Jump to content

రణదీప్ గులేరియా

వికీపీడియా నుండి
రణదీప్ గులేరియా
జననం (1959-04-05) 1959 ఏప్రిల్ 5 (వయసు 65)
విద్యాసంస్థఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్, పిజిఐఎంఇఆర్
వృత్తిమాజి డైరెక్టర్, ఎయిమ్స్, ఢిల్లీ; పల్మనాలజిస్ట్
క్రియాశీల సంవత్సరాలు1997-ప్రస్తుతం
గుర్తించదగిన సేవలు
Till We Win
జీవిత భాగస్వామిడాక్టర్ కిరణ్ గులేరియా
పురస్కారాలుపద్మశ్రీ
డా. బి.సి.రాయ్ అవార్డు

రణదీప్ గులేరియా (ఆంగ్లం: Randeep Guleria; జననం 1959 ఏప్రిల్ 5) ఒక భారతీయ పల్మనాలజిస్ట్. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, న్యూఢిల్లీ మాజి డైరెక్టర్. ఎయిమ్స్ లో పల్మనరీ మెడిసిన్స్, స్లీప్ డిజార్డర్స్ కేంద్రాన్ని దేశంలో మొట్టమొదటిపారిగా స్థాపించిన ఘనతను పొందాడు. 2015లో భారత ప్రభుత్వం ఆయనను నాల్గవ అత్యున్నత భారతీయ పౌర పురస్కారమైన పద్మశ్రీతో సత్కరించింది. ఆయన భారతదేశంలో కోవిడ్-19 మహమ్మారిపై విశేష కృషి సల్పాడు.

ఇండియన్ పబ్లిక్ పాలసీ అండ్ హెల్త్ సిస్టం నిపుణుడు చంద్రకాంత్ లహరియా, వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి చెందిన గగన్‌దీప్ కాంగ్‌తో కలిసి రణదీప్ గులేరియా 'టిల్ వి విన్: ఇండియాస్ ఫైట్ ఎగైనెస్ట్ ది కోవిడ్-19 పాండమిక్' పుస్తకం రచించాడు.[1] ఈ పుస్తకాన్ని భారతదేశపు ప్రముఖ ప్రచురణకర్త పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రచురించి తక్షణ బెస్ట్ సెల్లర్‌గా మారింది.

రణదీప్ గులేరియా ప్రముఖ కార్డియాలజిస్ట్ పద్మశ్రీ జగదేవ్ సింగ్ గులేరియా కుమారుడు, సర్జన్‌ పద్మశ్రీ సందీప్ గులేరియాకి అన్నయ్య.

మూలాలు

[మార్చు]
  1. "India's Medical Experts Come Together To Pen A Book". Mumbai Mirror.{{cite web}}: CS1 maint: url-status (link)