రఘురామ కృష్ణ రాజు
This article needs to be updated. (ఏప్రిల్ 2025) |
| రఘురామ కృష్ణంరాజు | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2024 నవంబర్ 14 | |||
| ముందు | కోలగట్ల వీరభద్రస్వామి | ||
|---|---|---|---|
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2024 జూన్ 12 | |||
| ముందు | మంతెన రామరాజు | ||
| నియోజకవర్గం | ఉండి | ||
| పదవీ కాలం 2019 – 2024 | |||
| ముందు | గోకరాజు గంగరాజు | ||
| తరువాత | భూపతిరాజు శ్రీనివాసవర్మ | ||
| నియోజకవర్గం | నరసాపురం | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1962 మే 14 విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం | ||
| రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ (2018 మార్చి - 2019), (2024-[1] ప్రస్తుతం) | ||
| ఇతర రాజకీయ పార్టీలు | * వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (2012–2014) (2019–2024[2])
| ||
| తల్లిదండ్రులు | కె.వి.యస్.సూర్యనారాయణ రాజు | ||
| జీవిత భాగస్వామి | రమాదేవి | ||
| సంతానం | ఇందిరా ప్రియదర్శిని, భరత్ | ||
| నివాసం | హైదరాబాద్ | ||
| పూర్వ విద్యార్థి | ఆంధ్ర విశ్వవిద్యాలయం | ||
| వృత్తి |
| ||
| మూలం | |||
కనుమూరు రఘురామకృష్ణ రాజు (జననం 14 మే 1962) ఒక భారతీయ పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు. ఈయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 23వ ఉప సభాపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన ఉండి నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా (MLA) ఎన్నికయ్యారు.
గతంలో ఆయన 17వ లోకసభలో నర్సాపురం నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడిగా (MP) ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు.[3]
ప్రారంభ జీవితం
[మార్చు]రఘురామకృష్ణ రాజు మే 14, 1962 న ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో కనుమురు వెంకట సత్య సూర్యనారాయణ రాజు, అన్నపూర్ణ దంపతులకు జన్మించారు. విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ ఫార్మసీ చదివాడు. [4] రాజు 1980 లో రమాదేవిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. [5]
రాజకీయ జీవితం
[మార్చు]రఘురామకృష్ణ రాజు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైయస్ఆర్సిపి) రాజకీయ నాయకుడు. 2014 లోక్‌సభ ఎన్నికలకు పార్టీ నామినేషన్‌ను దక్కించుకోలేక 2014 లో పార్టీ నుంచి తప్పుకుని భారతీయ జనతా పార్టీ (బిజెపి) లో చేరారు. 2018 లో బిజెపిని విడిచిపెట్టి, తెలుగు దేశం పార్టీ (టిడిపి) లో చేరారు. అనంతరం 2019 మార్చిలో వైఎస్‌ఆర్‌సిపిలో తిరిగి చేరారు. [6]
ఆయన 2019 ఎన్నికల్లో నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థిగా పోటీ చేశారు. టిడిపికి చెందిన వేటుకూరి వెంకట శివరామరాజు కంటే 31,909 ఓట్ల తేడాతో 38.11% ఓట్లు సాధించి ఎన్నికల్లో విజయం సాధించారు.
రఘురామ కృష్ణంరాజు 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో ఉండి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి పీ.వీ.ఎల్. నరసింహరాజుపై 56,421 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[7][8] ఆయన నవంబర్ 14న ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[9]
మూలాలు
[మార్చు]- ↑ Andhrajyothy (5 April 2024). "చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి రఘురామ". Archived from the original on 5 April 2024. Retrieved 5 April 2024.
- ↑ Prajasakti (24 February 2024). "రఘురామ కృష్ణంరాజు రాజీనామా – సిఎం జగన్‌కు లేఖ". Archived from the original on 5 April 2024. Retrieved 5 April 2024.
- ↑ "Raghu Rama Krishnam Raju joins TDP in presence of Chandrababu". ap7am.com (in ఇంగ్లీష్). 2024-04-05. Retrieved 2024-04-05.
- ↑ "Members : Lok Sabha - Kanumuru, Shri Raghu Ramakrishna Raju". Lok Sabha. Retrieved 2021-05-17.
{{cite web}}: CS1 maint: url-status (link) - ↑ "Members : Lok Sabha - Kanumuru, Shri Raghu Ramakrishna Raju". Lok Sabha. Retrieved 2021-05-17.
{{cite web}}: CS1 maint: url-status (link) - ↑ Apparasu, Srinivasa Rao (14 May 2021). "YSR Congress MP, who asked court to cancel bail to Jagan, arrested for sedition". Hindustan Times. Archived from the original on 16 May 2021. Retrieved 17 May 2021.
- ↑ EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ Eenadu (14 November 2024). "ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ ఏకగ్రీవ ఎన్నిక". Archived from the original on 14 November 2024. Retrieved 14 November 2024.