Jump to content

రమేశ్‌బాబు ప్రజ్ఞానంద

వికీపీడియా నుండి
ఆర్. ప్రజ్ఞానంద
పూర్తి పేరురమేష్ బాబు ప్రజ్ఞానంద
దేశంఇండియా
పుట్టిన తేది (2005-08-10) 2005 ఆగస్టు 10 (వయసు 19)
చెన్నై, తమిళనాడు, ఇండియా
టైటిల్గ్రాండ్ మాస్టర్ (2018)
ఫిడే రేటింగ్2727 (సెప్టెంబర్ 2023)
అత్యున్నత రేటింగ్2727 (సెప్టెంబర్ 2023)
ర్యాంకింగ్19 (సెప్టెంబర్ 2023)
అత్యున్నత ర్యాంకింగ్19 (సెప్టెంబర్ 2023)

తమిళనాడులోని చెన్నైలో 2005లో జన్మించిన రమేశ్‌బాబు ప్రజ్ఞానంద, ప్రపంచంలోనే అతి పిన్న వయసులో  గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించిన అభిమన్యు మిశ్రా, సెర్గీ కర్జాకిన్, గుకేష్ డి,జావోఖిర్ సిందరోవ్ తరువాత గ్రాండ్ మాస్టర్ (GM) టైటిల్ సాధించిన ఐదవ-పిన్న వయస్కుడు. ఆన్‌లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీ అయిన ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ ఎనిమిదో రౌండ్‌లో ప్రపంచ నెంబర్ వన్ ఛాంపియన్ మాగ్నస్   కార్ల్‌సెన్‌ను ఓడించడంతో ప్రపంచ ప్రసిద్ధి చెందాడు.[1]

క్రీడా ప్రస్థానం

[మార్చు]

2013లో అండర్ 8 వరల్డ్ యూత్ చెస్ ఛాంపియన్‌షిప్ గెలిచిన ప్రజ్ఞానంద, ఏడేళ్ల వయసులో ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ మాస్టర్ టైటిల్ సాధించి, 7 సంవత్సరాల వయస్సులోనే ఫిడే మాస్టర్ బిరుదు పొందాడు. 2015లో అండర్-10 టైటిల్‌ను గెలుచుకున్నాడు.

2016 వ సంవత్సరం లో, ప్రజ్ఞానంద 10 సంవత్సరాల, 10 నెలల, 19 రోజుల వయస్సులో చరిత్రలో అతి పిన్న వయస్కుడైన అంతర్జాతీయ మాస్టర్‌గా నిలిచాడు. 2017 నవంబరులో ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో తన మొదటి గ్రాండ్‌మాస్టర్ హోదాను సాధించాడు. 2018 ఏప్రిల్ 17న గ్రీస్‌లో జరిగిన హెరాక్లియన్ ఫిషర్ మెమోరియల్ గ్రాండ్ మాస్టర్ నార్మ్ టోర్నమెంట్‌లో తన రెండవ హోదా పొందాడు. 2018 జూన్ 23న ఇటలీలోని ఉర్టిజీలో జరిగిన గ్రెడిన్ ఓపెన్‌లో ఎనిమిదో రౌండ్‌లో లూకా మొరోనిని ఓడించడం ద్వారా తన మూడవ  హోదాను సాధించి, 12 సంవత్సరాల, 10 నెలల, 13 రోజుల వయస్సులో, అప్పటి రెండవ అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. అతని కంటే ముందు  కర్జాకిన్ 12 సంవత్సరాల 7 నెలల వయస్సులో సాధించాడు.

2018 జనవరిలో, నార్త్ కరోలినాలోని షార్లెట్‌లో జరిగిన షార్లెట్ చెస్ సెంటర్ వింటర్ 2018 గ్రాండ్ మాస్టర్ నార్మ్ ఇన్విటేషనల్‌లో 5.0/9 స్కోర్‌తో ప్రజ్ఞానంద గ్రాండ్ మాస్టర్ ఆల్డర్ ఎస్కోబార్ ఫోరెరో, డెనిస్ ష్మెలోవ్‌లతో కలిసి మూడవ స్థానంలో నిలిచాడు.

2019 అక్టోబరు 12న, అండర్-18 విభాగంలో 9/11 స్కోర్‌తో ప్రపంచ యూత్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. [2] 2019 డిసెంబరులో, 2600 రేటింగ్ సాధించిన రెండవ అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.  దీన్ని 14 సంవత్సరాల, 3 నెలల 24 రోజుల వయస్సులో చేసాడు.

ప్రజ్ఞానంద టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ 2022 మాస్టర్స్ విభాగంలో ఆడాడు. ఆండ్రీ ఎసిపెంకో, విదిత్ గుజరాతీ, నిల్స్ గ్రాండేలియస్‌లపై గేమ్‌లు గెలిచి, చివరి స్కోరు 5½తో 12వ స్థానంలో నిలిచాడు.

2022 ఫిబ్రవరి 20న, ఆన్‌లైన్ ర్యాపిడ్ టోర్నమెంట్‌లో ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్తో జరిగిన గేమ్‌లో గెలిచిన మూడవ భారతీయ ఆటగాడిగా నిలిచాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. vamshikrishna (2022-02-22). "Praggnanandhaa : ఎవరీ ప్రజ్ఞానంద... ప్రపంచ నెంబర్ వన్ నే మట్టికరిపించాడు..!". www.tv5news.in (in ఇంగ్లీష్). Retrieved 2022-02-22.
  2. "Rameshbabu Praggnanandhaa", Wikipedia (in ఇంగ్లీష్), 2022-02-22, retrieved 2022-02-22