Jump to content

రమేష్ బాలప్ప భూసనూర్

వికీపీడియా నుండి
రమేష్ బాలప్ప భూసనూర్

పదవీ కాలం
2021 నవంబర్ 2 – 2023 మే 13
ముందు ఎం.సి. మనగులి
పదవీ కాలం
2008 – 2018
ముందు అశోక్ గురప్ప షాబాది
తరువాత ఎం.సి. మనగులి
నియోజకవర్గం సిందగి

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

రమేష్ బాలప్ప భూసనూర్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు సిందగి శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

రమేష్ బాలప్ప భూసనూర్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2008 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో సిందగి శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి ఎం.సి. మనగులిపై 14761 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2013 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి ఎం.సి. మనగులిపై 752 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి రెండవసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

రమేష్ బాలప్ప భూసనూర్ 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో సిందగి శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి ఎం.సి. మనగులి చేతిలో 9,305 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 2021లో ఎం.సి. మనగులి మరణించడంతో సిందగి నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి అశోక్ ఎం. మనగూలిపై 31,185 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడవసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4][5]

రమేష్ బాలప్ప భూసనూర్ 2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి అశోక్ ఎం. మనగూలి చేతిలో 7,808 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-03.
  2. "List of elected members of the Karnataka Legislative Assembly". kar.nic. Retrieved October 9, 2017.
  3. "Sindagi Constituency bypoll Result 2021". Election Commission of India. 2 November 2021. Archived from the original on 23 April 2025. Retrieved 23 April 2025.
  4. "Karnataka bypolls: Home turf Hanagal loss raises questions on CM Bommai's leadership" (in ఇంగ్లీష్). The Indian Express. 2 November 2021. Archived from the original on 23 April 2025. Retrieved 23 April 2025.
  5. "Karnataka bypolls results: BJP wins Sindgi, Congress wins in Hangal" (in Indian English). The Hindu. 2 November 2021. Archived from the original on 23 April 2025. Retrieved 23 April 2025.
  6. "Karnataka Assembly Elections 2023: Sindagi". Election Commission of India. 13 May 2023. Archived from the original on 23 April 2025. Retrieved 23 April 2025.