రమ గోవిందరాజన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రమ గోవిందరాజన్
జననం
నివాసంహైదరాబాదు
జాతీయతభారతీయులు
మాతృ సంస్థIIT, Delhi
Drexel University, Philadelphia
IISc Bangalore
పర్యవేక్షకుడురొద్దం నరసింహ

రమ గోవిందరాజన్, భారతీయ శాస్త్రవేత్త. ఆమె భౌతిక శాస్త్ర విభాగమైన ప్రవాహి గతిశాస్త్రం (ఫ్లూయిడ్ డైనమిక్స్)లో  కృషి చేసింది. జవహర్ లాల్ నెహ్రూ  సెంటర్ ఫర్  అడ్వాన్స్‌డ్  సైంటిఫిక్  రీసెర్చ్ లోని   ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసారు. [1] ప్రస్తుతం హైదరాబాదు లోని టి.ఐ.ఎఫ్.ఆర్  సెంటర్ ఫర్ ఇంటర్  డిసిఫ్లినరీ సైన్సెస్ నందు ప్రొఫెసర్ గా పనిచేయుచున్నారు. [2]  ఆమెకు 2007 లో శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం లభించింది.

విద్య[మార్చు]

అమె 1984లో ఐ.ఐ.టి., ఢిల్లీ నుండి కెమికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) లో పట్టాను పొందారు. ఆమె అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన ఫిలడెల్ఫియా  లోని డ్రెక్సెల్  విశ్వవిద్యాలయం నుండి  మాస్టర్స్  డిగ్రీని పూర్తిచేసారు. ఆమె 1994 లో  బెంగళూరు నందు  గల  ఇండియన్  ఇనిస్టిట్యూట్  ఆఫ్ సైన్స్  నుండి  ఆరోస్పేస్  ఇంజనీరింగ్  లో పి.హెచ్.డి చేసారు.  ఆమె కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ  లో 1994 నుండి ఆరోనాటిక్స్  పోస్టు  డాక్టరల్ రీసెర్చ్  విభాగంలో  పనిచేయుచున్నారు. [3]

కెరీర్[మార్చు]

ఆమె శాస్త్రవేత్తగా తన జీవితాన్ని బెంగళూరు లోని నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ లోని ప్రవాహి గతిశాస్త్ర విభాగంలో  ప్రారంభించారు. అక్కడ 1988 నుండి 1998 వరకు  ఒక దశాబ్దం పాటు  పనిచేసారు. తరువాత  ఆమె 1998 నుండి 2012  వరకు జవహర్  లాల్ నెహ్రూ సెంటర్ ఫర్   అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్  విభాగంలో ఫాకల్టీ సభ్యురాలిగా పనిచేసారు. 2012  నుండి ఆమె  టిఐఎఫ్‌ఆర్ సెంటర్ ఫర్  ఇంటర్  డిసిప్లినరీ  సైన్సెస్ లో ప్రొఫెసర్ గా కొనసాగుతున్నారు. ఆమె తన ప్రత్యేక రంగమైన  ప్రవాహి గతిశాస్త్రంలో అనేక సాంకేతిక పత్రాలను ప్రచురించారు. కొన్ని పుస్తకాలను కూడా ప్రచురించారు. ఆమె ప్రధాన పరిశోధన ఆసక్తులు అస్థిర ప్రవాహాల కల్లోలభరితతకు, అస్థిరతకు, ఇంటర్ఫేషియల్ ప్రవాహాల భౌతిక శాస్త్రానికి సంబంధించినవి.[4][5]

పురస్కారాలు[మార్చు]

ఆమెకు అనేక పురస్కారాలు వచ్చాయి. అందులో ప్రసిద్ధమైనది 2007 లో శాంతిస్వరూప్ భట్నాగర్ పురస్కారం. 1987 లో  ఆమెకు యంగ్ సైంటిస్టు పురస్కారం, 1996 లో  అవుట్ స్టాండింగ్  సైంటిస్టు పురస్కారం, 2004 లో  సి.ఎన్.రావు  ఓరేషన్ పురస్కారాలు  లభించాయి. [6]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-03-20. Retrieved 2018-01-11.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-11-22. Retrieved 2018-01-11.
  3. "Rama Govindarajan". Archived from the original on 22 నవంబరు 2016. Retrieved 15 March 2014.
  4. "Noted Women Scientists of India – an attempt at enumeration". Retrieved 15 March 2014.
  5. "Lilavati's Daughters:Dream Your Dream" (PDF). Retrieved 15 March 2014.
  6. "Shanti Swarup Bhatnagar prize for the year 2007 & 2008". Retrieved 15 March 2014.

ఇతర లింకులు[మార్చు]