Jump to content

రవి వడ్లమాని

వికీపీడియా నుండి
రవి వడ్లమాని
జననం (1956-07-21) 1956 జులై 21 (వయసు: 69)
గుంటూరు , India
విశ్వవిద్యాలయాలుఆంధ్రా యూనివర్సిటీ
వృత్తిఛార్టర్డ్ ఎకౌంటెంట్
భార్య / భర్తరాజ్య లక్ష్మి
పిల్లలు2

రవి వడ్లమాని (జననం 1956 జూలై 21) భారత దేశానికి చెందిన ఒక చార్టర్డ్ అకౌంటెంట్.[1][2]

విద్య , వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆంధ్ర విశ్వ విద్యాలయం , కు చెందిన తెల్లాకుల జాలయ్య , పోలిశెట్టి సుందరం కళాశాల, గుంటూరు నుండి రవి వడ్లమాని బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని పొందారు. తన చార్చర్డ్ అకౌంటెన్సీ అయిన తర్వాత ఆయన యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా లో ఫండ్ మేనేజర్స్ కోర్సు చేశారు [3]


వృత్తి

[మార్చు]

రవి వడ్లమాని తన చార్చర్డ్ అకౌంటెన్సీ వృత్తిని M/s ఉమహేశ్వరరావు & కంపెనీలో ప్రారంభించారు.[4]

ఒక నేత లక్షణాలు వారికి చిన్నప్పటి నుండే ఉన్నాయి . చార్చర్డ్ అకౌంటెన్సీ దక్షిణ ప్రాంత సభ్యుడిగా అయిదు రాష్ట్రాలకు సభ్యుడిగా 1988 నుండి 1991 వరకు మూడు సంవత్సరాల పాటు ప్రాతినిధ్యం వహించడానికి ఎన్నికయ్యారు .[5]

సేవా కార్యక్రమాలు

[మార్చు]

వడ్లమాని రోటరీ ఇంటర్నేషనల్ సంస్థలో ఉండి అనేక సాంఘిక సేవా కార్యక్రమాలలో పాల్గొన్నాడు. ఆయన మొదట్లో 2001-2002 సంవత్సరాలలో ఆయన రోటరీ డిస్ట్రిక్ట్ 3150 కి డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ఎన్నికయ్యారు.

ఆయన ఆధ్వర్యంలో , జీవనానికి అత్యవసరమయిన రక్షిత తాగు నీటిని ప్రజలకు అందించడానికి , ఎత్తుగా ఉంచబడిన నీటి తొట్టెల నుండి గొట్టాల ద్వారా " జీవించడానికి నీరు " అన్న పధకం కింద నీరు పంపిణీ చేశారు. ఈ పని కొత్తగూడెం, కటారివారిపాలెం, నిజాంపట్నం, పిడుగురాళ్ళ ప్రాంతాల్లో జరిగింది .[6]

. ఎముకల ఫ్లోరోసిస్ బారిపడి ఉన్న ప్రజలు ఎక్కువగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు , ప్రకాశం జిల్లాలు, తెలంగాణ లోని అనేక జిల్లాలలో 5 కోట్ల రూపాయల  వ్యయంతో,  300 కి పైగా రివర్స్ ఓస్మోసిస్ వాటర్ ప్లాంట్లను అందించిన ప్రాజెక్టులో ఆయన ముఖ్య సూత్రధారి. [7]


బాల కార్మికులను ,కూలీ పని చేసే వారి పిల్లలను బడులకు పంపే ఉద్దేశ్యంతో ఆయన 'స్కూల్ ఆన్ వీల్స్( చక్రాల పై బడి) ' అనే కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేశారు. బాలబాలికలను కార్మికులుగా పనిచేయడాన్ని ఆపే ప్రయత్నంగా గుంటూరు లో 'స్కూల్ ఆన్ వీల్స్' లో భాగంగా 'బాల బాలికలు, పోలీస్' కార్యక్రమం ద్వారా రూ 12.5 లక్షల రూపాయల వ్యయంతో బస్సును అందించారు.[8] మౌలిక సదుపాయాలు లేని పాఠశాలలను, వసతులతో ఆనందమయమయిన పాఠశాలలుగా మార్చడానికి "మన పాఠశాలలను రక్షించడానికి చేతులు చాచండీ " అనే ప్రాజెక్టును ప్రారంభించడానికి వడ్లమాని ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమం కింద, అతను కొత్త పాఠశాల భవనాలు, బాలురు, బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు నిర్మించడానికి దీక్ష తీసుకున్నాడు.ref>Jonathan, P. Samuel (5 August 2016). "Joy of learning in 'Happy Schools'". The Hindu – via www.thehindu.com.</ref> ఆయన సొంత ఖర్చులతో, తెలంగాణ పాఠశాలలకు ఐదు లక్షల బెంచీలను ఉచితంగా పంపిణీ చేసే బాధ్యతను తీసుకున్నారు. గత ఆరేళ్లలో 30 కోట్ల రూపాయల విలువ చేసే 1.20 లక్షల బెంచీలను పంపిణీ చేయగలిగారు.[9] ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలోని వివిధ పాఠశాలల్లో వివిధ పాఠశాల బ్లాకులు ,మరుగుదొడ్లు నిర్మించబడ్డాయి.[10][11]


