రబీంద్ర సంగీత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రబీంద్ర సంగీత్ (బెంగాలీ: রবীন্দ্রসঙ্গীত, IPA: [ɾobind̪ɾɔ soŋɡit̪]), ఆంగ్లంలో టాగూర్ గీతాలు గా పిలువబడేది, సాధారణంగా భారతదేశం మరియు ప్రత్యేకంగా బెంగాల్ సంగీత భావనకు క్రొత్త పరిమాణాన్ని అందించిన, రబీంద్రనాథ్ టాగూర్ స్వరపరచిన సంగీత రూపం.[1]

రబీంద్ర సంగీత్, భారతీయ శాస్త్రీయ సంగీతం మరియు సంప్రదాయ జానపద సంగీతం ఆధారంగా రూపొందింది.[2] టాగూర్ సుమారు 2,230 గీతాల్ని రచించాడు.

ప్రభావం మరియు ఉత్తరదాయిత్వం[మార్చు]

రబీంద్ర సంగీత్, బెంగాలీ సంస్కృతిపై ఎంతో బలమైన ప్రభావం చూపింది.[2] ఈ గీతాల్ని బెంగాల్‍కు చెందిన బంగ్లాదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ (భారతదేశం) లలో సాంస్కృతిక నిధులుగా భావిస్తారు.

వివిధ నేపథ్యాలను చూపే ఈ రబీంద్రసంగీత్ ఎంతో ప్రసిద్ధమైనది మరియు బెంగాలీ ఆచారాల పునాదిని రూపొందించింది, దీనిని ఆంగ్లం-మాట్లాడే ప్రపంచంపై షేక్స్పియర్ ప్రభావంతో పోల్చవచ్చు, బహుశా ఇది అంతకన్నా ఎక్కువ కూడా. అతడి గీతాలు బెంగాలీ సమాజం చవిచూసిన 500 ఏళ్ళ సాహిత్యం మరియు సాంస్కృతిక మథనానికి ఫలితమని చెబుతారు.

ధన్ గోపాల్ ముకర్జీ, అతడి పుస్తకం కాస్ట్ అండ్ అవుట్-కాస్ట్ లో, ఈ గీతాలు ప్రాపంచిక విషయాలను దైవికంగా మార్చివేస్తాయని మరియు మానవ ఉద్వేగాలలో అన్ని స్థాయిలు మరియు వర్గాలను వ్యక్తం చేస్తాయని చెప్పాడు. ఈ కవి పెద్దా చిన్నా, గొప్పా పేదా, అందరికీ గళాన్ని ఇచ్చాడు. గంగానదిపై నిరుపేద పడవనడిపేవాడు మరియు ధనవంతుడైన భూస్వామి కూడా టాగూర్ గీతాలలో వారి బాధల ఉద్వేగాలకు వ్యక్తీకరణను పొందుతారు.

రబీంద్రసంగీత్ ఒక విభిన్నమైన సంగీత శాఖగా రూపాంతరం చెందింది. ఈ శైలి అభ్యాసకులు, సంప్రదాయ పద్ధతులకు తీవ్ర రక్షకులుగా పరిగణించబడతారు. వినూత్న అర్థాలు మరియు వైవిధ్యాలు, పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ లలో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాయి. మరియు బీతొవెన్ యొక్క సింఫనీలు లేదా విలాయత్ ఖాన్ యొక్క సితార్ లాగే, ఆయన రచించిన రబీంద్రసంగీత్ యొక్క స్వరరచనల గీత ప్రత్యేకతను అర్థం చేసుకోవడానికి విద్యావంతులు, తెలివైన వారు మరియు సంస్కారవంతులైన ప్రేక్షకులు కావలసి ఉంటుంది.

