Jump to content

రవి ప్రకాష్ వర్మ

వికీపీడియా నుండి
రవి ప్రకాష్ వర్మ

పదవీ కాలం
2014  2020
తరువాత సీమా ద్వివేది
నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్

పదవీ కాలం
2009  2014
ముందు రవి ప్రకాష్ వర్మ
తరువాత అజయ్ కుమార్ మిశ్రా
నియోజకవర్గం ఖేరీ

వ్యక్తిగత వివరాలు

జననం (1960-08-26) 1960 ఆగస్టు 26 (వయసు: 65)
ఖేరీ, ఉత్తరప్రదేశ్, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ సమాజ్‌వాది పార్టీ
జీవిత భాగస్వామి అనితా వర్మ
సంతానం 2
నివాసం ఖేరీ, ఉత్తర ప్రదేశ్
వృత్తి రాజకీయ నాయకుడు

రవి ప్రకాష్ వర్మ(జననం 26 ఆగస్టు 1960) భారతదేశానికి చెందిన జర్నలిస్ట్, రాజకీయ నాయకుడు. ఆయన ఖేరీ లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై,[1] 2014లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు

రాజకీయ జీవితం

[మార్చు]

రవి ప్రకాష్ వర్మ సమాజ్‌వాది పార్టీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఖేరీ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి గెందన్ లాల్ కనౌజియాపై 57881 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1994 లోక్‌సభ ఎన్నికలలో ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాజేంద్ర కుమార్ గుప్తాపై 4515 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

రవి ప్రకాష్ వర్మ 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఖేరీ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి దౌద్ అహ్మద్ పై 57881 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2009 లోక్‌సభ ఎన్నికలలో ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి 153491 ఓట్లతో 4వ స్థానంలో, 2014 ఎన్నికలలో 160112 ఓట్లతో 4వ స్థానంలో నిలిచాడు.[2]

రవి ప్రకాష్ వర్మ 2014లో ఉత్తర ప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. "Kheri Lok Sabha Election". Hindustan Times. 1 July 2025. the original నుండి 1 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2025.
  2. "Kheri Lok Sabha Election Result - Parliamentary Constituency". Result University. 1 July 2025. the original నుండి 1 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2025.
  3. "Parrikar, 9 others elected unopposed to RS". Business Standard. 13 November 2014. the original నుండి 1 June 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 June 2025.
  4. "11 new members take oath in Rajya Sabha". The Times of India. 26 November 2014. the original నుండి 1 June 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 June 2025.