Jump to content

రత్నాచల్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
రత్నాచల్ ఎక్స్‌ప్రెస్
Ratnachal Express
మర్రిపాలెం వద్ద విశాఖ నుండి విజయవాడ వెలుతున్నరత్నాచల్ ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంసూపర్ ఫాస్ట్ రైలు
తొలి సేవ03 అక్టోబరు, 1994
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ మధ్య రైల్వే
ప్రయాణికుల దినసరి సంఖ్యరెండవ తరగతి సిట్టింగ్ - 864, ఎసి చైర్ కార్ - 216
మార్గం
మొదలువిశాఖపట్నం
ఆగే స్టేషనులు9
గమ్యంవిజయవాడ
ప్రయాణ దూరం349 కి.మీ. (217 మై.)
సగటు ప్రయాణ సమయం5 గం. 55 ని. (షుమారుగా)
రైలు నడిచే విధంప్రతిరోజు
రైలు సంఖ్య(లు)12717 / 12718
సదుపాయాలు
శ్రేణులుఎసి చైర్ కార్, రెండవ తరగతి సిట్టింగ్, జనరల్ అన్-రిజర్వుడు
కూర్చునేందుకు సదుపాయాలుఅవును
ఆహార సదుపాయాలుపాంట్రీ కార్
చూడదగ్గ సదుపాయాలుప్రామాణిక భారతీయ రైల్వే కోచ్లు
సాంకేతికత
రోలింగ్ స్టాక్ఒకటి
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం110 km/h (68 mph) గరిష్టం
58 km/h (36 mph), ఆగుసమయములతో కలిపి
మార్గపటం
మర్రిపాలెం రైల్వే స్టేషన్ వద్ద రత్నాచల్ ఎక్స్‌ప్రెస్
రాజమండ్రి వద్ద రత్నాచల్ ఎక్స్‌ప్రెస్

రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ అనేది భారతీయరై ల్వేలు, దక్షిణ మధ్య రైల్వే జోన్ ద్వారా నిర్వహించబడు, విశాఖ పట్నం, విజయవాడ రైల్వే స్టేషన్ల మధ్య నడిచే రోజువారీ సేవలు వంటివి అందించే ఒక సూపర్‌ఫాస్ట్ నకు చెందిన ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది రైలు నెంబర్ 12717 గా[1] విశాఖపట్నం నుండి విజయవాడ వరకు, రైలు నెంబర్ 12718 గా [2] తిరోగమన దిశలో దక్షిణ మధ్య రైల్వే జోన్ ద్వారా నిర్వహించి, నడుపబడు చున్నది.

సర్వీస్

[మార్చు]

రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ మొత్తం 349 కిలోమీటర్ల దూరం 58 కి.మీ. / గం. (సగటున) 12717 రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌గా 5 గంటల 55 నిమిషాలు పడుతుంది. ఇది గంటకు 55 కి.మీ. / గం. పైన నడుస్తుంది కాబట్టి ఇది ఒక సూపర్‌ఫాస్ట్ రైలు, సర్‌చార్జి దీనికి వర్తిస్తుంది.

ట్రాక్షన్

[మార్చు]

లాలాగూడాకు చెందిన డబ్ల్యుఎపి7 ఇంజన్ ద్వారా విశాఖపట్నం నుండి విజయవాడకు, లాలాగూడాకు చెందిన డబ్ల్యుఎపి4 ఇంజన్ ద్వారా విజయవాడ నుండి విశాఖపట్నానికి ఈ రైలు నెట్టబడుతూ ఉంటుంది.[3]


సంఘటనలు

[మార్చు]
  • 2012 సెప్టెంబరు 15 : విజయవాడ నుంచి వైజాగ్ వెళ్తున్న రత్నాచల్ ఎక్స్ ప్రెస్ లోని డి-2 బోగీలో పొగలను గుర్తించినట్లు ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సమాచారం అందించడంతో స్టేషన్ అధికారులు రైలును నిలిపివేసి తనిఖీలు చేపట్టారు. గంటకుపైగా రైలును నిలిపివేయడం మూలంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
  • 2015 జూలై 7 : రత్నాచల్ ఎక్స్ ప్రెస్ విశాఖ నుండి విజయవాడ వెళుతోంది. రెండు గంటల ఆలస్యంగా రైలు వచ్చింది. కానీ దువ్వాడ - అనాకపల్లి వద్ద రైలు ముందుకు వెళ్లడం లేదని గుర్తించారు. కానీ రైలు ఇంజిన్ మాత్రం ఒక కిలో మీటర్ ముందుకెళ్లిపోయింది. ఈ సంఘటనని ఆలస్యంగా గుర్తించిన డ్రైవర్ రైలును నిలిపివేశాడు. సాంకేతిక లోపంతోనే ఈ సమస్య తలెత్తిందని పేర్కొంటున్నారు.
  • 2016 జనవరి 31 : కాపులను బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ కాపుగర్జన కార్యకర్తలు తుని రైల్వే స్టేషన్ లో చేపట్టిన ఆందోళన  ఉద్రిక్తంగా మారింది. తుని రైల్వే స్టేషన్ లో ఆగిపోయిన రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు  ఆందోళన కారులు నిప్పుపెట్టారు. బోగీలన్ని మంటల్లో కాలిపోయాయి. అంతకుముందు రాళ్లు రువ్వడంతో ఇంజిన్ ధ్వంసమైంది.[4] రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ 2016 ఫిబ్రవరి 8 నుంచి పట్టాలపైకి రానుంది. 17 బోగీలతో రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్దరించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. 2 ఏసీ ఛైర్‌కార్‌ బోగీలు, 8 సెకండ్‌ సిట్టింగ్‌, 4 సాధారణ ద్వితీయ శ్రేణి బోగీలు, ఒక వంటశాల బోగీ, రెండు సరకు, బ్రేక్‌ వ్యాన్‌ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
  • 2016 ఆగస్టు 8 : తుని రైల్వే స్టేషన్లో అగ్నికి ఆహుతైన రత్నాచల్‌ కు.. సోమవారం మాత్రం అక్కడి స్థానికులు పూల దండలతో స్వాగతం పలికారు. రత్నాచల్‌ డ్రైవర్‌కు పూలదండలు వేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వారం వ్యవధిలో తిరిగి రైలుబండి పట్టాల మీదకు ఎక్కటం పట్ల కోస్తా, గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు సంతోషం వ్యక్తం చేసారు [5]

కోచ్ల కూర్పు

[మార్చు]

రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఒక ఎసి చైర్ కార్, రెండవ తరగతి సిట్టింగ్, 6 జనరల్ రిజర్వేషన్ లేని కోచ్‌లు కలిగి ఉంది.

Loco 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24
SLR UR UR UR UR C2 C1 D8 D7 D6 D5 D4 D3 D2 PC D1 UR UR UR UR UR UR UR SLR

మూలాలు

[మార్చు]
  1. http://indiarailinfo.com/train/ratnachal-sf-express-12717-vskp-to-bza/1386/401/29
  2. http://indiarailinfo.com/train/ratnachal-sf-express-12718-bza-to-vskp/1387/29/401
  3. "About Ratnachal Express".
  4. "తునిలో ఉద్రిక్తత; రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు నిప్పు". Archived from the original on 2016-02-04. Retrieved 2016-05-27.
  5. "రత్నాచల్‌ ను కాల్చేసిన చోటే పూలతో స్వాగతం". Archived from the original on 2016-05-16. Retrieved 2016-05-27.

బయటి లింకులు

[మార్చు]

వీడియోలు

[మార్చు]