సినిమాకి దాని స్వంత భాష ఉండాలని ఆయన మొట్టమొదట గుర్తించారు. 1929లో, అతడు “ఈ కదిలే రూపాల అందం మరియు గొప్పతనం, పదాల ఉపయోగం లేకుండానే వ్యక్తమయే విధంగా స్వయం-సమృద్ధి పొందేలా అభివృద్ది చెందాలి” అని వ్రాసాడు. టాగూర్ గీతాలలోని సహజమైన అందం మరియు లోతు కారణంగా ఎందరో చిత్రదర్శకులు తమ చిత్రాల్లో టాగూర్ గీతాలను వాడారు, వారిలో సత్యజిత్ రే, రిత్విక్ ఘాతక్, మ్రిణాల్ సేన్, నితిన్ బోస్, తపన్ సిన్హా మరియు కుమార్ షహనిలు ఉన్నారు.అంతేకాక, అతడి గీతాలు బ్రిటిష్, యూరోపియన్ & ఆస్ట్రేలియన్ చిత్రాల్లో, చిత్ర సందర్భం యొక్క భావాన్ని చెప్పడానికి మరియు సంబంధాల సున్నితమైన అల్లికనూ తెలియజేయడానికి వాడడం జరిగింది.

రిత్విక్ ఘాతక్, టాగూర్ గురించి ఇలా చెప్పాడు, “నేను పుట్టడానికి చాలా మునుపే అతడు నా భావాలన్నిటినీ వ్యక్తపరిచాడు… నేను అతడిని చదివాను మరియు నాకు తెలిసిందేమిటంటే...నేను క్రొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు.” తన మేఘే ఢాకా తారా (మేఘం కమ్మిన తార) మరియు సుబర్ణరేఖ లలో, ఘాతక్ విభజన-తరువాతి బెంగాల్ యొక్క విషాదాన్ని వ్యక్తం చేయడానికి రబీంద్రసంగీత్ ఉపయోగించాడు.

టాగూర్ వ్రాసిన రెండు గీతాలు భారతదేశం మరియు బంగ్లాదేశ్ జాతీయగీతాలు. ఇవి:

రబీంద్రసంగీత్ యొక్క విశిష్టత[మార్చు]

టాగూర్ 1941లో మరణించాడు, కానీ అతడి వైశిష్ట్యం మరియు అతడి గీతాల ప్రభావం అమరమైనవి. అతడి గీతాలలోని నిర్మలమైన కవిత్వం, సృష్టికర్త, ప్రకృతి మరియు ప్రేమలను ఏకం చేసింది. మానవ ప్రేమ (ప్రేమ్) చివరికి సృష్టికర్త పట్ల ప్రేమ మరియు అంకితభావంగా (భక్తీ) రూపాంతరం చెందుతుంది. అతడి 2000 పైగా గీతాల సముదాయాన్ని గీతబితన్ (గీతాల తోట) గా పిలుస్తారు. ఈ పుస్తకం యొక్క నాలుగు ప్రధాన భాగాలు, పూజ (పూజ), ప్రేమ్ (ప్రేమ), ప్రకృతి (ప్రకృతి) మరియు బిచిత్ర (విభిన్నం). కానీ, ఈ విభజనలు ఎన్నో గీతాలలో కలిసిపోవడం జరుగుతుంది. వర్షాల గురించిన ఒక గీతంలో ప్రియుడి/ప్రియురాలి కొరకు విరహవేదన కనిపించవచ్చు. ఒక ప్రేమగీతం చివరికి సృష్టికర్త పట్ల ప్రేమగా పరిణమించవచ్చు. ఇక్కడ ఒక గీతం యొక్క మొదటి రెండు వాక్యాలు ఇవ్వబడ్డాయి:

দাঁড়িয়ে আছ তুমি আমার গানের ওপারে
আমার সুরগুলি পায় চরণ আমি পাইনে তোমারে

నీవు నా గీతం పరిధి దాటి ఉన్నావు. నా సంగీతం నీ పాదాలను తాకుతుంది, కానీ నిన్ను చేరుకోలేదు.

రబీంద్రసంగీత్ గాయకులు[మార్చు]

కొందరు ప్రసిద్ధ రబీంద్రసంగీత్ గాయకులు వీరు:

