Jump to content

రఘునాథ్ అనంత్ మషెల్కర్

వికీపీడియా నుండి
రఘునాథ్ అనంత్ మషెల్కర్
A portrait photograph of Raghunath Anant Mashelkar taken in April 2009.
జననం (1943-01-01) 1943 జనవరి 1 (వయసు 81)
మషెల్, గోవా, భారతదేశం
నివాసంపూణే
జాతీయతభారతీయుడు
రంగములుకెమికల్ ఇంజనీరింగ్
వృత్తిసంస్థలుకౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్
గ్లోబల్ రీసెర్చ్ అలయన్స్
నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్
చదువుకున్న సంస్థలుఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ముంబై
ముఖ్యమైన పురస్కారాలు
  • పద్మవిభూషణ్
  • పద్మభూషణ్
  • పద్మశ్రీ

రఘునాథ్ అనంత్ మషెల్కర్ (జననం: జనవరి 1, 1943) ఒక భారతీయ కెమికల్ ఇంజనీర్. ఈయన పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కార గ్రహీత.[1]

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

ఈయన 1943, జనవరి 1 న గోవా లోని మాషెల్ గ్రామంలో జన్మించి మహారాష్ట్ర లో పెరిగారు.[2] ఈయన యూనివర్శిటీ ఆఫ్ ముంబై లో యూనివర్శిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (యుడిసిటి; ఇప్పుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ముంబై) నుంచి 1966 లో కెమికల్ ఇంజనీరింగ్ లో బిఇ డిగ్రీ పట్టా, 1969 లో పిహెచ్ డి డిగ్రీని అభ్యసించాడు. ఈయన నేషనల్ కెమికల్ లాబొరేటరీ (ఎన్‌సిఎల్) కి డైరెక్టర్‌గా పనిచేశాడు. ఈయన హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో (2007–2012), డెలావేర్ విశ్వవిద్యాలయంలో (1976, 1988), టెక్నికల్ యూనివర్శిటీ ఆఫ్ డెన్మార్క్ (1982) లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. ఈయన 2007–2019 వరకు మోనాష్ విశ్వవిద్యాలయంలో సర్ లూయిస్ మాథెసన్ కు విశిష్ట ప్రొఫెసర్‌గా పనిచేశాడు. ఈయన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, టాటా మోటార్స్ లిమిటెడ్, హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్, థర్మాక్స్ఎల్టిడి, పిరమల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వంటి అనేక కంపెనీల డైరెక్టర్ల బోర్డులో సభ్యుడిగా పనిచేశాడు. ఈయన 1989–1995 లో భారతదేశ జాతీయ రసాయన ప్రయోగశాల (ఎన్‌సిఎల్) డైరెక్టర్‌గా పనిచేశాడు. ఈయన డైరెక్టర్ గా ఉన్న కాలంలో ప్రపంచవ్యాప్తంగా పోటీ సాంకేతిక పరిజ్ఞానాలు, అంతర్జాతీయ పేటెంటింగ్‌పై బలమైన ప్రాధాన్యతనిస్తూ పరిశోధనలను ప్రారంభించాడు. ఈయన సిఎస్‌ఐఆర్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేశాడు. ఈయన పదవిలో ఉన్న కాలంలో 'వరల్డ్ క్లాస్ ఇన్ ఇండియా' అనే పుస్తకంలో మొదటి పన్నెండు సంస్థలలో సి.ఎస్.ఐ.ఆర్ ఒకటిగా ఉంది.[3]

పదవులు

[మార్చు]

ఈయన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) మాజీ డైరెక్టర్ జనరల్, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (2004–2006), ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్స్ (2007), గ్లోబల్ రీసెర్చ్ అలయన్స్ (2007–2018) అధ్యక్షుడిగా పనిచేశాడు. ఈయన అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ (AcSIR) కు మొదటి ఛైర్పర్సన్ పనిచేశాడు.

మరిన్ని విశేషాలు

[మార్చు]

ఈయన ప్రధానమంత్రికి శాస్త్రీయ సలహా మండలిలో సభ్యుడిగా, వరుస ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన మంత్రివర్గానికి శాస్త్రీయ సలహా కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఈయన జాతీయ ఆటో ఇంధన విధానం నుండి భారతీయ డ్రగ్ ఔషధ నియంత్రణ వ్యవస్థను సరిదిద్దడం, నకిలీ డ్రగ్స్ ఔషధాలు వంటి పన్నెండు అధిక శక్తితో కూడిన కమిటీలకు అధ్యక్షత వహించాడు. ఈయన భోపాల్ గ్యాస్ ట్రాజెడీ (1985–86) పై దర్యాప్తు చేస్తున్న వన్ మ్యాన్ ఎంక్వైరీ కమిషన్‌కు, మహారాష్ట్ర గ్యాస్ క్రాకర్ కాంప్లెక్స్ ప్రమాదం (1990–91) పై దర్యాప్తు కోసం కమిటీ ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. ఈయన భారతదేశ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (2000–2018) ఛైర్మన్‌గా పనిచేశారు. ఈయన రిలయన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్, కెపిఐటి టెక్నాలజీస్ ఇన్నోవేషన్ కౌన్సిల్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్, మారికో ఫౌండేషన్ యొక్క పాలక మండలికి అధ్యక్షత వహించాడు.

మూలాలు

[మార్చు]
  1. "Raghunath Mashelkar". www.nasonline.org. Retrieved 2019-11-26.
  2. "Mashelkar appointed 1st chairperson of AcSIR".
  3. "ICT Mumbai". www.ictmumbai.edu.in. Archived from the original on 2019-06-12. Retrieved 2019-11-26.