రవీందర్ సింగ్ నేగి
| రవీందర్ సింగ్ నేగి | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2025 ఫిబ్రవరి 8 | |||
| ముందు | మనీష్ సిసోడియా | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | పట్పర్‌గంజ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
రవీందర్ సింగ్ నేగి ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో పట్పర్‌గంజ్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]రవీందర్ సింగ్ నేగి భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో పట్పర్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి మనీష్ సిసోడియా చేతిలో 3,207 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2022 ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి ఆప్ అభ్యర్థిని 2,311 ఓట్ల తేడాతో ఓడించాడు.[3]
రవీందర్ సింగ్ నేగి 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి అవధ్ ఓజాపై 28,072 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4] ఆయన 74,060 ఓట్లతో విజేతగా నిలవగా, అవధ్ ఓజా 45,988 ఓట్లుతో రెండోస్థానంలో నిలిచాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Delhi Assembly Election Results 2025: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). The Indian Express. 8 February 2025. Archived from the original on 8 February 2025. Retrieved 8 February 2025.
- ↑ "Who is Ravinder Singh Negi: The man whose feet PM Modi touched thrice during Delhi election rally" (in ఇంగ్లీష్). Financialexpress. 30 January 2025. Archived from the original on 8 February 2025. Retrieved 8 February 2025.
- ↑ "Man whose feet Modi touched: Ravinder Singh Negi, the Patparganj candidate who has been in the news" (in ఇంగ్లీష్). The Indian Express. 30 January 2025. Archived from the original on 8 February 2025. Retrieved 8 February 2025.
- ↑ "Delhi Assembly election 2025: Complete list of winners" (in ఇంగ్లీష్). CNBCTV18. 8 February 2025. Archived from the original on 9 February 2025. Retrieved 9 February 2025.
- ↑ "Delhi Assembly Elections Results 2025 - Patparganj". Election Commission of India. 8 February 2025. Archived from the original on 8 February 2025. Retrieved 8 February 2025.