 • కనికా బంద్యోపాధ్యాయ్: ఆమె అసలు పేరు "అణిమ" కానీ టాగూర్ ఆమె పేరు "కనికా"గా మార్చారు మరియు అబనీంద్రనాథ్ టాగూర్ ఆమెను మొహర్గా పిలిచేవారు, ఆమె యొక్క అభిమాన శ్రోతలు ఎందరో ఆమెను ఈ పేరుతోనే పిలుస్తారు.
 • దేబబ్రత బిస్వాస్: ఇతడిని రబీంద్రసంగీత్ యొక్క ద్వితీయ వ్యక్తిగా పిలుస్తారు మరియు ఇతడిది అతి ప్రసిద్ధ పురుష గాత్రం.
 • సుమన్ చటర్జీ
 • స్వాగతలక్ష్మి దాస్ గుప్తా
 • బనని ఘోష్
 • శాంతిదేవ్ ఘోష్: రబీంద్రనాథ్ టాగూర్ మరియు దినేంద్రనాథ్ టాగూర్ల ప్రత్యక్ష శిష్యుడు.
 • కిషోర్ కుమార్
 • సుచిత్రా మిత్రా: కనికా బంద్యోపాధ్యాయ్ లాగే, సుచిత్రా కూడా మరొక రబీంద్ర సంగీత్ యొక్క స్త్రీ ప్రారంభాకురాలు మరియు ప్రవీణురాలు. ఎందరో సమకాలీన గాయకులు సుచిత్రా మరియు కనికాల శిష్యులు.
 • హేమంత కుమార్ ముఖోపాధ్యాయ్: అతడు బెంగాలీ సమకాలీన మరియు హిందీ గీతాలు కూడా పాడినప్పటికీ, రబీంద్రసంగీత్ అతడికి అమిత ఇష్టం. అతడు రబీంద్రసంగీత్ ను బెంగాలీ జనాభా యొక్క అన్ని విభాగాలలోనూ ప్రసిద్ధి చెందేలా చేయడంలో ప్రముఖ పాత్ర వహించాడు.
 • పంకజ్ మలిక్: ఇతడినే రబీంద్రసంగీత్ యొక్క ప్రథమ వ్యక్తిగా పిలుస్తారు.
 • సుబినోయ్ రాయ్
 • నీలిమా సేన్: ఈమె సంగీత్ భవన్ ప్రిన్సిపాల్ గా పనిచేసింది మరియు అక్కడ ప్రస్తుతం రబీంద్ర సంగీత్ నేర్పే స్వస్తికా ముఖోపాధ్యాయ్ ఆమె శిష్యురాలు.
 • ఇంద్రనీల్ సేన్
 • లోపముద్రా మిత్రా

రబీంద్రసంగీత్ బోధకులు[మార్చు]

భారతదేశం[మార్చు]

కొందరు ప్రసిద్ధ రబీంద్రసంగీత్ బోధకులు (స్వయంగా టాగూర్ మినహా) వీరు:

 • దినేంద్ర నాథ్ టాగూర్
 • శాంతిదేబ్ ఘోష్
 • రుమా గుహ తాకుర్తా
 • సుచిత్రా మిత్రా
 • కనికా బంద్యోపాధ్యాయ్
 • సుబినోయ్ రాయ్
 • నీలిమా సేన్

బంగ్లాదేశ్[మార్చు]

బంగ్లాదేశ్ లో, క్రొత్త గాయకుల అభివృద్ధికి విశేష కృషి చేసిన రబీంద్రసంగీత్ శిక్షకులు వీరు:

 • అబ్దుల్ అహద్
 • అనిసుర్ రెహమాన్
 • రెజ్వాన చౌదురీ బన్యా
 • అబ్దుల్ వదూద్

సంస్థలు[మార్చు]

 • రబీంద్ర భారతి విశ్వవిద్యాలయం
 • దక్షిణీ

గమనికలు[మార్చు]

 1. ఘోష్, పు. xiii
 2. 2.0 2.1 Huke, Robert E. (2009). "West Bengal". Encyclopædia Britannica. Encyclopædia Britannica Online. Retrieved 2009-10-06.

సూచనలు[మార్చు]

మరింత చదవటానికి[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]

 • http://www.rabindrasangeet.org అనేది టాగూర్ గీతాలపై ఉచితమైన మరియు బహిరంగ సమాచార భాండాగారం. ఇందులో అన్ని టాగూర్ గీతాల గేయాలూ మరియు స్వరాలూ ఉన్నాయి. ఈ గేయాల్ని పదాల ఆధారంగా వెతుకవచ్చు.
 • http://www.rabindrasangeet.com రబీంద్ర సంగీత్ పై మరింత