రఘువీర్ చౌదరి
రఘువీర్ చౌదరి | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | బాపుపుర, గాంధీ నగర్, గుజరాత్ | 1938 డిసెంబరు 5
వృత్తి | రచయిత, కవి, విమర్శకుడు. |
భాష | గుజరాతీ |
పురస్కారాలు | |
సంతకం |
రఘువీర్ చౌదరి ( జననం: 1938 డిసెంబర్ 5 ) గుజరాత్ రాష్టానికి చెందిన నవల రచయిత, కవి, విమర్శకుడు. ఈయన సందేశ్, జన్మభూమి, నిరీక్ష వంటి పత్రికలకు కాలమిస్ట్ గా వ్యవహరించారు. ఈయన గుజరాత్ యూనివర్సిటీలో అధ్యాపకునిగా విధులు నిర్వహించి, 1998లో రిటైర్ అయ్యారు. ఈయన గుజరాతి భాషలోనే కాకుండా హిందీ భాషలో కూడా రచించారు. ఈయన రచించిన ఉపర్వాస్ నవలకి 1977లో సాహిత్య పురస్కారం వరించింది. అదే కాకుండా సాహిత్యంలో అత్యుతమ పురస్కారం అయినా జ్ఞానపీఠ పురస్కారం 2015లో వరించింది.[1]
జననం
[మార్చు]ఈయన డిసెంబర్ 5, 1938 న గుజరాత్ రాష్టంలోని బాపుపుర గ్రామంలో దాల్సింగ్, జీతిబెన్ దంపతులకు జన్మించారు. వీరిది వ్యవసాయ ఆధారిత కుటుంబం. ఈయన ప్రాథమిక, ఇంటర్ విద్య గుజరాత్ రాష్టంలోని మానస నగరంలో అభ్యసించారు. డిగ్రీ విద్యను 1960లో గుజరాత్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. అదేవిధంగా 1979లో హిందీ బాషా సాహిత్యంపై మాస్టర్స్ ను గుజరాత్ విశ్వవిద్యాలయంలో అభ్యసించారు. ఇదేకాకుండా హిందీ, గుజరాతీ భాషల మూలాల మీద ఇదే విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ పట్టాను పొందారు. ఇతను నవనిర్మాణ్ ఉద్యమంలో పాల్గొన్నారు. 1970లో భారతదేశంలో విధించిన ఎమర్జెన్సీని ఈయన వ్యతిరేకించారు.
జీవిత విశేషాలు
[మార్చు]ఈయన 1977లో గుజరాత్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా విధులు నిర్వహించి 1998లో రిటైర్డ్ అయ్యారు. ఈయన 1998 నుంచి 2002 వరకు సాహిత్య అకాడమీలో సభ్యునిగా ఉన్నారు. ఇదేకాకుండా 2002 నుంచి 2004 వరకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యునిగా ఉన్నారు. 25వ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ లో జ్యూరీ సభ్యునిగా ఎన్నికయ్యారు. 2001 లో గుజరాతీ సాహిత్య పరిషత్ కి అధ్యక్షునిగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన తన స్వగృహమైన బాపుపుర గ్రామంలో వ్యవసాయం చేస్తున్నారు.
రచనలు
[మార్చు]ఈయన 80 కి పైగా పుస్తకాలు రచించారు. ఈయన నవలలు, కవితలు, నాటకాలపై, బాషా సాహిత్యంపై ఎక్కువగా పుస్తకాలు రచించారు. ఈయన రచనలు అత్యధికంగా గుజరాతీ భాషలోనూ, సందర్భానుసారంగా హిందీ భాషలో కూడా రచిస్తారు.
నవలలు
[మార్చు]1965లో భాషా అస్తిత్వం పై ఈయన రచించిన అమ్రిత నవల అందరి మన్నలను పొందింది. రుద్రమహాలయ, సొంతిర్త్ నవలలు చాలా ప్రాముఖ్యతను పొందాయి. అదే కాకుండా 1975లో ఈయన రచించిన త్రయ పుస్తకాలు ఉపార్వాస్, సహవాస్, అంతర్వస్ కి 1977లో సాహిత్య పురస్కారాన్ని తెచ్చిపెట్టాయి.
ఈయన రచించిన ప్రముఖ నవలలు - వత్సల (1967), పూర్వరంగ లాగ్ని (1976), సంజయా విన్నా చ్చుత పదవున్ (2003), ఏక్ దగ్ ఆగల్ బే దగ్ పాచ్చల్ (2009), ఆవరణ్
నాటకాలు
[మార్చు]ప్రఖ్యాత గుజరాత్ రచయిత చంద్రవదన్ మెహతా జీవిత ఆధారంగా రచించిన త్రిజో పురుష్ అందరి మన్నలను పొందింది. సికిందర్ సాని, డిమ్ లైట్ నాటకం ప్రాముఖ్యాన్ని పొందాయి
సాహిత్యం
[మార్చు]ఈయన రచనలు గుజరాతి భాషలోనే కాకుండా హిందీ భాషలో కూడా రచించేవారు. 1965లో ఇతను రచించిన తమాసా కథాసంపుటి భాషలో అంతరంగాన్ని వ్యక్తపరిచింది. ఇతను రచించిన మరో కథాసంపుటి వాహేత వ్రిక్ష పవన్మ 1985లో ప్రచురితమయింది
పురస్కారాలు
[మార్చు]మరిన్ని విశేషాలు
[మార్చు]ఈయన 80పైగా పుస్తకాలు రచించారు. ఈయన రచించిన ఉపర్వాస్ నవలకి 1977లో సాహిత్య పురస్కారం వరించింది. అదే కాకుండా సాహిత్యంలో అత్యుతమ పురస్కారమైన జ్ఞానపీఠ పురస్కారం 2015లో వరించింది. ఇవే కాకుండా ఇతను 1965-70 కాలంలో ఎన్నో అవార్డులను పొందారు. అందులో ప్రముఖంగా రంజిత్రం సువర్ణ చంద్రక్ అవార్డు, 1965లో కుమార చంద్రక్ అవార్డు, 1997లో మున్షి అవార్డులు ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Gujarati Litterateur Raghuveer Chaudhary honoured with 51st Jnanpith Award". mid-day. 2015-12-29. Retrieved 2015-12-29.
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with NLA identifiers
- 1938 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- గుజరాత్ వ్యక్తులు
- గుజరాతి సంస్కృతి
- గుజరాతీ రచయితలు
- జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు
- భారతీయ కవులు
- భారతీయ పురస్కారాల గ్రహీతలు
- కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు
- సాహితీకారులు