రవికృష్ణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రవికృష్ణ
జననంఎ. ఎం. రవికృష్ణ
(1983-03-02) 1983 మార్చి 2 (వయస్సు: 36  సంవత్సరాలు)
ముంబై, మహారాష్ట్ర
వృత్తిసినీ నటుడు
క్రియాశీలక సంవత్సరాలు2004-2011

రవికృష్ణ (జననం: మార్చి 2, 1983) ఒక దక్షిణ భారతీయ సినీ నటుడు. తమిళ, తెలుగు సినిమాల్లో నటించాడు. రవికృష్ణ ప్రముఖ నిర్మాత ఎ. ఎం. రత్నం తనయుడు. తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ రూపొందించిన ద్విభాషా చిత్రం 7G బృందావన్ కాలనీ సినిమాతో తన కెరీర్ ప్రారంభించాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

రవికృష్ణ మార్చి 2, 1983న ముంబైలో జన్మించాడు. పాఠశాల విద్య పూర్తయిన తర్వాత మల్టీమీడియాలో బి.ఏ డిగ్రీ కోసం లండన్ వెళ్ళాడు.[1] అక్కడ పెంటామీడియా సంస్థలో ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ లో డిప్లోమా చేశాడు. శాం మీడియా సంస్థ నుండి నాన్ లీనియర్ ఎడిటింగ్ లో కోర్సు చేశాడు.[1] అప్పటికి అతనికి నటుడవ్వాలని కోరిక ఉండేది కాదు. సెలవుల కోసం భారత్ కు వచ్చినపుడు తనను నటించేందుకు ఎంచుకున్నారు.[2]

కెరీర్[మార్చు]

తన తండ్రి నిర్మాణ సారథ్యంలో సెల్వరాఘవన్ రెండో చిత్రమైన 7G బృందావన్ కాలనీ తో రవికృష్ణ సినీరంగ ప్రవేశం చేశాడు. అది విమర్శకుల ప్రశంసలందుకోవడమే కాకుండా మంచి వసూళ్ళు కూడా రాబట్టింది. ఆ ఏడాది రవికృష్ణకు ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ దక్షిణాది పురస్కారం లభించింది[3] ఇవే కాకుండా ఈ సినిమాకు మరి కొన్ని పురస్కారాలు కూడా లభించాయి.[2] ఇది తెలుగు తమిళంలో కూడా మంచి విజయం సాధించింది.[4][5][6] ఈ సినిమాలో నటించడానికి ముందు రవికృష్ణ లండన్ లోని కింగ్స్ కాలేజీలో నెలరోజుల పాటు శిక్షణ తీసుకున్నాడు.[6][7]

దీని తర్వాత ఎస్. ఏ చంద్రశేఖర్ దర్శకత్వంలో శుక్రన్ అనే సినిమాలో నటించాడు.[8][9]. తరువాత తన సోదరుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో కేడి అనే సినిమాలో నటించాడు. ఈసినిమాలకు మిశ్రమ స్పందన వచ్చి యావరేజీ గా ఆడాయి. డైరెక్టుగా తెలుగులో నటించిన మొదటి సినిమా బ్రహ్మానందం డ్రామా కంపెనీ కూడా అతనికి నిరాశను మిగిల్చింది.[1] తరువాత వచ్చిన నిన్న నేడు రేపు సినిమా మంచి సమీక్షలనుందుకుంది. 2009 లో తెలుగు సినిమా గమ్యంకు తమిళ రీమేక్ అయిన కాదల్నా సుమ్మ ఇల్లై సినిమాతో విజయం సాధించాడు.[10] తర్వాత వచ్చినఅరణ్య కాండం, సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "Ravi Krishna interview – Telugu Cinema interview – Telugu film actor". Idlebrain.com. 3 October 2008. Retrieved 18 October 2011. Cite web requires |website= (help)
  2. 2.0 2.1 "Entertainment Chennai / Interview : Into his third, with hope and zeal". The Hindu. India. 12 August 2005. Retrieved 18 October 2011.
  3. "National : "Autograph" bags 3 Filmfare awards". The Hindu. India. 10 July 2005. Retrieved 18 October 2011.
  4. "List of Telugu films released in year 2004". Idlebrain.com. 30 December 2004. Retrieved 18 October 2011. Cite web requires |website= (help)
  5. "Top Ten Telugu films of 2004". Sify.com. Retrieved 18 October 2011. Cite web requires |website= (help)
  6. 6.0 6.1 "AM Ratnam – A chitchat about 7/G Brindavan Colony – Telugu Cinema". Idlebrain.com. 26 December 2004. Retrieved 18 October 2011. Cite web requires |website= (help)
  7. "Transcript of the chat Ravi Krishna". Sify.com. 19 August 2005. Retrieved 18 October 2011. Cite web requires |website= (help)
  8. [1]
  9. "Movie Review:Ponniyin Selvan". Sify.com. Retrieved 18 October 2011. Cite web requires |website= (help)
  10. "Actor Ravikrishna – Interview – Behindwoods.com – Tamil Movie Actor Interviews – Kaadhalna Summa Illa Aaranya Kandam Netru Indru Naalai". Behindwoods.com. 21 January 2009. Retrieved 18 October 2011. Cite web requires |website= (help)

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=రవికృష్ణ&oldid=2023671" నుండి వెలికితీశారు