిగాడు.[9]

పనికి నూనె పథకం దర్యాప్తు

[మార్చు]

నవంబర్ 2005లో, ఆయిల్-ఫర్-ఫుడ్ ప్రోగ్రామ్‌లో భారతీయ సంబంధాలపై దర్యాప్తు చేయడానికి ఇతడిని నియమించారు. ఆగస్టు 3, 2006న, ఇతడు తన 90 పేజీల నివేదికను సమర్పించాడు. ఇది కాంగ్రెస్ నాయకుడు, మాజీ విదేశాంగ మంత్రి కె. నట్వర్ సింగ్‌ను దోషిగా తేల్చింది.[10]

మరణం

[మార్చు]

పాఠక్ 2007 నవంబర్ 17న, 82 సంవత్సరాల వయసులో తన 83వ పుట్టినరోజుకు వారం ముందు న్యూఢిల్లీలో గుండెపోటుతో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. "Former CJI Pathak dead". The Indian Express. 19 November 2007. Retrieved 3 March 2013.
  2. "Former Hon'ble Chief Justices' of India". Retrieved 21 February 2012.
  3. "Judges of the Supreme Court of India: 1950 - 1989 - The Pathak Court (1986–9)". Oxford university Press. Retrieved 3 March 2013.
  4. "R.S. Pathak". Supreme Court Observer (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-09-30.
  5. "For A Few Pieces Of Silver". Tehelka. 26 June 2010. Archived from the original on 4 జూలై 2015. Retrieved 3 March 2013.
  6. "Spotlight on judges who ruled in favour of Union Carbide". DNA. 10 June 2010. Retrieved 3 March 2013.
  7. Keswani, Raajkumar (9 June 2010). "Bhopal verdict: Worst legal disaster of recent history". The Tribune. Retrieved 3 March 2013.
  8. "Centre to press for Dow picking up clean-up tab". The Times of India. 20 June 2010. Archived from the original on 11 April 2013. Retrieved 3 March 2013.
  9. "After two decades wait, India looking to get slot in ICJ". The Hindu. 19 June 2011. Retrieved 3 March 2013.
  10. "Oil-for-food: Pathak committee indicts Natwar". The Times of India. 3 Aug 2006. Archived from the original on 3 January 2013. Retrieved 24 September 2012.

బయటి లింకులు

[మార్చు]