రోటరీ ఇంటర్నేషనల్ చేపట్టిన 'షేర్' (శానిటేషన్, హెల్త్ అండ్ రూరల్ ఎంపవర్మెంట్) ప్రాజెక్ట్ కింద అర్హులయిన లబ్ధిదారులను ఆయన గుర్తించి , గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మహిళలకు 10,000 కుట్టు యంత్రాలు, వేలాది పాలు ఇచ్చే పశువులను అందించారు. అంతేకాక 50 గ్రామాల్లో పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించారు.[12]

వడ్లమాని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి , గుంటూరు శాఖకు అద్యక్షుడిగా పనిచేశారు.[13]

రోటరీ ఇంటర్ నేషనల్ వడ్లమాని ని సునామి బాధితుల సహాయార్థం ఏర్పరిచిన సెల్ కి సంయోజకుడిగా నియమించింది . ఆయన తన హోదాలో, చాక చక్యంతో అంతర్జాతీయ సంస్థ జిఇ క్యాపిటల్పై ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) చొరవ కింద , సునామీ బాధితులకు సహాయం చేయవలసిన అవసరాన్ని చెప్పి వారిని ఒప్పించారు. వారి సహాయంతో, వడ్లమాని సర్వస్వం కోల్పోయిన అనేక మంది మత్స్యకారులకు ఏడు మోటారు ఫైబర్ బోట్లు , 30 ఫిషింగ్ నెట్స్ లను, పంచారు. దీనికి 14 లక్షల రూపాయల వ్యయం అయింది. [14].

వడ్లమాని ప్రతిభ, అనుభవాన్ని గుర్తించి ఆయనను అంతర్జాతీయంగా అనేక రోటరీ జిల్లాలలో అతిథి వక్త గా పిలిచే వారు. అమెరికా లోని కొలరాడో స్ప్రింగ్స్ జిల్లా5470, ఇంగ్లండ్ లోని జిల్లా 1100 ,ఆస్ట్రేలియా జిల్లా 9640 ఆయన ఉపన్యాసలే దీనికి ఉదాహరణలు. [15] అతను రోటరీ లో డైరెక్టర్స్ నామినేటింగ్ కమిటీ లో 2009, 2015 లో సభ్యుడు . అతను 2007 , 2016 లలో కౌన్సిల్ ఆన్ రిప్రజెంటేటివ్స్ లో ప్రతినిధిగా కూడా ఉన్నాడు.[16] రవి వడ్లమాని చేసిన కృషి లో వారి సతీమణి వెనక ఉండి అదే బాటలో నడిచారు . . ఆమె కూడా రోటరీ 3150 జిల్లా గవర్నర్ గా పనిచేశారు[17]. పోలియో నిర్మూలన కోసం వారు చేసిన కృషికి 'ప్రాంతీయ పోలియో రహిత అవార్డు' లభించడంతో వారికి గుర్తింపు లభించింది[18] రవి, రాజీ దంపతులకు, రోటరీ ఫౌండేషన్ ద్వారా స్థాయీ -4 దాతలుగా గుర్తింపు వచ్చింది.[19]

అవార్డులు

[మార్చు]

బాహ్య లింకులు

[మార్చు]

రోటరీ ఇంటర్నేషనల్ uamaheswarararao

మూలాలు

[మార్చు]
  1. "Umamaheswara Rao & Co". Umrcas.com.
  2. "Pass the virtual tapas please". October 2002.
  3. "About Us | Umamaheswara Rao & Co".
  4. "Umamaheswara Rao & Co". Umrcas.com.
  5. "About Us | Umamaheswara Rao & Co".
  6. "Rotary provides potable water in Piduguralla slums". The Hindu. 30 March 2011. Retrieved 27 May 2019.
  7. Virginian, The News. "newsvirginian.com". The News Virginian.
  8. "Drive against child labour". The Times of India.
  9. "Ravi Vadlamani, the Bench Man of Hyderabad". Telangana Today.
  10. Staff Reporter (2 July 2016). "Rotary Foundation distributes 2,900 school desks". The Hindu.
  11. Staff Reporter (11 September 2013). "'Save our Schools' programme gains momentum". The Hindu.
  12. ADKISON, LINDSEY (7 June 2017). "Rotary Club of St. Simons aids Indian programs". The Brunswick News.
  13. "Cheque presented for Red Cross building". The Hindu. 8 December 2016.
  14. "GE Capital joins Rotary in tsunami relief". The Hindu. March 2005.[dead link]
  15. Tregurtha, Ravi Vadlamani, Benjamin Franklin, Kofi Annan, Water, Rtn Maragaret Hayes, John. "Water for life Dr. Ravi Vadlamani At Rotary International District 9640 Conference Water for life. - ppt download". slideplayer.com.{{cite web}}: CS1 maint: multiple names: authors list (link)[permanent dead link]
  16. Loehle, Lucy (5 July 2017). "Rotary welcomes speaker from India". The Brunswick News.
  17. "A couple with many facets". The Hindu. 5 July 2004.[dead link]
  18. "A couple with many facets". The Hindu. 5 July 2004.[dead link]
  19. "Donor spotlight - centennial.rotary.org". Centennial.rotary.org.
  20. "Honorary doctorate for Veturi, two others". The Hindu. 26 July 2007.